Kidnaper
-
టీచర్‌ను కిడ్నాప్.. తలపై తుపాకీతో బెదిరించి కూతురితో పెళ్లి
బిహార్‌లో వింత పెళ్లి జరిగింది. ఓ టీచర్‌ను కిడ్నాప్ చేసి తలపై తుపాకీ పెట్టి బెదిరించి తన కుతురితో వివాహం జరిపించాడు కిడ్నాపర్. బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఈ ఉదాంతం వెలుగుచూసింది. వివరాలు.. గౌతమ్ కుమార్ ఇటీవలే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పటేపూర్‌లోని రేపురాలోని పాఠశాలలో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తునాడు. . బుధవారం అతను పాఠశాలలో ఉండగా.. ముగ్గురు నలుగురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేశారు. 24 గంటల్లోనే తుపాకీతో బెదిరించి కిడ్నాపర్లలో ఒకరి కుమార్తెతో బలవంతంగా వివాహం చేశారు. వివాహానికి నిరాకరించింనందుకు బాధితుడిపై దాడి కూడా చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు తప్పిపోయిన ఉపాధ్యాయుడిని గాలించే పనిలో పడ్డారు. గౌతమ్ కుమార్ కుటుంబ సభ్యులు రాజేష్ రాయ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమారుడిని బలవంతంగా తీసుకెళ్లి రాయ్ కుమార్తె చాందినితో వివాహం చేసి ఉంటారని ఆరోపించారు. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా బిహార్‌లో పకడ్వా వివాహం(ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం) ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. గతేడాది అనారోగ్యానికి గురైన జంతువుకు వైద్యం చేసేందుకు వచ్చిన పశువైద్యుడిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి బెగుసరాయ్‌లో బలవంతంగా వివాహం జరిపించారు. కొన్నేళ్ల క్రితం బీహార్‌లో ఓ ఇంజనీర్‌కు సంబంధించిన ఇలాంటి ఘటనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న 29 ఏళ్ల వినోద్ కుమార్ పాట్నాలోని పండరక్ ప్రాంతంలో ఓ మహిళను కొట్టి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. -
సోనీ కిడ్నాప్ కేసులో పోలీసుల పురోగతి
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మసీ విద్యార్థి సోనీ లో కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నల్లమల ఫారెస్ట్ ఏరియాలో కిడ్నాపర్ రవిశంకర్ ఆనవాళ్లను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆంధ్ర పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరోవైపు కిడ్నాప్ వ్యవహారంలోనూ కీలక ఆధారాలు లభించినట్టు సమాచారం. ఆ ఆధారాల ప్రకారం సోని కిడ్నాప్‌లో బంధువుల హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాపర్ రవిశంకర్‌ను పట్టుకునేందుకు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ చుట్టూ తిరుగుతున్న దర్యాప్తు నగరంలో జరిగిన ఫార్మసీ విద్యార్థి సోనీ కిడ్నాప్ స్టోరీ ఇప్పుడు ఏపీ చుట్టూ తిరుగుతోంది. ఏపీలో కిడ్నాపర్ ఆనవాళ్లను పోలీసులు పసిగట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో బృందాలుగా విడిపోయి ఆంధ్రా- తమిళనాడు, ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లో పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు . హైదరాబాద్‌లో కిడ్నాప్ అయిన ఫార్మసీ విద్యార్థి సోనీ ఆచూకీ ఇంకా తెలియలేదు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో తండ్రిని నమ్మించి కూతురు సోనీని తీసుకువెళ్లిన కిడ్నాపర్ రవిశంకర్ ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన వాడుగా గుర్తించారు. ఈజీ మనీకి అలవాటుపడ్డ రవిశంకర్ దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. దృష్టి మళ్లించి పనికానిచ్చేయటంలో దిట్ట. కంకిపాడు, పెనమలూరు, విజయవాడల్లో పలు దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. అలా జైలు నుంచి విడుదలై బయటకు రాగానే మళ్లీ దొంగతనాలు చేస్తూ కాలం గడిపేవాడు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలుచోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఒక్క ఏపీలోనే 25 నేరాలు చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఓ కేసులో అరెస్టయిన రవిశంకర్ ఎస్కార్ట్ కళ్లుగప్పి ఏపీ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఉన్నట్టుండి హైదరాబాద్‌లో ప్రత్యక్షమై ఫార్మసీ విద్యార్థి సోనీని కిడ్నాప్ చేశాడు. దీంతో రవిశంకర్ స్వగ్రామం కృష్ణా జిల్లా దావులూరు కావడంతో.. ఆమెని ఏపీలో దాచి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల సహకారం తీసుకుని కేసును చేధించాలని తెలంగాణ పోలీసులు చూస్తున్నారు. ఇప్పటివరకు కేవలం దొంగతనాలు మాత్రమే చేసిన రవిశంకర్ ఇప్పుడు కిడ్నాపర్‌గా ఎందుకు మారాడు? పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత ఏదైనా గ్యాంగ్‌తో చేతులు కలిపాడా? కిడ్నీ రాకెట్‌తో ఏమైనా సంబంధాలున్నాయా? దుబాయికి అమ్మాయిలని అమ్మే ముఠాలో సభ్యుడయ్యాడా? ఇందుకోసమే తండ్రిని ట్రాప్ చేసి కూతురు సోనిని కిడ్నాప్ చేశాడా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవిశంకర్ కుటుంబ సభ్యులు మాత్రం అతడి నేర ప్రవృత్తితో విసుగెత్తిపోయారు. రవిశంకర్ తీరుతో తాము అవమానాలు ఎదుర్కోవలసి వస్తోందని వాపోతున్నారు. రవిశంకర్‌ను పట్టుకుని శిక్షించాలంటున్నారు. రవిశంకర్ పై స్వగ్రామం దావులూరు వాసులు మండిపడుతున్నారు. సోనీని విడిచి పెట్టి పోలీసులకు లొంగిపోవాలని సూచిస్తున్నారు. కొడుకు పడుతున్న బాధలను చూసిఅయినా రవిశంకర్ మారాలని కోరుతున్నారు. -
అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నాం
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఏడాది క్రితం అదృశ్యమై.. తిరిగొచ్చిన బాలుడు అరుణ్ కేసుపై ఆరా తీస్తున్నామని యాదగిరిగుట్ట టౌన్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది మే 16వ తేదీన అరుణ్ (బిట్టు)ను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తల్లిదండ్రులు అశోక్–నిర్మల దంపతులు యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. అప్పటినుంచి బాలుడి అదృశ్యం కేసు మిస్టరీని ఛేదించేందుకు కృషిచేస్తున్నామన్నారు. తీసుకెళ్లిన అగంతకుడే బాలుడిని తిరిగి తీసుకువచ్చి వదిలివెళ్లడం సంతోషకరమన్నారు. అయినా అతను ఎవరు..? ఏ కారణంతో బాలు డిని తీసుకెళ్లాడు..? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు. బాలుడిని వదిలి వెళ్లే క్రమంలో అతడు యాదగిరిగుట్టలో ఎక్కడెక్కడ సంచరించాడు. అతడి ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్టు సీఐ వివరించారు. గారాబంగా చూసుకున్నారు : అరుణ్ తనను ఇంటివద్ద నుంచి తీసుకెళ్లిన వ్యక్తి, వారి కు టుంబ సభ్యులు గారాబంగా చూసుకున్నారు. మీ నాన్న నా దగ్గరే ఉన్నాడంటే అతడి వెంట వెళ్లా. అనంతరం బస్సులో తెలియని ఊరికి తీసుకెళ్లా డు. అక్కడ నన్ను ఎవరూ కొట్టలేదు.. తిట్టలేదు. ఇటీవల ఫోన్లో మా తల్లిదండ్రి ఫొటోలు చూపిం చాడు. నేను గుర్తుపట్టడంతో ఆదివా రం సాయంత్రం యాదగిరిగుట్టకు తీసుకువచ్చి.. నా చేతిలో ఒక చిట్టీ పెట్టి తెల్లబట్టలు వేసుకున్న పోలీస్ అంకుల్‌కు అది ఇవ్వమని చెప్పి వెళ్లాడు. ఎవరా అగంతకుడు..? బాలుడిని యాదగిరిగుట్టకు తీసుకువచ్చిన వ్యక్తి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నామని సీఐ తెలిపారు. బాలుడిని సుమారు 30 సంవత్సరాల వ్యక్తి యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి గ్రామపంచాయతీ వరకు తీసుకెళ్లాడని, అతడు తలపై టోపీ ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాలో కనపిస్తోందన్నారు. ఆ వ్యక్తి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని, అతడు పట్టుబడితేనే బా లు డిని ఎందుకు తీసుకెళ్లారు.. ఎక్కడికి తీసుకెళ్లారు అనే అంశాలు తెలుస్తాయని చెప్పారు. త్వరలోనే కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకుంటామన్నారు. -
అపోహతో హతమార్చారు!
