khadarlinga
-
ఖాదర్లింగ స్వామి దర్గాలో ఉగాది వేడుకలు
కౌతాళం: జగద్గురు ఖాదర్లింగ స్వామి దర్గాలో బుధవారం ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా.. గ్రామంలో ఉన్న బ్రహ్మణులు ముందుగా దర్గాలో వెళ్లి ప్రత్యేక పూజలు చేసి ఆతరువాత పంచాంగం శ్రవణం చేస్తారు. ఈ సంప్రదాయం 350 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం 8గంటలకు గ్రామ పూరోహితులు కిష్టచారి..దర్గాలో పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం చేయగా.. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహె బ్పీర్ హుసేని చిష్తీ, భక్తులు, కౌతాళం హిందూ, ముస్లిం సోదరులు శ్రద్ధగా విన్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ఎర్ర ధాన్యాన్నికి మంచి ధర ఉంటుందని, పంటలు బాగా పండుతాయని తెలిపారు. మకర, కర్కాటక, సింహ, తుల, వృషభ, కుంభ రాశుల వారికి బాగుంటుందని తెలిపారు. గుల్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు నజీర్హమ్మద్, ఖాదర్లింగ స్వామి శిష్యులు పాల్గొన్నారు. -
ఘనంగా జియారత్ వేడుకలు
కౌతాళం: కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్లింగ స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం జియారత్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్గా ధర్మకర్త సయ్యద్ సాహెబ్పీర్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి మ«ధ్యాహ్నం వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు చేశారు. అనంతరం ఖాదర్లింగ శిష్యరికం పొందిన వారికి, కొత్త పక్కీర్లుగా మారిన వారికి నూతన వస్త్రాలను దానం చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖాదర్బాషా చిష్తీ స్వామి తీర్థాన్ని వారికి ఇచ్చారు. అనంతరం సలాముల ఆలపాన తర్వాత పక్కీర్లను సాగనంపే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుల్షన్ కమిటీ గౌరవఅధ్యక్షడు, అధ్యక్షడు నజీర్అహ్మద్, మున్నపాష, గ్రామ పెద్దలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.