khokho
-
నేటినుంచి ‘అల్టిమేట్ ఖోఖో’ లీగ్
రెండో సీజన్ ‘అల్టిమేట్ ఖోఖో’ లీగ్‌కు రంగం సిద్ధమైంది. కటక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నేడు ప్రారంభమయ్యే ఈ టోర్నీ జనవరి 13 వరకు సాగుతుంది. మొత్తం ఆరు జట్లు ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ఒడిషా జాగర్‌నట్స్, రాజస్తాన్ వారియర్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ మొదలవుతుంది. నేడు జరిగే తర్వాతి మ్యాచ్‌లో ముంబై ఖిలాడీస్‌తో తెలుగు యోధాస్ టీమ్ తలపడుతుంది. గుజరాత్ జెయింట్స్, చెన్నై క్విక్ గన్స్ టోర్నమెంట్ బరిలో ఉన్న మరో రెండు జట్లు. 21 రోజుల వ్యవధిలో మొత్తం 30 మ్యాచ్‌లు జరుగుతాయి. జీఎంఆర్ గ్రూప్ యాజమాన్యానికి చెందిన తెలుగు యోధాస్ టీమ్ గత ఏడాది రన్నరప్‌గా నిలవగా...ఈ సారి టైటిల్ సాధిస్తామని యోధాస్ కెప్టెన్ ప్రతీక్ వైకర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. భారత ఖోఖో సమాఖ్య గత ఏడాది ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ఈ సీజన్ కోసం అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. గత ఏడాది టీవీ, ఓటీటీలో కలిపి 164 మిలియన్ల మంది ప్రేక్షకులు టోర్నీని తిలకించారు. ‘సోనీ నెట్వర్క్’లో మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి. -
ఖో–ఖో లీగ్ కూడా వచ్చేసింది!
న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా వస్తున్న వేర్వేరు క్రీడాంశాల లీగ్‌ల జాబితాలో ఇప్పుడు గ్రామీణ క్రీడ ఖో–ఖో కూడా చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్‌లో లీగ్‌ను నిర్వహించనున్నట్లు భారత ఖో–ఖో సమాఖ్య మంగళవారం ప్రకటించింది. దీనికి ‘అల్టిమేట్ ఖో ఖో’ అని పేరు పెడుతూ లెట్స్ ఖో అనే ట్యాగ్‌లైన్ జత చేశారు. ఐపీఎల్ తరహాలో ఎనిమిది ఫ్రాంచైజీలు రెండేసి సార్లు తలపడే ఫార్మాట్లో మొత్తం 60 మ్యాచ్‌లతో 21 రోజుల పాటు ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. భారత ఒలింపిక్ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, ఖోఖో సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాజీవ్ మెహతా ఈ లీగ్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఖోఖో క్రీడలు ఆసియాలోనే ప్రధానంగా గుర్తింపు ఉండగా... ఈ లీగ్‌లో భారత్‌తో పాటు దక్షిణ కొరియా, ఇరాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, ఇంగ్లండ్ దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. ఒక్కో జట్టులో 12 మంది ఆటగాళ్లు చొప్పున ఉంటారు. ఎనిమిది ఫ్రాంచైజీ నగరాల్లో బెంగళూరు, పుణే ఉండటం దాదాపు ఖాయం కాగా... ఇతర ఆరు జట్లపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రముఖ సంస్థ డాబర్ ఇండియా లిమిటెడ్ ఖో–ఖో లీగ్‌కు అండదండలు అందిస్తోంది. డాబర్ గ్రూప్ వైస్ చైర్మన్ అమిత్ బర్మన్ తన వ్యక్తిగత హోదాలో లీగ్ నిర్వహణ హక్కులు తీసుకున్నారు. తొలి ఏడాది ఆయన పెట్టుబడిగా రూ. 10 కోట్లు పెడుతుండటం విశేషం. -
ముగిసిన రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు
