ఘనంగా జియారత్‌ వేడుకలు | grand celebration of khadarlinga swamy jeyarath | Sakshi
Sakshi News home page

ఘనంగా జియారత్‌ వేడుకలు

Published Thu, Aug 18 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

ఘనంగా జియారత్‌ వేడుకలు

ఘనంగా జియారత్‌ వేడుకలు

కౌతాళం: కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగ స్వామి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గురువారం జియారత్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్గా ధర్మకర్త సయ్యద్‌ సాహెబ్‌పీర్‌ ఆధ్వర్యంలో ఉదయం నుంచి మ«ధ్యాహ్నం వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు చేశారు. అనంతరం ఖాదర్‌లింగ శిష్యరికం పొందిన వారికి, కొత్త పక్కీర్లుగా మారిన వారికి నూతన వస్త్రాలను దానం చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖాదర్‌బాషా చిష్తీ స్వామి తీర్థాన్ని వారికి ఇచ్చారు. అనంతరం సలాముల ఆలపాన తర్వాత పక్కీర్లను సాగనంపే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గుల్షన్‌ కమిటీ గౌరవఅధ్యక్షడు, అధ్యక్షడు నజీర్‌అహ్మద్, మున్నపాష, గ్రామ పెద్దలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement