Kharif and Rabi season
-
వరించిన అదృష్టం...రైతు మోములో వెల్లివిరిసిన సంతోషం
వ్యవసాయంలో లాభాలు పొందాలంటే కష్టజీవి శ్రమకు తోడు అదృష్టం ఉండాలి. రెండో కారు వరి పంట రైతుకు కలసొచ్చింది. ఎన్నో ఆశలతో రబీలో రైతు వరి సాగు చేయగా వరుణుడు కరుణించగా.. పుడమి తల్లి దీవించింది. చీడపీడల బారిన పడకుండా పంటను రక్షించుకుంటూ.. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. నూర్పిళ్లు పూర్తయి ధాన్యాన్ని ఇంటికి చేర్చుతున్నాడు. ఈ క్రమంలో మద్దతు ధర ఊరిస్తుండటంతో రైతు మోములో సంతోషం వెల్లివిరిస్తోంది. కోవెలకుంట్ల: ఖరీఫ్ సీజన్లో తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలు, చీడపీడలు, వాతావరణం అనుకూలించకపోవడంతో వరి రైతులు నష్టాలు చవిచూశారు. ఆ నష్టాన్ని రబీసీజన్‌లో పూడ్చుకోవాలని భావించిన అన్నదాతకు రెండు కారు పంట కలిసోచ్చింది. పంట చేతికంది దిగుబడులు ఆశాజనకంగా మారటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది రబీలో ఎండ కారు పంటగా 48 వేల ఎకరాల్లో 555, ఎంటీయూ 1010, ఆర్ఎన్ఆర్ 15,048 రకాలకు చెందిన వరి సాగు చేయాల్సి ఉండగా బోర్లు, బావులు, చెరువులు, కేసీకెనాల్, కుందూనది, పాలేరు, రిజర్వాయర్ల పరిధిలో 50,791 ఎకరాల్లో సాగైంది. ఇందులో బండిఆత్మకూరు మండలంలో అత్యధికంగా 10,609 ఎకరాలు, పాణ్యంలో 6,674, రుద్రవరం 6,202, మహానందిలో 5,358, ఆళ్లగడ్డలో 4,949, నంద్యాలలో 3,105, శిరివెళ్లలో 2,788, గడివేముల మండలంలో 2,078 ఎకరాల్లో సాగు చేశారు. 120 రోజుల పంటకాలం కలిగిన వరిలో ఇప్పటి వరకు 95 శాతం మేర కోత, నూర్పిడి పనులు పూర్తి కాగా మరో వారం రోజుల్లో పనులన్నీ పూర్తి కానున్నాయి. పెరిగిన పెట్టుబడులు జిల్లాలోని ఆయా మండలాల్లో రబీ వరిసాగులో ఈ ఏడాది పెట్టుబడులు పెరిగాయి. రసాయన ఎరువులు, నారు, క్రిమి సంహారక మందులు, కూలీలు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20వేలు వరకు వెచ్చించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అధిక తేమ శాతం కారణంగా వరిని కాండం తొలుచు పురుగు ఆశించి నష్టం చేకూర్చింది. పురుగు బారి నుంచి పైరును కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. రెండు దఫాలు అదనంగా క్రిమి సంహారక మందు పిచికారీ చేసి పురుగు బారి నుంచి పంటను రక్షించుకున్నారు. పురుగు కారణంగా ఎకరాకు రూ. 2వేల నుంచి రూ. 3వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. పురుగు తీవ్రత లేకుంటే మరో ఐదు బస్తాల దిగుడులు వచ్చేవని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాలు దిగుబడులు వచ్చాయి. ఖరీఫ్ సీజన్‌తో పోల్చుకుంటే రబీలో దిగుబడులు ఆశాజనకంగా మారటంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఆశలు రేకెత్తిస్తున్న మద్దతు ధర వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతోపాటు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. వీటితోపాటు అన్ని రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్‌లో పండిన కర్నూలు, నంద్యాల సోనా రకం వడ్లు బస్తా రూ. 1,850 వరకు ధర పలికాయి. రబీలో పండిన ఎండకారు వడ్లు బస్తా మార్కెట్లో రూ. 1,200 నుంచి రూ. 1,300 వరకు ఉంది. ఈ ధరకు ధాన్యం విక్రయిస్తే పెట్టుడులు పోనూ ఎకరాకు రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం చేకూరనుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుతో ఖరీఫ్ సీజన్లో నష్టపోయినా రబీలో వాతావరణం అనుకూలంగా మారి దిగుబడులు ఆశాజనకంగా లభించి గిట్టుబాటు ధర ఉండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎకరాకు 40 బస్తాల దిగుబడి ఈ ఏడాది ఎండకారు పంటగా సాగు చేసిన వరి రైతులకు అనుకూలంగా మారింది. ఖరీఫ్‌లో అధిక వర్షాలతో కాస్త దిగబడులు తగ్గాయి. రబీ సీజన్లో సంజామల మండలంలోని ఆయా గ్రామాల్లో 683 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడులు వచ్చాయి. –సుధాకర్‌రెడ్డి, ఏఓ, సంజామల మండలం 1.8 ఎకరాల్లో సాగు చేశా నాకున్న 1.8 ఎకరాల్లో ఈ ఏడాది రబీ సీజన్లో 555 రకానికి చెందిన వరి సాగుచేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడికి సంబంధించి ఎకరాకు రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాను. