kids education
-
పిల్లల ఎడ్యుకేషన్ కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా!
నాకు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనువైన వేదికలు ఏవి? – వెంకట్రావ్ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అని చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా అడిగే ప్రశ్న. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, పదేళ్ల వరకు కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. అందులోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను డైవర్సిఫై చేస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీలు సహజంగానే అస్థిరతంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి, మార్కెట్లు గరి ష్టాల వద్ద ఉన్నప్పుడు రిస్‌్కను తగ్గిస్తుంది. మూడేళ్ల కాలంలో పెట్టుబడులు పెట్టుకోవడం అన్నది తగిన విధంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. డివిడెండ్ ప్లాన్ల పనితీరును, అవి పంచే డివిడెండ్ ఆధారంగా తెలుసుకోవచ్చు. మరి గ్రోత్ ప్లాన్ల పనితీరు ఎలా తెలుసుకోవాలి? – పదమ్ దేవ్ ముందుగా ఒక పథకం డివిడెండ్ ఇస్తుంది కదా అని మంచి పనితీరు చూపిస్తుందని అనుకోవడం పొరపాటు. డివిడెండ్ ఇచ్చినా కానీ, చెత్త పనితీరు చూపించే అవకాశం లేకపోలేదు. అందుకని ఓ పథకం పనితీరును కచ్చితంగా అంచనా వేయాలంటే అందుకు రాబడులే ప్రామాణికం. వ్యాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ పోర్టల్‌లో పథకాల పనితీరు గణాంకాలను పరిశీలించుకోవచ్చు. పోటీ పథకాలతో పోలిస్తే మీరు శోధించే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని పొందొచ్చు. లార్జ్‌క్యాప్ పథకం రాబడులను పరిశీలిస్తుంటే దానికి ప్రామాణిక సూచీ నిఫ్టీ లేదా సెన్సెక్స్ అవుతుంది. సూచీలతో పోలిస్తే లార్జ్‌క్యాప్ పథకం రాబడుల్లో ముందుందా? లేక వెనుకబడిందా తెలుసుకోవచ్చు. ట్రెయిలింగ్ రాబడుల కంటే రోలింగ్ రాబడులు మరింత కచి్చతంగా ఉంటాయి. ఏడాదికాల రోలింగ్ రాబడులు అంటే.. ఏడాది కాల రాబడులను ప్రతీ రోజుకు లెక్కించి సగటు రాబడిని చెప్పడం. గత ఏడాది కాలంలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారన్న దానితో సంబంధం లేకుండా రాబడుల రేటును తెలుసుకోవచ్చు. ఉదాహరణకు ట్రెయిలింగ్ రాబడులు అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇన్వెస్ట్ చేస్తే వచి్చన రాబడి. రోలింగ్ అంటే.. ఏడాది కాల రాబడులను ప్రతి రోజుకు అన్వయించి చెప్పడం. -
బడ్జెట్ 2022: మధ్యతరగతి వర్గానికి ఒకింత ఊరట!
