kidnappers demand
-
బీజేపీ ఎమ్మెల్యేకు కోబ్రాటీం పేరుతో బెదిరింపు లేఖ
గంగావతి రూరల్: రూ.50 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో అంతు చూస్తామని గంగావతి బీజేపీ ఎమ్మె ల్యే పరణ్ణ మునవళ్లికి కోబ్రాటీం పేరుతో బెదిరింపు లేఖ అందింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆదివారం నగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం తన ఇంటివాచ్మెన్కు గుర్తు తెలియని వ్యక్తులు లేఖ అం దించి వెళ్లారన్నారు. ‘గతంలో మేము కోటి రూపాయల పాత నోట్లు ఇచ్చాం, వాటికి బదులుగా రూ. 50 లక్షలు కొత్తనోట్లు ఇవ్వాలి. డబ్బు ఇవ్వని పక్షంలో నీ అంతు చూస్తాం’ అని ఆ లేఖలో హెచ్చరికలు జారీ చేశారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో కూడా దుండగులు తనకు పార్శిల్లో దొంగనోట్లు పంపి బ్లాక్మెయిల్ చేశారని, అప్పట్లో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. తాజాగా మరోమారు లేఖ అందిందన్నారు. ఈ విషయంపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి అనంతరం విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమాజంలో తన పరువు తీసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. -
కరెన్సీ కోసం కిడ్నాపర్ల కొత్త ప్లాన్
ఘజియాబాద్: పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత కరెన్సీ సమస్య ఏర్పడటంతో కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేయడానికి కొత్త మార్గం ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 16 ఏళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు బాధితుడి కుటుంబ సభ్యులకు బ్యాంకు ఎకౌంట్ నెంబర్ పంపి డబ్బు ట్రాన్సఫర్ చేయాల్సిందిగా బెదిరించారు. బ్యాంక్ ఖాతా నెంబర్ ఆధారంగా పోలీసులు.. ఖాతాదారుడి (కిడ్నాపర్) స్వస్థలాన్ని, ఫోన్ నెంబర్‌ను తెలుసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘజియాబాద్ సమీపంలోని ఇందిరాపురంలో మణిభూషణ్ చౌదరి అనే వ్యాపారి కొడుకు రెండు నెలల క్రితం అదృశ్యమయ్యాడు. మతిస్థిమితంలేని బాలుడు స్కూలుకు వెళ్లడం లేదు. ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాలుడి తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది. మీ కొడుకు తమ దగ్గర ఉన్నాడని, విడుదల చేయాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పెద్ద నోట్ల రద్దు వల్ల తమ దగ్గర కరెన్సీ లేదని బాధితుడి కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో కిడ్నాపర్ బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పి అందులోకి 50 వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలని, లేకుంటే మీ కొడుకును హతమారుస్తామని బెదిరించాడు. కొడుకు అదృశ్యమైనపుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన మణిభూషణ్.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కిడ్నాపర్లు బెదిరించిన విషయాన్ని చెప్పాడు. పోలీసులు బ్యాంకు ఖాతా నెంబర్ ఆధారంగా ఆరా తీయగా కిడ్నాపర్ మీరట్‌కు చెందినవాడిగా గుర్తించారు. పోలీసులు అతని మొబైల్ ఫోన్ నెంబర్‌ను తెలుసుకుని కాల్ చేయగా, స్విచాఫ్ చేసుకున్నాడు. మీరట్‌కు పోలీసుల బృందాన్ని పంపి కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. -
తొమ్మిదేళ్ల బాలుడు కిడ్నాప్
చింతలగ్రహారంలో ఘటన కిడ్నాపర్ల నుంచి తండ్రికి ఫోన్.. రూ.30 లక్షలు డిమాండ్ పెందుర్తి: పెందుర్తి మండలం చింతలగ్రహారంలో ఓ బాలు డు కిడ్నాపయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కోరుబిల్లి శ్రీనివాసరావు,లక్ష్మి దంపతులకు కుమార్తె యమున, కుమారుడు దామోదర్(9) సంతానం. శ్రీనివాసరావు స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. దామోదర్ స్థానిక మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 8న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలుడు రాత్రి 8.30కి వినాయక మండపం వద్దకు అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గ్రామంలో ఆరా తీశారు. రెండురోజులు వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. కిడ్నాపర్ల నుంచి ఫోన్: అదృశ్యమయ్యాడనుకున్న దామోదర్ ఉదంతం బుధవారం సాయంత్రం కొత్తమలుపు తిరిగింది. బాలుడు తమ వద్ద ఉన్నాడంటూ గోపాలపట్నం దరి కొత్తపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న కాయిన్‌బాక్స్ నుంచి తండ్రి శ్రీనివాసరావుకు ఫోన్ వ చ్చింది. సాయంత్రం 4.20, 4.30కి రెండు దఫాలు ఫోన్ చేసిన దుండగులు 40 గంటల్లో రూ.30 లక్షలు ఇవ్వాలని..లేకుంటే మీ కుమారిడ్ని చంపుతామంటూ బెదిరించారు. ఆయా ఫోన్‌కాల్ వాయిస్‌ను రికార్డు చేసిన శ్రీనివాసరావు పోలీసులకు అందించాడు. అందులో బాలుడి గొంతు వినిపించింది. గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో బాలుడు తిరిగినట్లు పలువురు చెబుతున్నారు.పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలుడి కేసును అత్యంత వేగంగా ఛేదిస్తామని నార్త్ ఏసీపీ సీఎం నాయుడు విలేకరులకు చెప్పారు. నాలుగు బృందాలతో ముమ్మర గాలింపు చేస్తున్నట్లు వెల్లడించారు. కిడ్నాప్ వెనుక ఆర్థిక పరమైన కారణాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి వివాదాలు లేవని తండ్రి చెబుతున్నా ఈ వ్యవహారంలో పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంగా రూ.30 లక్షల రుణం వ్యవహారంలో శ్రీనివాసరావుకు, మరో వ్యక్తికి వివాదం నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఓ ఆస్తి అమ్మకంలో శ్రీనివాసరావు వద్ద కొంత మొత్తం ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ విషయం తెలిసిన ఎవరైనా దామోదర్‌ను కిడ్నాప్ చేశారా అని అనుమానిస్తున్నారు.