ఆదోని/అర్బన్: కిడ్నాపర్‌గా భావించిన ఓ వ్యక్తిని స్థానికులు కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ ఘటన గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఆదోని పట్టణం కిల్చిన్పేటలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం మేరకు.. రాత్రి 9 గంటల సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎనిమిదేళ్ల బాలికను తనతో తీసుకువెళ్లే యత్నం చేశాడు. దీంతో ఆమె తల్లి గట్టిగా అరిచింది. వెంటనే సమీపంలో ఉన్న వారు ఆ వ్యక్తిని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తితో మాట్లాడి వివరాలు సేకరించే యత్నం చేశారు. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడడంతో బిహార్‌కు చెందిన కిడ్నాప్ ముఠా సభ్యుడని భావించి ప్రజలు రెచ్చిపోయారు. పోలీసుల నుంచి స్థానికులు ఆ వ్యక్తిని బలవంతంగా అదుపులోకి తీసుకొని మూకుమ్మడిగా కర్రలతో దాడి చేశారు. రక్షించేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు చేసిన యత్నం ఫలించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి.. పోలీసులు చూస్తుండగానే ఆ వ్యక్తి రక్తపు మడుగులో పడి ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ అంకినీడు ప్రసాద్, త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, వన్ టౌన్ ఎస్ఐ నాగేంద్ర సిబ్బందితో ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. గుమిగూడిన వారిని చెదరగొట్టారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని, గుర్తుతెలియని వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారు తారసపడినా తమకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు. అనుమానంతో వ్యక్తులను కొట్టి చంపడం మంచిది కాదని అన్నారు. ఘటనపై విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కిడ్నాపర్ కాదు.. బాధితుడే..
జమ్మికుంటరూరల్(హుజూరాబాద్) : జమ్మికుంట మండలం కొత్తపల్లిలో చిన్నారులను ఎత్తుకెళ్తున్నాడని పోలీసులకు అప్పగించిన యువకుడు కిడ్నాపర్‌కాదు.. తానూ బాధితుడే అని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో ఆ యువకుడిని తండ్రికి అప్పగించారు. జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గండు సౌమ్య– చంద్రశేఖర్‌ల ఇద్దరు కవల పిల్లలైన రిత్విక్‌రెడ్డి, సాత్విక్‌రెడ్డి ఈ నెల 23న ఇంటి ఎదుట ఆడుకుంటున్నారు. వారిని ఎత్తుకెళ్లేందుకు యత్ని ంచిన పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన యువకుడు కూడా ఆ రాష్ట్రంలో కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం టౌన్ సీఐ కార్యాలయంలో సీఐ ప్రశాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పిల్లలను కిడ్నాప్‌కు యత్నించిన యువకుడిని విచారించగా.. అతడి పేరు శీతల్‌బౌలి అలియాస్ సొత్తు అని, స్వగ్రామం పశ్చిమబెంగాల్ రాష్ట్రం బీర్బూమ్ జిల్లా రాంపూర్ హట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేల్‌పహారీని తెలిసిందన్నారు. దీంతో అక్కడి పోలీసుకు సమాచారం ఇవ్వగా పలు విషయాలు వెల్లడయ్యాయని వివరించారు. బేల్ పహారీ గ్రామానికి చెందిన జితేనా అనే యువకుడు హైదరాబాద్‌లో పని కల్పిస్తానని శీతల్‌బౌలిని 2017లో తన వెంట తీసుకెళ్లాడని చెప్పారు. అప్పటి నుంచి జితేన్‌తో పాటు శీతల్‌బౌలి అడ్రస్‌లేకుండా పోయారన్నారు. వారి తల్లి, దండ్రులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదని, చివరికి తన కొడుకును జితేన్ కిడ్నాప్ చేశాడంటూ శీతల్‌బౌలి తండ్రి సపన్‌బౌలి ఈ ఏడాది ఏప్రిల్ 1న రాంపూర్ హట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కాగా ఇక్కడి పోలీసులు రాంపూర్ హట్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఏఎస్ఐ వివేకానంద ముఖర్జి, యువకుడి తండ్రి సపన్‌బౌలి జమ్మికుంట స్టేషన్‌కు వచ్చారు. సదరు యువకుడి మానసిక పరిస్థితి సరిగా లేదని, అందుకు సంబంధించిన వైద్య పత్రాలు చూపించారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆదేశాలతో శీతల్‌బౌలిపై కేసు కొట్టివేసి తన తండ్రికి అప్పగించారు. -
ఆటో డ్రైవర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా..