బాలికల్లో ‘అనంత’.. బాలురలో ‘ప్రకాశం’ గుంతకల్లు : పట్టణంలోని రైల్వే క్రీడా మైదానంలో మూడు రోజులుగా సాగుతున్న రాష్ట్ర స్థాయి అండర్-14 బాలబాలికల ఖోఖో పోటీలు సోమవారం ముగిశాయి. ఈ పోటీల్లో బాలికల విభాగంలో అనంతపురం, బాలుర విభాగంలో ప్రకాశం జిల్లాల క్రీడాకారులు విజయ దుందుబి మోగించారు. సోమవారం ఉదయం బాలుర విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు గుంటూరుపైన, చిత్తూరు జట్టు విజయనగరంపైనా గెలుపొంది ఫైనల్‌కు చేరాయి. మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్‌లో ప్రకాశం జట్టు చిత్తూరు జట్టుపై గెలుపొంది టోర్నీ విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజయనగరంపైన, చిత్తూరు జట్టు ప్రకాశంపైన గెలుపొంది ఫైనల్‌కు చేరాయి. ఫైనల్ మ్యాచ్‌లో అనంతపురం జట్టు చిత్తూరుపై విజయ కేతనం ఎగురవేసి టోర్నీ విజేతగా నిలిచింది. బాలుర విభాగంలో ప్రకాశం, చిత్తూరు, గుంటూరు జట్టు, బాలికల విభాగంలో అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. గుంతకల్లు డీఎస్పీ సీహెచ్.రవికుమార్, మార్కెట్‌యార్డు చైర్మన్ బండారు ఆనంద్ బహుమతులు, షీల్డులు అందజేసి విజేతలను అభినందించారు. సెలక్షన్ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్, జిల్లా ఖోఖో క్రీడా సంఘం అధ్యక్షుడు పుల్లారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ముక్కన్నగారి రామాంజినేయులు, ఆర్గనైజర్లు శ్రీనివాసులు, మల్లికార్జున, సత్యనారాయణ, ప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఖోఖో బాల బాలికల జట్లు ఎంపిక : ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారితో అండర్-14 ఖోఖో బాలబాలికల రాష్ట్ర జట్లను ఎంపిక చేసినట్లు సెలక్షన్ కమిటీ సభ్యుడు దుర్గాప్రసాద్ తెలిపారు. బాలికల జట్టు : కవిత, వరలక్ష్మి, రుబినా(అనంతపురం), అఖిల, శిరీష(ప్రకాశం), శారద(కర్నూలు), అమృత(తూర్పు గోదావరి), శరణి (కడప), యశోద(నెల్లూరు), పూజిత, అనూష, కుమారి(చిత్తూరు). బాలుర జట్టు : బాండ్రాజ్, సందీప్(ప్రకాశం), శశాంక్, నీరజ్రాఘవ్, సింహాద్రి(చిత్తూరు), ప్రవీణ్ (తూర్పు గోదావరి), సాయికృష్ణ(అనంతపురం), సాయినాయక్(గుంటూరు), భానుప్రసాద్(విజయనగరం), మదన్మోహన్రావు(కడప), సురేంద్ర(విశాఖ), కరణ్(నెల్లూరు). -
ఖోఖో జిల్లా జట్ల ఎంపిక
చిర్రావూరు (తాడేపల్లి రూరల్): అండర్–14 ఖోఖో జిల్లా జట్టు ఎంపిక మంగళవారం చిర్రావూరు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా 35 స్కూళ్ల నుంచి 350 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంపిక చేసిన జట్లు అనంతపురంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని జిల్లా గేమ్స్ ఆర్గనైజర్ ఎం.గణేష్ తెలిపారు. బాలికల జట్టులో.. ఒ.అమ్మాజీ , జి.భారతి, ఎం.అక్షిత, బి.ఇందు, ఎస్కె.జాన్‌బి, ఎం.అనిత, ఎం.స్రవంతి, వి.నాగశ్రీ, ఎన్.కోటేశ్వరి, జి.శ్రీలక్ష్మి, కె.పావని, జి.దుర్గాభవానీ, ఎం.ధరణి, ఎం.కీర్తి, పి.సుస్మిత, ఎం.లక్ష్మి, వి.దీక్షిత ఎంపికయ్యారు. బాలుర జట్టులో.. జె.బ్రహ్మారావు, వి.సాయినాయక్, డి.వెంకట అనిల్‌రెడ్డి, జి.విక్టర్‌పాల్, ఎం.ఉమేష్, వి.రాజు, ఎం.అశోక్, ఎం.బ్రహ్మం, శివనాగరాజు, ఎం.నవీన్, ఎ.వంశీ, ఎం.మణికంఠ, ఎం.పేరయ్య, వి.నవీన్, వి.సింహాద్రి, పి.వెంకటరమణ, ఈశ్వరరెడ్డి, ఎస్.సంతోష్ ఎంపికయ్యారు. -
ఖోఖో విజేత పాలమూరు
మహబూబ్‌నగర్ క్రీడలు: రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో జరిగిన స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 ఖోఖో టోర్నీ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జిల్లా జట్టు 4–2 పాయింట్ల తేడాతో ఖమ్మంపై విజయం సాధించింది. జిల్లా జట్టు విజేతగా నిలవడంపై ఎస్జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్, సత్యనారాయణ, విజేందర్, యాదయ్య, మొగులాల్ ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయికి క్రీడాకారులు ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. నందిని (వెల్జాల), కృష్ణమ్మ (సూరారం), కృష్ణవేణి (కల్వకుర్తి), సికిందర్ (కల్వకుర్తి) టోర్నీలో రాణించి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిని పలువురు అభినందించారు. -