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాను. – నాగభూషణం, రైతు, గిద్దలూరు, సంజామల మండలం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నాకున్న రెండు ఎకరాల్లో ఎండకారు వరి సాగు చేశాను. ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయాలు జరిపింది. అదే తరహాలోనే ఇప్పుడు కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలి. –వెంకటపతి రెడ్డి రైతు, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం (చదవండి: -
కేంద్ర రుణాల్లో రాష్ట్రం కోత!
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్నట్టు ఉంది రాష్ర్ట ప్రభుత్వ వ్యవహారం... రైతులకు వ్యవసాయ రుణాల కింద రూ.38 వేల కోట్లు ఇస్తామంటూ కేంద్రం ప్రకటిస్తే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏడు వేల కోట్లు తక్కువగా రూ.30,995 వేల కోట్లతో వ్యవసాయ రుణ ప్రణాళికను తయారుచేసింది. పైగా ఇది గతేడాది కంటే రూ.3,771 కోట్లు ఎక్కువంటూ గొప్పలకు పోయింది. కేంద్ర అధికారుల చీవాట్ల తో చివరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ. 30,995 కోట్లు కేటాయిస్తూ మంగళవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) సమావేశం లో నిర్ణయించారు. దానిని ప్రభుత్వం కూడా ఆమోదించిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రకటించిన వ్యవసాయ రుణలక్ష్యాల్లో తెలంగాణకు రూ.38 వేల కోట్లుగా పేర్కొంది. ఇది రాష్ర్టం నిర్దేశించుకున్న వ్యవసాయ రుణప్రణాళికకు రూ.7వేల కోట్లు తక్కువ. దీనిపై కేంద్ర అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. నాబార్డు సూచనలు తుంగలో తొక్కిన కలెక్టర్లు... ఖరీఫ్, రబీ సీజన్లలో వ్యవసాయ పంట, టర్మ్, అనుబంధ రంగాల రుణాలు ఏ మేరకు ఉండాలనే దానిపై నాబార్డు కొన్ని ప్రతిపాదనలు తయారుచేస్తుంది. ఆ ప్రకారం ఈ ఏడాది కూడా జిల్లాల వారీగా ప్రతిపాదనలు తయారుచేసి కలెక్టర్లకు పంపింది. నాబార్డు ఇచ్చిన ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ సమావేశాలు నిర్వహించింది. బ్యాంకర్లు, వ్యవసాయఅధికారులతో కూడిన కమిటీ ఆయా జిల్లాలకు ఎంత రుణం అవసరమో నివేదిక తయారుచేసి ఎస్ఎల్బీసీకి పం పించింది. విచిత్రమేంటంటే నాబార్డు రూ. 35,179 కోట్లు అవసరమని అంచనా వేస్తూ ప్రతి పాదనలు పంపిస్తే రూ. 30,995 కోట్లు మాత్రమే అవసరమని కలెక్టర్లు నివేదికలు పంపించారు. దీనిపై నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో దీనిపై వాడీవేడి చర్చ జరి గినట్లు తెలిసింది. నాబార్డు అధికారులు చెప్పేవరకు కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. నాబార్డు విమర్శల నేపథ్యంలో తాజాగా ప్రకటించిన వ్యవసాయ రుణప్రణాళికను సవరించే యోచనలో సర్కారు ఉంది. మళ్లీ జిల్లాల నుంచి సవరింపుతో రుణ ప్రణాళిక నివేదిక తెప్పించుకొని రూ. 38 వేల కోట్లతో రుణప్రణాళికను తయారు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. -
కొనుగోళ్లపై విస్తృత ప్రచారం
