Kill Movie
-
తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న బ్లాక్ బస్టర్ సినిమా
బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న 'కిల్' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే, తెలుగు ప్రేక్షకులకు మేకర్స్ శుభవార్త చెప్పారు. లక్ష్ లాల్వానీ , తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా జులై 5న విడుదలైంది. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. మోస్ట్ వయోలెంట్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలో కూడా ట్రెండ్ అవుతుంది. అయితే, హిందీ వర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది. తాజాగా తెలుగు, తమిళ్ వర్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.'కిల్' చిత్రంలో ఎక్కువగా హింస ఉందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. సెప్టెంబర్ 6 నుంచి హిందీలో మాత్రమే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం నేటి నుంచి (సెప్టెంబర్ 24) తెలుగు, తమిళ్ వర్షన్లో కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో 'కిల్' సినిమా అభిమానులు సంతోషిస్తున్నారు.కథేంటి..?అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ. -
KILL ఓటీటీలోకి భారీ యాక్షన్ మూవీ..
-
ఓటీటీలో భారీ యాక్షన్ సినిమా స్ట్రీమింగ్
బాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న 'కిల్' సినిమా ఓటీటీలోకి రానుంది. లక్ష్ లాల్వానీ , తాన్య మనక్తిలా జంటగా నటించిన ఈ సినిమా జులై 5న విడుదలైంది. ఆ సమయంలో కల్కి 2898 ఏడీ సినిమాతో గట్టి పోటీని తట్టుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. అయితే, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచేస్తున్న ప్రేక్షకులకు హాట్‌స్టార్ గుడ్‌న్యూస్ చెప్పింది.ధర్మా ప్రొడక్షన్స్‌పై నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించిన కిల్ గతేడాదిలో నిర్వహించిన టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. యూకే, అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తాజాగా డిస్నీ+హాట్ స్టార్ వేదికగా సెప్టెంబర్ 6న భారత్‌లో విడుదల కానున్నట్లు ప్రకటన వెలువడింది. ప్రస్తుతం హిందీలో మాత్రమే అందుబాటులోకి రానుందని తెలిపారు. తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎప్పుడు విడుదలకానుంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే. అంతలా ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి.కథేంటి..?అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ. -
నా సినిమా సౌత్‌లోనే ఎక్కువ ఆడింది.. ఇక్కడివాళ్లేమో..: బాలీవుడ్ హీరో
హిందీ చిత్రం 'కిల్' బాలీవుడ్లో కన్నా దక్షిణాదిలోనే ఎక్కువ ఆదరణ పొందిందని అంటున్నాడు నటుడు రాఘవ్ జుయల్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన కిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా గురించి రాఘవ్ మాట్లాడుతూ.. ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే కిల్ సినిమాను ఎక్కువ ఆదరించారు. మన దగ్గర జనాలు ఇక్కడి సినిమాలపై నిషేధం విధించాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బిజీగా ఉంటారు.సినిమా చూశాక మాట్లాడండితీరా రిలీజయ్యాక కనీసం గడప దాటి థియేటర్‌కు కూడా వెళ్లరు. ముందు సినిమా చూడాలి.. ఆ తర్వాత అభిప్రాయాలు చెప్పండి. సౌత్‌లో, ముఖ్యంగా మలయాళ సినిమాలో ఆవేశం, మంజుమ్మెల్ బాయ్స్ వంటి భిన్నమైన చిత్రాలు నిర్మిస్తారు. కిల్ సినిమా వచ్చి నెల దాటిపోయింది. ఇప్పటికీ దక్షిణాదిలో కొన్ని థియేటర్లలో విజయవంతంగా ఆడుతూనే ఉంది.ఇప్పటికీ ఆడుతోందిప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు, కిల్ ఒకేసారి రిలీజయ్యాయి. ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అని జుయల్ పేర్కొన్నాడు. ఇందులో నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో లక్ష్య లల్వాని కీలక పాత్ర పోషించాడు.చదవండి: స్టార్ హీరోయిన్‌కి త్వరలో మరో బుజ్జాయి -