ప్రొద్దుటూరు క్రైం :సుమారు ఆరేళ్ల క్రితం సునీల్ పేరు చెబితే చాలు ప్రొద్దుటూరులోని వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు బెంబేలెత్తేవారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన గ్యాంగ్‌స్టర్ సునీల్ పోలీసుల చెర నుంచి మంగళవారం రాత్రి తప్పించుకొని పోయిన సంఘటన సంచలనం కలిగిస్తోంది. సునీల్ అరాచకాలు 2012 నుంచి వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు ఎర్రచందనం రవాణా చేస్తూ పోలీసులకు చిక్కినా సాధారణ స్మగ్లర్‌గానే పోలీసులు పరిగణించారు. ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డులో ఉన్న డాబాలో విధ్వంసం సృష్టించాడు. ఆ సంఘటనతో సునీల్ అరాచకాలు వెలుగు చూశాయి. సునీల్ బెదిరింపులు, కిడ్నాపులు, హత్యలు కడపతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలకు ప్రాకాయి. ఆటో డ్రైవర్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన సునీల్ మొదట ఆటో డ్రైవర్. తర్వాత కిడ్నాపర్‌గా ఎదిగి పోలీసులకు చిక్కాడు. తన అరాచకాలు సాగించేందుకు 20–25 ఏళ్ల యువతను ఎంచుకున్నాడు. వారిని విలాసాల మత్తులో ముంచి తన వ్యూహాల అమలుకు ఉపయోగించుకునేవాడు. సునీల్ చేతిలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకున్న వారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు, యువకులు కావడం బాధాకరమైన విషయం. కడప, అనంతపురం జిల్లాలో ఉండే విద్యార్థులను ఎక్కువగా చేరదీసేవాడు. వారికి ఖరీదైన దుస్తులు, మద్యం, విలాసవంతమైన వస్తువులు కొనివ్వడంతో తెలిసీ తెలియని వయసులో విద్యార్థులు, యువకులు అతని మాయలో పడ్డారు. మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అతని వలలో పడి జైలు పాలయ్యారు. ప్యాపిలి పోలీసుల దర్యాప్తుతో సునీల్ అరాచకాలు వెలుగులోకి కిడ్నాపులు, అక్రమ వసూళ్లు, హత్యలకు పాల్పడుతున్న సునీల్, విద్యార్థుల గుట్టును ప్యాపిలి పోలీసులు 2013లో బయట పెట్టిన తీరు ఆసక్తికరంగా మారింది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం ఎస్ఐ జయన్న ఓ తలారి ఫోన్ కాల్‌కు స్పందించి గుర్తు పట్టలేని మృతదేహంపై జరిపిన పరిశోధన ఫలితంగా సునీల్ ముఠాను పట్టుకున్నారు. తాడిపత్రిలోని అరవింద్ ఆస్పత్రిలో వంశీ మెడికల్ స్టోర్ ఉంది. మెడికల్ స్టోర్ నిర్వాహకుడు వాసురాం ప్రసాద్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో కుమారుడు వంశీ తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జలదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని శవం వద్ద దొరికిన తాళాల గుత్తిని చూపించగా అది తమదే అని వంశీ చెప్పడంతో మృతి చెందిన వ్యక్తి వాసురాం ప్రసాద్‌గా గుర్తించారు. అప్పటికే జైల్లో ఉన్న సునీల్ వాసురాం ప్రసాద్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని విచారించగా కిడ్నాపులు, బెదిరింపు సంఘటనలు వెలుగు