సిద్దిపేట జోన్ : ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల పరిధిలోని గ్రామాల్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని గత నెల 13న ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ప్రతీ గ్రామానికి రూ.200 చొప్పున ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ బడ్జెట్ మిసిలేనియస్ పద్దు నుంచి ఖర్చు చేయవచ్చంటూ అధికారాన్ని అప్పగించింది. వివరాల్లోకి వె ళితే.. జిల్లాలో మెదక్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, జహీరాబాద్, నర్సాపూర్, అందోల్, సంగారెడ్డి, పటాన్చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో 18 మార్కెట్ కమిటీలున్నాయి. వీటి పరిధి కింద ఉన్న ఆయా గ్రామాల్లో 2014-15 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి రైతు పంట ఉత్పత్తులు పత్తి, మొక్కజొన్న, వరిలకు మద్దతు ధర అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రణాళిక రూపొందించింది. అందుకు అగుణంగానే పత్తి, మొక్కజొన్న, వివిధ రకాల ఉత్పత్తులు కొనుగోళ్లకు సంబంధించి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కమిషనర్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం కోసం, రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా కరపత్రాలు, గోడ, పత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించి అతికించాలని అదే విధంగా దండోరా ద్వారా రైతులకు ఎంఎస్‌పీపైన అవగాహన కల్పించాలని సీజన్‌కు ముందే స్పష్టమైన ఆదేశాలు అందాయి. కానీ వాటి నిర్వహణ ఖర్చు బాధ్యత విషయంలో సందిగ్ధత నెలకొనడం, సీజన్లో ఆయా గ్రామాల్లో సాధ్యమైనంత రీతిలో ప్రచారాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే సంబంధిత ప్రచార ఖర్చును మార్కెట్ కమిటీకి సంబంధించిన బడ్జెట్ మిసిలేనియస్ పద్దు నుంచి ఖర్చు చేసుకోవచ్చంటూ కార్యదర్శులకు పూర్తి అధికారాలను అప్పగించారు. దీనికి సంబంధించి ప్రతి గ్రామానికి ప్రచార నిమిత్తం రూ. 200లను గ్రామ సేవలకు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని, అట్టి నిధుల వివరాలను గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ నిబంధనలను కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఖరీఫ్ ధాన్యం, కొనుగోళ్ల సీజన్ పూర్తి కావస్తున్న క్రమంలో ప్రచార నిర్వహణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నామంటూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనరేట్ నుంచి ఈ నెల 3న జిల్లాలోని మార్కెట్ కమిటీ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆకస్మిక తనిఖీల్లో ప్రచారంపై అలసత్వం బహిర్గతమైతే క్రమశిక్షణ చర్యలను సైతం తీసుకుంటామంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒక వైపు ప్రచార నిర్వహణ ఖర్చుపై సందిగ్ధంలో ఉన్న మార్కెట్ కమిటీ అధికారులకు పరిష్కార మార్గం చూపిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామంటూ శ్రీ ముఖాల జారీకి సిద్ధం కావడం అధికారులను అయోమయానికి గురి చేస్తుంది. ఏదేమైనా ప్రభుత్వం మద్ధతు ధర విషయాన్ని క్షేత్రస్థాయి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత పరిచేందుకు నిధులను కేటాయించడం హర్షించదగ్గ విషయమేనంటూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
మిల్లర్ల సంచిలో సర్కారు బియ్యం
►గాడి తప్పిన కస్టమ్ మిల్లింగ్ ►2,47,429 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వని మిల్లర్లు ► ప్రభుత్వ ధర ప్రకారం రూ.408 కోట్ల పైమాటే ►గడువు పొడిగింపునకు పౌరసరఫరాల శాఖ వినతి ముకరంపుర : జిల్లాలో 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లో కలిపి ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు (జీసీసీ) ద్వారా ప్రభుత్వ యంత్రాంగం 10,16,312 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. కస్టమ్ మిల్లింగ్ కోసం 600 మంది మిల్లర్లకు అప్పగించింది. 6,89,021 మెట్రిక్ టన్నుల బియ్యం మరపట్టించి రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయూల్సి ఉంది. కానీ.. 