Kill Movie Review: 'కిల్' సినిమా రివ్యూ
మీకు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే దీన్ని అస్సలు మిస్ కావొద్దు. 'కల్కి' రిలీజైన వారం తర్వాత థియేటర్లలోకి వచ్చిన హిందీ సినిమా 'కిల్'.. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆహా ఓహో అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటిది థియేటర్లలో ఉండగానే ఈ చిత్రాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం యూఎస్, యూకేలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ 'కిల్' ఎలా ఉందో తెలియాలంటే రివ్వ్యూ చదివేయండి.కథేంటి?అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్లని అమిత్ కాపాడాడా లేదా అనేది స్టోరీ.ఎలా ఉందంటే?నరకడం, పొడవడం, చంపడం.. కేవలం ఈ మూడింటినే మనసులో పెట్టుకుని ఓ డైరెక్టర్ సినిమా తీస్తే అదే 'కిల్'. హాలీవుడ్లో 'జాన్ విక్' అని ఓ మూవీ సిరీస్.. హీరో, విలన్ గ్యాంగ్ ని రకరకాల వస్తువులతో చంపేస్తుంటాడు. ఈ మూవీని కూడా సేమ్ అదే తరహాలో తీశారు. కథ చూస్తే కొత్తదేం కాదు. హీరోయిన్ ఫ్యామిలీ.. విలన్ గ్యాంగ్ చేతిలో చిక్కుకుంటుంది. హీరో ఎలా కాపాడాడు అనేదే స్టోరీ లైన్. కానీ ఇప్పటివరకు వచ్చిన వాటితో పోలిస్తే 'కిల్'లో కొత్తగా ఏముంది అని అడిగితే హాలీవుడ్ స్టైల్ యాక్షన్.ఈ సినిమా అంతా ట్రైన్లోనే తీశారు. సరిగ్గా 100 నిమిషాలు ఉంటుంది. కథ మొదలైన పావుగంట నుంచి యాక్షన్ మొదలవుతుంది. చివరివరకు ఊపిరి బిగపట్టుకుని చూసే రేంజులో యాక్షన్, స్క్రీన్ ప్లే ఉంటుంది. ఓ ట్రైన్.. ఇద్దరు ఎన్ఎస్జీ కమాండోలు.. 40 మంది బందిపోట్లు.. వీళ్ల మధ్య జరిగే భీకర ఫైటింగ్. మొత్తం అంతా ఇదే. పస్టాఫ్‌లో హీరో.. విలన్ గ్యాంగ్‌ని చంపకుండా కేవలం కొట్టి కిందపడేస్తుంటాడు. ఓ ఊహించని ఘటన జరిగేసరికి కృూరంగా మారిపోతాడు. పొడవడం, నరకడంలో విలన్ గ్యాంగ్‌కే చుక్కలు చూపిస్తాడు.ఒంటి నిండా కత్తిపోట్లతో తోటి ప్రయాణికుల్ని కాపాడుతూనే విలన్ గ్యాంగ్‌ని నామరూపాల్లేకుండా చేస్తాడు. కొందరిని హీరో చంపే సీన్స్ అయితే వికారంతో పాటు భయానకం అనిపిస్తాయి. హాలీవుడ్లో ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మన దగ్గర మాత్రం ఇలాంటి మూవీ ఇదే ఫస్ట్ టైమ్. బీభత్సమైన యాక్షన్ మూవీస్ అంటే ఇష్టముంటే ఇది కచ్చితంగా చూడాల్సిన సినిమా.హీరో లక్ష్యకి ఇదే తొలి సినిమా గానీ అదరగొట్టేశాడు. విలన్ గ్యాంగ్‌లో ఫణి అనే పాత్ర చేసిన రాఘవ జూయల్ కూడా ఇరగదీశాడు. ఫన్నీగా జోకులేస్తూనే చంపేస్తుంటాడు. సినిమా కథ పక్కనబెడితే టెక్నికల్ వాల్యూస్ టాప్ నాచ్ ఉంటాయి. ఫైట్స్ డిజైన్ అయితే ఒక్కో సీన్ చూస్తుంటే మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది. సినిమాటోగ్రాఫీ అయితే ఇంకా కేక. ట్రైన్ సెట్లో మూవీ తీసుండొచ్చు. కానీ ఎక్కడా కూడా మనకు ఆ ఆలోచనే రాదు. నిజంగా మనం కూడా ఆ ట్రైన్లో చిక్కుకుపోయాం అనే రేంజులో భయపడతాం. ఫైనల్‌గా చెప్పాలంటే మీకు గుండె ధైర్యం ఎక్కువుంటే 'కిల్' చూడండి!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్