బడ్జెట్ కసరత్తులో కేంద్రం తలమునకలై ఉంది. జనవరి 31న మొదలయ్యే మొదటి విడత సమావేశాలు.. ఫిబ్రవరి 11 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇక బడ్జెట్ వస్తుందంటే.. తమకు ఊరట దక్కుతుందా? అని అన్నివర్గాలు ఆశగా చూస్తుంటాయి. ఈ క్రమంలో మధ్యతరగతికి ఒకింత ఊరట ఇచ్చే అంశాల తెరపైకి వచ్చాయి. రెండు దఫాలుగా జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ‘బడ్జెట్’ ఎలా ఉండబోతుందో అనే అంశంపై జోరుగా ఆర్థిక మేధావుల్లో చర్చ నడుస్తోంది. 2022-23 బడ్జెట్లో కేంద్రం మధ్యతరగతి ప్రయోజనాల దృష్ట్యా.. రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో మొదటిది.. స్టాండర్డ్ డిడక్షన్.. ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకునే వెసులుబాటు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని.. తిరిగి 2018-19 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మొదట రూ.40,000గా ప్రకటించి.. ఆపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా? మరింత ప్రయోజనం కల్పిస్తారా? అనే దానిపై బడ్జెట్లోనే స్పష్టత రానుంది. వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగుతున్న నేపథ్యంలో.. కొన్ని దేశాలు అమలు చేస్తున్న తరహా ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు. పిల్లల చదువు పొదుపు.. ఏటేటా పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సుకన్య సమృద్ధి యోజన.. అదీ అమ్మాయిలకు తప్పించి మరేయితర ప్రయోజనం చేకూరడం లేదు. ఈ తరుణంలో ‘సెక్షన్ 80-సీ’ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇదే మంతప్రయోజనంగా లేదనేది అసలు విషయం. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పైగా పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్! -
పిల్లల చదువుకై కిడ్నీ ’అమ్మ’కానికి!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ తల్లి పిల్లల చదువు కోసం కిడ్నీ అమ్మకానికి సిద్దపడింది. యూపీలోని రోహత ప్రాంతానికి చెందిన ఆర్తీ అనే మహిళా తను కిడ్నీ అమ్మకానికి సిద్దమని బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విషయంపై విలేకరులు సంప్రదించగా ఆమె బాధను వెల్లడించింది. నలుగురు పిల్లల చదువు ఫీజులు కట్టలేకపోతున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆర్తీకి ముగ్గురు కూతురులు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు సీబీఎస్ఈ స్కూల్ లో చదువుతున్నారు. తన భర్తకు బట్టల షాప్ ఉండేదని, నోట్ల రద్దుతో వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొంది. పిల్లల చదువు విషయంపై లోకల్ ప్రజాపతినిధులు కలిస్తే సహాయం చేయకపోగా.. మీ స్టేటస్ తగ్గట్లు చదివించుకోవాలని సూచించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను కూడా కలిసానని, సీఎం సహాయం చేస్తానని మాట ఇచ్చాడని కానీ ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదని పేర్కొంది. దీంతో చేసేదేమి లేక తన ఒక కిడ్నీని అమ్మకానికి పెట్టినట్లు ఆర్తీ తన బాధను వెల్లడించింది. టాక్సీ డ్రైవర్‌గా నెలకు రూ.5000 కు మించి సంపాదించలేక పోతున్నానని ఆమె భర్త మనోజ్ శర్మ తెలిపాడు. -
పిల్లల చదువుకు బీమా ఉందా?
పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని, వారి భవిష్యత్తు భద్రంగా ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. చదువు, ఇతర ముఖ్య అంశాల్లో వారికెలాంటి ఒడిదుడుకులూ ఎదురవకూడదని ఆశిస్తారు. అయితే దీనికి చేయాల్సిందొకటే. ఎవరి ఆదాయ వనరులు ఎంతో వారికి దాదాపు తెలుసు కనుక పిల్లల కోసం పక్కా ప్రణాళిక వేసుకోవాలి. ఎందుకంటే చదువులకయ్యే ఖర్చు ఏటేటా పెరుగుతుంటుంది. వారి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సొమ్మును ఇన్వెస్ట్ చేయాలి. పెరిగే విద్యా వ్యయాన్ని తట్టుకునే శక్తి ఈ పెట్టుబడుల ద్వారా సమకూరుతుంది. పిల్లల కోసం చక్కని బీమా పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి తగిన స్కీమును వారు ఎంచుకుంటే పిల్లల భవితకు ఢోకా ఉండదు. దురదృష్టవశాత్తూ తల్లిదండ్రులు మరణించినా వారి చదువు నిరాటంకంగా కొనసాగుతుంది. బాలలకు తగిన బీమా పథకాన్ని ఎంచుకోవడానికి నాలుగు సులభ సూత్రాలివీ... 1. పిల్లలకు 18 ఏళ్లు రాగానే మెచ్యూరిటీ ఫలితాలు ప్రారంభమయ్యే విధంగా అనేక కంపెనీల స్కీములున్నాయి. ఆర్థిక సలహాదారుతో చర్చించి మీకు తగిన ప్లాన్‌ను ఎంచుకోండి. 2. పలు కంపెనీల ప్లాన్లలో ప్రీమియం మాఫీ ఆప్షన్ ఉంటుంది. పేరెంట్ చనిపోతే ఇక ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పాలసీ మాత్రం మెచ్యూరిటీ వరకు కొనసాగుతుంది. 3. పెట్టుబడికి రక్షణతో పాటు అధిక ఆదాయాన్నిచ్చే విధంగా బీమా పథకం ఉండాలి. వార్షిక ప్రీమియంకు కనీసం 20 రెట్లు రిస్క్ కవరేజీ ఉండేట్లు చూసుకోవాలి. దురదృష్టవశాత్తూ పేరెంట్ మరణిస్తే రిస్క్ కవరేజీ కారణంగా ఆ కుటుంబానికి గణనీయ మొత్తం అందుతుంది. 4. బీమా ప్రొడక్టుకు సంబంధించిన బ్రోచర్‌ను క్షుణ్ణంగా చదవండి. ఖాతాదారులు ఎంత చెల్లించాలో ఆ బ్రోచర్లో స్పష్టంగా ఉంటుంది. మార్కెట్లో లభించే ప్రొడక్టు(స్కీము)లను, కంపెనీల ప్రతిష్టను, పథకాల్లో ఫ్లెక్సిబిలిటీని, సేవల్లో నాణ్యతను పోల్చిచూడండి. మీకు నచ్చిన పథకాన్ని తీసుకోండి. - మయాంక్ బత్వాల్, డిప్యుటీ సీఈవో, బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ 51 శాఖలు ప్రారంభించిన ఎస్బీఐ ఫండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తాజాగా రికార్డు స్థాయిలో 51 శాఖలను ఒకే రోజున ప్రారంభించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కార్యకలాపాలు విస్తరించేందుకు ఇది ఉపకరించగలదని ఎస్బీఐ ఎంఎఫ్ ఎండీ దినేష్ ఖరా తెలిపారు. దీంతో మొత్తం శాఖల సంఖ్య 161కి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ప్రిన్సిపల్ మ్యూచువల్ స్కీముల విలీనం ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్ తాజాగా తమ రిటైల్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్‌ను గ్రోత్ ఫండ్‌లో విలీనం చేయనున్నట్లు తెలిపింది. ఇది ఈ నెల 28 నుంచి అమల్లోకి వస్తుంది. దీనికి సుముఖంగా లేని యూనిట్ హోల్డర్లు.. నోటీసు వ్యవధిలో ఎటువంటి ఎగ్జిట్ లోడ్ లేకుండా వైదొలిగేందుకు ఫండ్ అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 28 సాయంత్రం 3 గంటల దాకా నోటీసు వ్యవధి ఉంటుంది. యూటీఐ ఎంఎఫ్ నుంచి డెట్ ఫండ్ యూటీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. రాబడులపై నిర్దిష్ట హామీ ఉండని ఈ ఓపెన్ ఎండెడ్ స్కీము గడువు జనవరి 31తో ముగిసినా..ఫిబ్రవరి 6 నుంచి కొనుగోళ్లు, అమ్మకాల కోసం పునఃప్రారంభిస్తామని సంస్థ పేర్కొంది. బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే డెట్ సాధనాల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. తద్వారా తక్కువ రిస్కు, అధిక లిక్విడిటీతో సముచిత రాబడులు అందించే ప్రయత్నం చేస్తుంది. ప్రాథమికంగా ట్రిపుల్ ఎ, ఎ1 ప్లస్ రేటింగ్ ఉండే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.