4,41,595 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,47,429 మెట్రిక్ టన్నులు మిల్లర్ల సంచుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికే సేకరణ పూర్తికావల్సి ఉండగా... జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులేమో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ కోసం మరో రెండు నెలల గడువు కావాలని గురువారం ప్రభుత్వాన్ని కోరడం విశేషం. దాచిన బియ్యం విలువ రూ.408 కోట్లు వరిసాగు విస్తీర్ణం మన జిల్లాలో ఎక్కువ. అన్నదాతలు పండించే ధాన్యం ఆధారంగా అభివృద్ధి చెందాల్సిన రైస్‌మిల్లింగ్ పరిశ్రమ కొందరి లాభపేక్షతో పక్కదారిపడుతోంది. జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. మూడేళ్లుగా సర్కార్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారిపట్టిస్తున్నారు. 2013-14 సీజన్లో ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఖరీఫ్‌లో 357 మంది మిల్లర్లకు, రబీలో 253 మంది మిల్లర్లకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం రెండు సీజన్లలో కలిపి ధాన్యం తీసుకున్న మిల్లర్లు 6,89,021 టన్నుల బియ్యాన్ని సెప్టెంబర్ 30వ తేదీలోగా పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. మిల్లర్ల జాప్యంపై ఇటీవలే పౌరసరఫరాల కమిషనర్ పార్థసారధి సమీక్షించారు. గడువులోగా బియ్యూన్ని అప్పగించాలని మిల్లర్లను ఆదేశించారు. అరుునా లాభం లేకుండా పోరుుంది. రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో సంబంధిత అధికారులూ వారికే వత్తాసు పలుకుతుండడంతో ఈ ప్రక్రియ మరింత జాప్యం జరుగుతోంది. భారత ఆహార సంస్థ మిల్లర్లకు ఇచ్చే బియ్యం ధర ప్రస్తుతం సగటున క్వింటాల్‌కు రూ.1600 ఉంది. ఈ ధర లెక్కన పరిశీలిస్తే మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్న బియ్యం విలువ దాదాపు రూ. 408 కోట్ల పైమాటే. మిల్లర్ల ‘ప్రైవేటు’ వ్యాపారం...:మిల్లర్లు తమ వద్ద దాచుకున్న బియ్యంతో ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలున్నారుు. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి కొనుగోలు చేసిన 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించారు. ఇందులో 2.56 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇప్పటివరకు 2.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యూన్ని అప్పగించగా మిగిలిన 3,000 టన్నులు (30 వేల క్వింటాళ్లు) బియ్యాన్ని 10 మంది మిల్లర్లు తమ వద్దే ఉంచుకున్నారు. గత సీజన్లో రైతుల నుంచి 6.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించారు. మిల్లర్లు 4.32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 1.94 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే అందజేశారు. ఇంకా 272 మంది మిల్లర్లు 2,47,429 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సర్కార్‌కు ఇవ్వలేదు. పౌరసరఫరాల శాఖ రుణం తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తే మిల్లర్లు వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సివిల్సప్లై సంస్థకు వడ్డీ భారం తప్పడంలేదు. -
ఆయకట్టు రైతుకు తీపి కబురు
కర్నూలు రూరల్: తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు సాగునీటి వాటాలను బోర్డు అధికారులు నిర్ణయించారు. బళ్లారిలో నిర్వహించిన బోర్డు అధికారుల సమావేశంలో తుంగభద్ర దిగువ కాలువ, కర్నూలు-కడప కాలువలకు తుంగభద్ర జలాశయంలో 24 టీఎంసీలు, కేసీకి 10 టీఎంసీ నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ ఏడాది రుతు పవనాల రాక ఆలస్యం కావడం.. వరుణుడు ముఖం చాటేయడంతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరక వారం రోజుల క్రితం నిర్వహించాల్సిన బోర్డు ఎస్ఈ స్థాయి అధికారుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ నెల చివరి వరకు జలాశయంలోకి 144 టీఎంసీల నీరు చేరవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందులో కర్ణాటక వాటా 94 టీఎంసీలు, ఆంధ్రా ౄటాగా 50 టీఎంసీలు కేటాయించారు. ఆంధ్రా వాటాగా కేటాయించిన నీటిలో తుంగభద్ర దిగువ కాలువకు ఈ ఏడాది 16.3 టీఎంసీలు, కర్నూలు, కడప కాలువకు 6.79 టీఎంసీల ప్రకారం కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 0.86 టీఎంసీ అదనంగా కేటాయించడం విశేషం. వాటా పెరిగినా వాస్తవంగా రావాల్సిన నీటి కంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు. ఊరిస్తున్న నైరుతి రుతు పవనాలు కరుణించకపోవడంతో జిల్లాలోని ఆయకట్టు రైతులు టీబీ డ్యామ్ నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. నారుమళ్లు పెంచుకునేందుకు జులై మొదటి లేదా రెండో వారంలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి నీటి విడుదల తేదీలను నిర్ణయించనున్నారు. సుంకేసుల జలాశయంలో ఇటీవల కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు, ఆదోని, మంత్రాలయం ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నీటి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. స్వల్ప మోతాదులో డ్యాంలోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈ కారణంగా దిగువ కాలువ కంటే ముందుగానే కర్నూలు-కడప కాలువకు సాగునీరు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
అన్నదాత ఆగమాగం
వరంగల్, న్యూస్‌లైన్: రైతన్నకు జిల్లాలో దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఖరీఫ్, రబీ సీజన్ లో వరుసగా అకాల వర్షాలు, వడగళ్లు వారిని వెంటాడుతున్నాయి. పుండు మీద కారం చల్లినట్లు ప్రకృతి ప్రకోపం చూపించడంతో అన్నదాతలు తండ్లాడుతున్నారు. ఇటీవల జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లో కురిసిన వడగళ్ల వర్షంతో రైతులు నష్టపోయారు. గత నెలాఖరు, ఈ నెల మొదటి వారంలోనే రెండు పర్యాయూలు అకాల వర్షాలు వారిని కోలుకోకుండా చేశారుు. వడగండ్ల వర్షాలతో 5,500 హెక్టార్లలో వరి, మిరప, పండ్ల తోటలకు నష్టం వాటిల్లిం ది. రూ.4.5 కోట్ల మేరకు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఇక మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం తడిసిపోయిం ది. చేతికొచ్చిన మిరప పంట కళ్లాల్లోనే తడిసి పోయింది. పరిహారం చెల్లించడంలో జాప్యం జరుగుతున్న తీరు, మార్కెట్లలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. రెండు సీజన్లలోనూ తీవ్ర నష్టం ఖరీఫ్‌లో కురిసిన అకాల, భారీ వర్షాలు, ఫైలిన్ తుపాన్ తో రైతులు పంట నష్టపోయారు. సీజన్ మొదట జూలై లో వచ్చిన తుపాన్‌తో వరి, మొక్కజొన్న, వేరుశనగ పం టలు నాశనమయ్యూరుు. తీరా ఏరే సమయంలో పత్తి పంటలు నీళ్లపాలయ్యాయి. చేతికొచ్చిన పంటలకు సైతం మార్కెట్లో కనీస ధర లేక రైతులు ఆందోళనకు దిగారు. పత్తి దిగుబడిపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపా రుు. అరుునా భూమిని నమ్ముకున్న రైతులు రబీకి సిద్ధమయ్యారు. రబీలో లక్షా50వేల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేశారు. కరెంట్ కష్టాలు ఎదురైనా ముందుకు సాగారు. మార్చిలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చాయి. 21 మండలాల్లో పంట నష్టం జరిగింది. ఎనిమిది మండలా ల్లో వందశాతం వరి, మొక్కజొన్న, మిరప, కూరగాయ లు, పండ్లతోటలు పూర్తిగా నాశనమయ్యాయి. తట్టుకోలేక ఇద్దరు కౌలు రైతులు బలవన్మరణం చెందారు. ఇటీవల ఈ పంటలను కేంద్ర బృందం పరిశీలించి వెళ్లిన విషయం తెలిసిందే. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.30 కోట్ల మేర పరిహారం చెల్లించాలని జిల్లా యంత్రాంగం కేంద్ర బృందానికి నివేదిక సమర్పించింది. అరుునా ఒక్క పైసా రాలలేదు. వరుస నష్టాలతో పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయం నిండా మునిగి అప్పులే మిగలడంతో రైతులు అల్లాడుతున్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కౌలు రైతులు, చిన్న, సన్నకారు, మోతుబరి రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయూరుు. ప్రస్తుతం వరి కోతలు, మిరప ఏరే సమయంలో వడగళ్లు, గాలి దుమారాలు పంటల ను నాశనం చేస్తున్నాయి. మామిడి తదితర తోట లు దెబ్బతినడంతో రైతులు అల్లాడుతున్నారు.