ketamine
-
తువాళ్లలో కేటమైన్ రవాణా
ముంబై: నిషేధిత కేటమైన్ మాదకద్రవ్యాన్ని తువాళ్లలో నానబెట్టి కొరియర్ల ద్వారా ఆస్ట్రేలియాకు తరలించడానికి యత్నించిన ముగ్గురు ఆఫ్రికన్లను అరెస్టు చేశామని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) శుక్రవారం ప్రకటించింది. కేటమైన్‌ను నానబెట్టిన 74 తువాళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. నిందితులు ఎమ్మాన్యుయేల్, క్రిస్టియన్ జీకర్, లారిండో రమోస్‌ను ముంబైలో గురువారం అరెస్టు చేశామని తెలియజేసింది. ఎమ్మాన్యుయేల్ దక్షిణ ముంబైలో నివాసముంటున్నాడని ఎన్సీబీ తెలిపింది. ఆపరేషన్ల సమయంలో రోగులకు మత్తు కలిగించడానికి డాక్టర్లు కేటమైన్‌ను ఉపయోగిస్తారు. దీనిని వినియోగించిన వారికి రకరకాల భ్రాంతులు కలుగుతాయి. అందుకే బార్లు, నైట్‌క్లబ్బుల్లో టీనేజ్ యువతి దీనిని వినియోగిస్తోందని ఎన్సీబీ తెలిపింది. ఇదిలా ఉంటే మరో రకం మాదకద్రవ్యం కొకైన్‌ను కలిగి ఉన్న కేసులో యశ్‌బిర్లా గ్రూపు ఉన్నతాధికారి ఆనంద్ వర్ధన్, మరో ఇద్దరిని కూడా ఎన్సీబీ అరెస్టు చేసింది. వీరికి కొకైన్ సరఫరా చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 11న ఈ ముగ్గురిని ముంబైలోని ఒక హోటల్లో అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా అరెస్టయిన ముగ్గురు ఆఫ్రికా జాతీయులకు స్థానిక కోర్టు ఈ నెల 20 వరకు ఎన్సీబీ కస్టడీ విధించింది. ‘భారత్‌లో వీళ్లు ఎక్కడి నుంచి కేటమైన్ తీసుకువచ్చారు.. ఇది వరకు ఎన్నిసార్లు దానిని విదేశాలకు రవాణా చేసేంది తెలుసుకునేందుకు నిందితులను ప్రశ్నిస్తాం’ అని ఎన్సీబీ అధికారి ఒకరు తెలిపారు. -
రూ.118 కోట్ల విలువైన కేటమైన్ స్వాధీనం
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో రూ.118 కోట్ల విలువ ఉండే 1.2 టన్నుల కేటమైన్ మాదకద్రవ్యాన్ని డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జల్గావ్ జిల్లాలోని రుఖ్మా ఇండస్ట్రీస్‌లో ఇది శుక్రవారం రాత్రి దొరికింది. ఈ ముఠా సూత్రధారి వికాస్పురితోపాటు ఐదుగురిని అరెస్టు చేశారు. కేటమైన్ తయారీకి లెసైన్సు లేకున్నా రుఖ్మా యాజమాన్యం దీనిని ఉత్పత్తి చేస్తోందని డీఎఆర్ఐ తెలిపింది. ఇక పురిని పొవాయిలో శనివారం అరెస్టు చేసిన అధికారులు ఇతని ఇంట్లో రూ.1.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేటమైన్ విక్రయంతోనే ఈ మొత్తం వచ్చినట్టు భావిస్తున్నారు. అయితే రుఖ్మా ఇండస్ట్రీస్ యజమాని నితిన్ చించోలేను అరెస్టు చేయాల్సి ఉంది. -
డ్రగ్స్ వ్యాపారంలో కొత్త పుంతలు.. కీటమైన్ పొడి తయారీ!
డ్రగ్స్ వ్యాపారంలో హైదరాబాద్ నగరం సరికొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న మొన్నటి వరకు విదేశాల నుంచి లేదా ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే డ్రగ్స్ దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించేవాళ్లు. ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. శస్త్రచికిత్స సమయంలో రోగులకు నొప్పి తెలియకుండా మత్తు కలిగించే 'కీటమైన్ హైడ్రోక్లోరైడ్' అనే పదార్థాన్ని మాదకద్రవ్యాలుగా మార్చి నగరంలో విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. దీన్నుంచి పొడిని తయారుచేసి దాన్ని నిషాకోసం వాడిస్తూ యువత బలహీనతను సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో వివిధ రకాల మాదకద్రవ్యాలు వాడుతూ లేదా అమ్ముతూ పలువురు పట్టుబడినా, ఈ తరహాలో కొత్తరకం మాదకద్రవ్యం, అది కూడా ఇక్కడే తయారుచేసి అమ్మడం మాత్రం ఇదే తొలిసారని పోలీసులు కూడా అంటున్నారు. ఈ తరహా వ్యూహం పోలీసులనే దిమ్మతిరిగేలా చేసింది. కమిషనరేట్ చరిత్రలోనే ఈ తరహా ముఠాలు పట్టుబడటం ఇది తొలిసారని పోలీసులే చెప్పారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. కంప్యూటర్ హార్డ్‌వేర్‌లో శిక్షణ పొందిన ఫెరోజ్ అహ్మద్ అనే వ్యక్తి తన క్లాస్మేట్ నుంచి ఈ కీటమైన్ పొడి తయారుచేయడం నేర్చుకుని, దానికి బానిస అయ్యాడు. తర్వాత దాని అమ్మకాలు కూడా మొదలుపెట్టాడు. అత్యంత తేలిగ్గా ఈ పొడిని అతడు తయారుచేస్తున్నాడు. స్టీలు గిన్నెలో మూడో వంతు నీరు పోసి.. దానిపై స్టీల్ ప్లేటు మూతవేస్తాడు. ప్లేటుపై కీటమైన్ ఇంజెక్షన్ సీసాలోని ద్రవాన్ని పోస్తాడు. గిన్నెలోని నీటిని 10 నుంచి 20 నిమిషాలు మరిగిస్తాడు. నీటి ఆవిరి ప్రభావంతో గిన్నెపై ఉన్న ప్లేటు వేడెక్కుతుంది. అంతే.. కీటమైన్లోని ద్రవం ఆవిరైపోయి పొడి మాత్రమే మిగులుతుంది. 10 మిల్లీలీటర్ల ఇంజెక్షన్‌ను రూ.100కు కొనుగోలు చేసి, గ్రాము పొడిని తయారు చేస్తున్నాడు. దాన్ని 2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నాడు. చివరకు పోలీసుల నిఘాలో పట్టుబడ్డాడు.