killi rammohan rao
-
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్..
-
శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని ఆముదాల వలసలో టీడీపీకి షాక్ తగిలింది. టీడీపీ నేత కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు కిల్లి రామ్మోహన్రావు టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనుచరులతో చర్చించాక ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని తెలిపారు. చంద్రబాబు వల్లే టీడీపీకి మనుగడ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. చంద్రబాబును చూసి టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. రిగ్గింగ్తోనే ఎమ్మెల్యేగా అచ్చెన్నాయుడు, ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలిచారని ఆయన ఆరోపించారు. చదవండి: ‘రాజకీయ బతుకుదెరువు కోసమే టీడీపీ కుట్రలు’ నేను ఆరోగ్యంగా ఉన్నా: విజయసాయిరెడ్డి -
కిల్లి రామోహన్రావు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం
రాష్ట్ర విభజనకు నిరసిస్తు, సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు, రేపు రహదారుల దిగ్బంధంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆమదాలవలస వద్ద ఆ పార్టీ నేత కిల్లి రామోహనరావు ఆధ్వర్యంలో పాలకొండ రహదారిపై ధర్నా నిర్వహించారు. దాంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అలాగే రణస్థలం వద్ద జాతీయరహదారిపై వైఎస్ఆర్ సీపీ పార్టీ నేత గొర్లె కిరణ్కుమార్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. దాంతో విశాఖపట్నం - శ్రీకాకుళం జాతీయ రహదారిపై వాహనాలు భారీగా సంఖ్యలో నిలిచిపోయాయి.