చూశాయి. సునీల్ గ్యాంగ్ ఆగడాలు.. సునీల్ గ్యాంగ్ ఆగడాలు ప్రొద్దుటూరులో అప్పట్లో శ్రుతి మించిపోయాయి. జిల్లాలో కిడ్నాపులకు పాల్పడ్డ సునీల్ 2012 జూలై 11న మరో ఇద్దరితో కలిసి ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు బైపాస్‌రోడ్డులో ఉన్న డాబాలో విధ్వంసం సృష్టించాడు. హోటల్లో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి మహిళపై దాడి చేశాడు. ఈ సంఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత అదే నెల 26న తమపై కేసు పెడతారా అంటూ అదే డాబాపై మళ్లీ సునీల్ దాడి చేశాడు. 2012 జూన్ 14న పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీ యజమానిని బెదిరించి రూ. 50 లక్షలు డిమాండ్ చేశాడు. భయపడిన బాధితులు రూ.32 లక్షలు, తర్వాత రూ.18 లక్షలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. 2013 లో ఆర్టీసి డ్రైవర్‌ను బెదిరించి రూ.10 లక్షలు డిమాండు చేశాడు. ప్రొద్దుటూరులోని వన్‌టౌన్‌లో మూడు కేసులు, త్రీ టౌన్లో 2, రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు సునీల్‌పై నమోదయ్యాయి. పోలీసుల నుంచి సునీల్ తప్పించుకున్నాడని తెలియడంతో ప్రొద్దుటూరులోని పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు భయాందోళన చెందుతున్నారు. -
పాస్ వర్డ్ ఓ చిన్నారిని అలా కాపాడింది
స్కూల్ పిల్లలు కిడ్నాప్ గురికావడం తరచు వార్తల్లో వింటుంటాం. చూస్తుంటాం. న్యూఢిల్లీలోని ఓ స్కూల్ లో ఓ విద్యార్ధిని కిడ్నాప్ చేయడానికి దుండగుడు చేసిన ప్రయత్నాలను ఓ చిన్నారి తిప్పికొట్టింది. వివరాల్లోకి వెళితే.. అర్జెంట్ మీ అమ్మ తీసుకురమ్మని నన్ను పంపించింది అని ఓ దుండగుడు దేశ రాజధానిలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ లో ఎనిమిదేళ్ల పాపను కిడ్నాప్ కు ప్రయత్నించారు. అయితే కిడ్నాపర్ పై అనుమానం వచ్చిన ఆ చిన్నారి అందుకు సమాధానంగా పాస్ వర్డ్ చెప్పమని అడిగిందట. దాంతో కంగారుపడిన కిడ్నాపర్ అక్కడి నుంచి జారుకున్నారట. ఇంతకు అసలు విషయమేమింటంటే.. కిడ్నాపర్ల నుంచి బారిన పడకుండా తల్లి, కూతుళ్లు ఓ పాస్ వర్డ్ ను పెట్టుకున్నారట. ఏ పరిస్థితిల్లోనూ ఎవరైనా తనతో రమ్మని అడిగితే పాస్ వర్డ్ చెప్పాలని కూతురుకు తల్లి చెప్పిందట. తల్లి, కూతుర్ల మధ్య పాస్ వర్డ్ ఓ ప్రమాదం నుంచి తప్పించింది. ఏమైనా కిడ్నాపర్ చిక్కుకుండా తీసుకున్న తల్లి జాగ్రత్తను ప్రశంసిస్తూ స్కూల్ యాజమాన్యం ఓ లేఖను ప్రకటన రూపంలో వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ లెటర్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఏదైనా జరగకూడనిది జరిగితే పోలీసులను, సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులను నిందించకుండా తల్లి తండ్రులు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. అందరికి మంచిదే కదా.... -
ఆ కిడ్నాప్ ఉగ్రవాదుల పనేనా ?!