అన్నదాత ఆగమాగం
వరంగల్, న్యూస్‌లైన్: రైతన్నకు జిల్లాలో దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఖరీఫ్, రబీ సీజన్ లో వరుసగా అకాల వర్షాలు, వడగళ్లు వారిని వెంటాడుతున్నాయి. పుండు మీద కారం చల్లినట్లు ప్రకృతి ప్రకోపం చూపించడంతో అన్నదాతలు తండ్లాడుతున్నారు. ఇటీవల జనగామ, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్ మండలాల్లో కురిసిన వడగళ్ల వర్షంతో రైతులు నష్టపోయారు. గత నెలాఖరు, ఈ నెల మొదటి వారంలోనే రెండు పర్యాయూలు అకాల వర్షాలు వారిని కోలుకోకుండా చేశారుు. వడగండ్ల వర్షాలతో 5,500 హెక్టార్లలో వరి, మిరప, పండ్ల తోటలకు నష్టం వాటిల్లిం ది. రూ.4.5 కోట్ల మేరకు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఇక మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం తడిసిపోయిం ది. చేతికొచ్చిన మిరప పంట కళ్లాల్లోనే తడిసి పోయింది. పరిహారం చెల్లించడంలో జాప్యం జరుగుతున్న తీరు, మార్కెట్లలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది.
రెండు సీజన్లలోనూ తీవ్ర నష్టం
ఖరీఫ్‌లో కురిసిన అకాల, భారీ వర్షాలు, ఫైలిన్ తుపాన్ తో రైతులు పంట నష్టపోయారు. సీజన్ మొదట జూలై లో వచ్చిన తుపాన్‌తో వరి, మొక్కజొన్న, వేరుశనగ పం టలు నాశనమయ్యూరుు. తీరా ఏరే సమయంలో పత్తి పంటలు నీళ్లపాలయ్యాయి. చేతికొచ్చిన పంటలకు సైతం మార్కెట్‌లో కనీస ధర లేక రైతులు ఆందోళనకు దిగారు. పత్తి దిగుబడిపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపా రుు. అరుునా భూమిని నమ్ముకున్న రైతులు రబీకి సిద్ధమయ్యారు. రబీలో లక్షా50వేల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేశారు. కరెంట్ కష్టాలు ఎదురైనా ముందుకు సాగారు. మార్చిలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చాయి.
21 మండలాల్లో పంట నష్టం జరిగింది. ఎనిమిది మండలా ల్లో వందశాతం వరి, మొక్కజొన్న, మిరప, కూరగాయ లు, పండ్లతోటలు పూర్తిగా నాశనమయ్యాయి. తట్టుకోలేక ఇద్దరు కౌలు రైతులు బలవన్మరణం చెందారు. ఇటీవల ఈ పంటలను కేంద్ర బృందం పరిశీలించి వెళ్లిన విషయం తెలిసిందే. ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.30 కోట్ల మేర పరిహారం చెల్లించాలని జిల్లా యంత్రాంగం కేంద్ర బృందానికి నివేదిక సమర్పించింది. అరుునా ఒక్క పైసా రాలలేదు. వరుస నష్టాలతో పెట్టిన పెట్టుబడి, వచ్చే ఆదాయం నిండా మునిగి అప్పులే మిగలడంతో రైతులు అల్లాడుతున్నారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కౌలు రైతులు, చిన్న, సన్నకారు, మోతుబరి రైతుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయూరుు. ప్రస్తుతం వరి కోతలు, మిరప ఏరే సమయంలో వడగళ్లు, గాలి దుమారాలు పంటల ను నాశనం చేస్తున్నాయి. మామిడి తదితర తోట లు దెబ్బతినడంతో రైతులు అల్లాడుతున్నారు.