kings panjab
-
ధోనీ.. నీ కూతుర్ని కిడ్నాప్ చేస్తా ..!
హైదరాబాద్ : కింగ్స్ పంజాబ్ యజమాని చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనికి వార్నింగ్ ఇచ్చారు. ఐపీఎల్లో భాగంగా గత ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ విజయం సాధించడంపై ప్రీతిజింటా ఆనందం వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం ధోనితో కరచాలనం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆమె.. "కెప్టెన్ కూల్‌కి చాలామంది అభిమానులు ఉన్నారు. వారిలో నేనొకరిని. అయితే, ఈ మధ్య కాలంలో నేను ధోనితో పాటు ఆయన కూతురు జీవాకు కూడా ఫ్యాన్‌ని అయ్యా. నా దృష్టి ఆమెపై పడింది. జీవా విషయంలో జాగ్రత్తగా ఉండమని ధోనీని హెచ్చరిస్తున్నా. ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాను" అని ట్విటర్లో సరదా వ్యాఖ్యలు చేశారు. కాగా, ధోని.. ప్రీతి మైదానంలో దిగిన ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలు, ట్విటర్లో 3.3 లక్షల లైకులు రావడం విశేషం. ఐపీఎల్ 12వ సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ నాయకత్వంలోని కింగ్స్ పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరుకోని సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో సమానంగా 12 పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్‌రేట్ (-0.251) తక్కువగా ఉండటంతో కింగ్స్ పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. దీంతో ఇంటిదారి పట్టింది. Captain cool has many fans including me, but off-late my loyalties are shifting to his little munchkin Ziva. Here I’m telling him to be careful - I may just kidnap her 😜 Now it's time for you guys to Caption THIS photo...#Ting pic.twitter.com/bD1ADSXopc — Preity G Zinta (@realpreityzinta) May 7, 2019 -
అందువల్లే బాగా బ్యాటింగ్ చేశా: రాహుల్
ఇండోర్: రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం ఇండోర్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చడంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ పాత్ర మరువరానిది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ సాధించిన ఈ విజయంలో రాహుల్ పాత్ర కీలకం. అజేయ అర్ధ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. అద్భుతమైన బౌండరీలతో చివరివరకూ కొనసాగి జట్టుకు విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది 84 పరుగులు సాధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ... ‘నేను చేసిన హాఫ్ సెంచరీల్లో నాకు నిజంగా తృప్తినిచ్చిన మొదటి అర్ధ శతకం ఇదే. జట్టును గెలిపించడం కోసం చివరి వరకూ ఆడాను. ఐపీఎల్ నా ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇంకా బాగా రాణించి మా జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని భావిస్తున్నాను. నాపై నేను నమ్మకం ఉంచడం వల్లే ఇంత బాగా ఆడగలిగాను. అందుకే మరీ జాగ్రత్తగా ఆడకుండా మంచి షాట్స్‌ను కొట్టగలిగాను. టి20ల్లోనూ బాగా రాణిస్తాననే నమ్మకం కలిగింద’ని అన్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో తనకు మద్దతుగా నిలిచిన బ్యాట్సమెన్ నాయర్, స్టోనిస్లకు గురించి చెబుతూ.. ‘నాకు జతగా ఎవరైనా ఉంటే బాగుండు అన్పించింది. ఆ విషయంలో కరుణ్, స్టోనిస్‌లు చాలా బాగా తోడ్పడ్డారు. వారు కూడా మంచి స్కోరు సాధించార’ని అన్నాడు. రాహుల్‌కు జతగా కరుణ్ నాయర్(31), స్టోనిస్(23 నాటౌట్)లు ఆకట్టుకున్నారు. -
ఎందరు మారినా ఢిల్లీ రాత మాత్రం మారలేదు
-
మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా
-
మాజీ ప్రియుడిపై కేసు పెట్టిన ప్రీతి జింతా
ముంబాయి : బాలీవుట్ నటి, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓనర్ ప్రీతి జింతా తన మాజీ ప్రియుడు, వ్యాపారవేత్త నెస్ వాడియాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మే 30న వాంఖేడ్ స్టేడియంలో పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతో నెస్ వాడియా అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె గురువారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రీతి ఫిర్యాదు మేరకు ముంబయి మెరైన్ డ్రైవ్ పోలీసులు నెస్ వాడియాపై పలు సెక్షన్ల (354, 504, 506,509 సెక్షన్లు) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెస్ వాడియా, ప్రీతి జింతాల మధ్య గతంలో ప్రేమ వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి గతంలో ఐపీఎల్ పంజాబ్ టీంకు ఓనర్లుగా ఉన్నారు. కొంత కాలం తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు ఒకరంటే ఒకరికి పడనంత శత్రుత్వం. చివరికి వీరిద్దరి వ్యవహారం పోలీస్ స్టేషన్‌కి చేరటం విశేషం. మరోవైపు ప్రీతి ఫిర్యాదును నెస్ వాడియా తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.