స్కూల్ గేమ్స్ ఖోఖో జిల్లా జట్ల ప్రకటన
కల్లూరు: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఖోఖో జిల్లా బాలబాలికల జట్లను ఫెడరేషన్ కార్యదర్శి పవన్‌కుమార్ శనివారం ప్రకటించారు. అండ్ –14 బాలికల జట్టు : శారద, హైమావతి, మేరీ , శివలక్ష్మీ, అపర్ణ , మానస , శ్రావణి , శిరీష , సావిత్రి , ప్రియాంక , ఉషారాణి , శిరీష, స్టాండ్‌బైస్: బి మౌనిక, రేణుక , నందిని , సిందూ, శాంతి , భారతిని ఎంపిక చేశారు. బాలుర జట్టు : దుర్గప్రసాద్ , రామాంజనేయులు, ధరణి , నాగరాజు , మహేష్ , జగదీష్ , నవీన్, మహబూబ్‌బాషా, ఆదర్శ్, అబ్దుల్ కలాం, నాగరాజు , కిరణ్, స్టాండ్‌బై : శివ, అఫ్సార్, మధు , ఇస్మాయిల్ , శివకుమార్ , శ్రీనివాసులు ఎంపికయ్యారు. అండర్ 17 బాలికల జట్టు: దివ్య, అఖిల , కల్పన ,చాందినీ ,నాగేశ్వరమ్మ , శ్రావణి , ప్రత్యూష, అనంతలక్ష్మీ, దిల్షాద్ , దీపిక, లక్ష్మీప్రియ, వెన్నెల, స్టాండ్‌బై: సంధ్యారాణి , వినీత, అరీఫాబేగం , తస్లీమా, నాగవిజేత, సల్మాను ఎంపిక చేశారు. బాలుర జట్టు ః వై రవికుమార్, యు. రవికుమార్, వెంకటేష్ , శ్రీను, శరత్, మాలిక్ , రవినాథ్, రాజశేఖర్‌గౌడ్, తిక్కస్వామి, షణ్ముఖ, ఓబులేసు, ఉసేనయ్య, స్టాండ్‌బైగా రసూల్, శ్రీనివాసులు, ప్రతాప్ , గణేశ్వరుడు, యశ్వంత్,ఆంజనేయులు ఎంపికయ్యారు. -
అంతర్జాతీయ ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక
నేపాల్‌లో ఈనెల 8 నుంచి క్రీడలు రవాణా ఖర్చులు భరించలేని సాయికుమార్ ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు జఫర్‌గఢ్ : నిరుపేద కుటుంబానికి చెందిన సాయికుమార్ ఖోఖో పోటీల్లో సత్తా చాటుతున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం లో నిలిచిన సాయికుమార్ అంతర్జాతీయ స్థా యి పోటీలకు వెళ్లేందుకు కనీసం రవాణా ఖర్చు లు సైతం వెచ్చించలేని పరిస్థితి. జఫర్‌గఢ్ మం డలం తమ్మడపల్లి (జి) గ్రామానికి చెందిన కొంతం సాయికుమార్ ఈనెల 8న నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అండర్ 17 జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని స్వర్ణపతకం సాధించాడు. ప్రస్తుతం సాయికుమార్ స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఆదిత్య ఐటీఐ కళాశాలలో సెకండియర్ చదువుతున్నా డు. ఖోఖోపై మక్కువతో మండల, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటాడు. కాజీపేటలో జరిగిన జిల్లా స్థాయి పోటీ లు, నల్గొండ జిల్లాలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొని సాయికుమార్ స్వర్ణ పతకం సాధించాడు. అలాగే, ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీ య స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపి నేపాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా సాయికుమార్‌ను కళాశాల యాజమాన్యం, సహచర విద్యార్థులు అభినందించారు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన సాయికుమా ర్.. నేపాల్‌కు వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బం దులు పడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనాలంటే కనీసం రూ. 25 వేలు ఖర్చవుతాయి. ఎవరైనా దాతలు, క్రీడాభిమానులు మందుకు వచ్చి ఆర్థిక సాయం అందించాలని సాయికుమార్ కోరుతున్నాడు.