హిందీ చిత్రం 'కిల్' బాలీవుడ్‌లో కన్నా దక్షిణాదిలోనే ఎక్కువ ఆదరణ పొందిందని అంటున్నాడు నటుడు రాఘవ్ జుయల్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన కిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా గురించి రాఘవ్ మాట్లాడుతూ.. ఉత్తరాది కన్నా దక్షిణాదిలోనే కిల్ సినిమాను ఎక్కువ ఆదరించారు. మన దగ్గర జనాలు ఇక్కడి సినిమాలపై నిషేధం విధించాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ బిజీగా ఉంటారు.
సినిమా చూశాక మాట్లాడండి
తీరా రిలీజయ్యాక కనీసం గడప దాటి థియేటర్‌కు కూడా వెళ్లరు. ముందు సినిమా చూడాలి.. ఆ తర్వాత అభిప్రాయాలు చెప్పండి. సౌత్‌లో, ముఖ్యంగా మలయాళ సినిమాలో ఆవేశం, మంజుమ్మెల్ బాయ్స్ వంటి భిన్నమైన చిత్రాలు నిర్మిస్తారు. కిల్ సినిమా వచ్చి నెల దాటిపోయింది. ఇప్పటికీ దక్షిణాదిలో కొన్ని థియేటర్లలో విజయవంతంగా ఆడుతూనే ఉంది.
ఇప్పటికీ ఆడుతోంది
ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు, కిల్ ఒకేసారి రిలీజయ్యాయి. ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఆదరిస్తున్నందుకు థ్యాంక్స్ అని జుయల్ పేర్కొన్నాడు. ఇందులో నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో లక్ష్య లల్వాని కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment