k.haribabu
-
మోదీ ఏపీ పర్యటన వాయిదా
సాక్షి, అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన వాయిదాపడింది. జులై 15,16 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించతలపెట్టిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా , బీజేపీ పాలిత 13 మంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రుల సహా దాదాపు 250 మంది బీజేపీ ఆగ్రనేతలు పాల్గోనాల్సి ఉంది. ప్రతి మూడు నెలలకొకసారి జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఈ సారి విశాఖపట్నంలో నిర్వహించాలని భువనేశ్వర్‌లో జరిగిన గత సమావేశాల్లో పార్టీ నిర్ణయించింది. అయితే, రాష్ట్రపతి ఎన్నికల నేపధ్యంలో జులై 15, 16వ తేదీల్లో విశాఖలో జరగాల్సిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తాత్కాలిక వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయించినట్టు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె. హరిబాబు శనివారం వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిపై పోటీ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ మిగిలిన ప్రతిపక్ష పార్టీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడడం.. రాష్ట్రపతి ఎన్నికకు జులై 17వ పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించిన నేపధ్యంలో కార్యవర్గ సమావేశాలను కొద్దిరోజులు వాయిదా వేసుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశాలు ముందుగా అనుకున్నట్టు విశాఖపట్నంలోనే కొనసాగుతాయని పార్టీ పేర్కొనగా, సమావేశాలు జరిగే తేదీలను పార్టీ తిరిగి ప్రకటించాల్సి ఉంది. -
'అసాంఘిక శక్తులు అధికమయ్యాయి'
విశాఖపట్నం: శాంతి భద్రతల కోసం అప్లికేషన్స్ ను ఉపయోగించే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు కె.హరిబాబు పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. మహిళల భద్రత కోసం ఐక్లిక్ విధానాన్ని మంగళవారం విశాఖపట్నంలో ఏపీ హోం మంత్రి చినరాజప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరిబాబు మాట్లాడుతూ...ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగించాలని ఆయన పోలీసులుకు హితవు పలికారు. పోలీసుల బలహీనతలు, పనితీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయని... ఈ నేపథ్యంలో ఓ సారి పునసమీక్షించుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. విశాఖలో గతంలో కంటే అసాంఘిక శక్తుల కార్యకలాపాలు అధికమైయ్యాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో శాంతియుత వాతావరణం కల్పించకపోతే ఏ పారిశ్రామిక వేత్త విశాఖకు రారని అన్నారు. గతంలో నగరంలో పోలీస్ శాఖలో చోటు చేసుకున్న తప్పులను సమీక్షించాలని కొత్త సీపీ అమిత్ గార్గ్ కి కె.హరిబాబు హితవు పలికారు. -
'పోలవరం త్వరితగతిన పూర్తి చేయండి'
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు కె.హరిబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్ మేరకే నిర్మాణం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం డిజైన్‌పై ఎవరికైనా అనుమానాలుంటే కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే రూ. 5200 కోట్లు ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు. -
పోలవరంపై పట్టువిడవద్దు: హరిబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు కట్టుబడుతూనే సీమాంధ్ర సమస్యల పరిష్కారానికి పార్టీ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రాంత బీజేపీ నేతలు నిర్ణయించారు. పార్టీ పదాధికారుల సమావేశం మంగళవారం గుంటూరులో జరి గింది. కె.హరిబాబు సమావేశాన్ని ప్రారంభిస్తూ ఇటీవలి తమ ఢిల్లీ పర్యటన వివరాలను, పార్టీ కేంద్రనాయకులు చెప్పిన విషయాలను వివరించారు. సీమాంధ్రుల సమస్యలకు పరిష్కారం చూపిన తర్వాతే బిల్లుకు మద్దతు ఇచ్చేలా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాలని సమావేశంలో అత్యధికులు అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు తొలిప్రాధాన్యం ఇవ్వకపోతే భావితరాలు నష్టపోయే ప్రమాదం ఉందని, అందువల్ల చట్టపరమైన రక్షణ కల్పిం చేలా బిల్లులోనే ప్రతిపాదనలు ఉండేలా చూడాలని నిర్ణయానికొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు రాకుండా ముంపునకు గురయ్యే ప్రాంతాలన్నింటినీ ఆంధ్రాలోనే కల పాలని.. నీటివనరుల పంపిణీ పర్యవేక్షణకు ఒక సంఘాన్ని నియమించాలంటూ పార్టీ నాయకత్వాన్ని కోరాలని నిర్ణయించారు. మరోసారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయానికొచ్చారు. పార్టీ జాతీయ నేతలను కలిసేందుకు హరి బాబును బుధవారం ఢిల్లీకి పంపాలని సమావేశం తీర్మానించింది. సీనియర్ నేత బి.రంగమోహనరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి నేతలు, సోము వీర్రాజు, శాంతారెడ్డి, సురేష్‌రెడ్డి, జె.శ్యాంకిషోర్, వై.రఘునాధ్‌బాబు, శ్రీని వాసరాజుతో పాటు 13జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో ప్రొఫెసర్ శేషగిరిరావు పోలవరం ప్రాజెక్టు అవశ్యకతను వివరిస్తూ పవర్‌పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిని సమావేశానికి ఆహ్వానించలేదు.