Kiran comments
-
జగన్, విజయమ్మ రాజీనామాలపై ఎమ్మెల్సీ జూపూడి హర్షం
నెల్లూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా కిరణ్ సర్కార్ తయారుచేసిందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని దర్గామిట్టలోని అంబేద్కర్ భవన్లో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్సార్ మరణం రాష్ట్రానికి తీరని లోటని ప్రతి ఒక్కరికీ అర్థమవుతోందన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఉద్యమాలపై ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు లోక్‌సభలో ఏమీ మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం, చంద్రబాబు నక్కనాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సోనియాగాంధీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ప్యాకేజీల కోసం బాబు పనిచేస్తున్నారని జూపూడి ఆరోపించారు. ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడితే, చంద్రబాబు మాత్రం ఆ కుటుంబాన్ని చీల్చి, అదే తరహాలో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తమ పదవులకు రాజీనామాలు చేయడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్సీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. రాష్ట్రం విడిపోతే నీటి సమస్య, మౌలిక వసతులు, ఆర్థిక సమయ్య, విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆయనన్నారు. -
కిరణ్ వ్యాఖ్యలపై భగ్గు
బంజారాహిల్స్,న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించిన తర్వాత..ముఖ్యమంత్రి కిరణ్ ధిక్కరించే ధోరణిలో వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్,విద్యార్థి, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం నగరంలో పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశాయి. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో తెలంగాణభవన్ నుంచి సీఎం కిరణ్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం కళింగభవన్ చౌరస్తా దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కిరణ్ సమైక్యాంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. ఓయూలో దిష్టిబొమ్మ దహనం ఉస్మానియాయూనివర్సిటీ: తెలంగాణ కు వ్యతిరేకంగా సీఎం కిరణ్ వ్యాఖ్యలపై ఓయూలో పలు విద్యార్థిసంఘా లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీఆర్ఎస్వీ, టీజీవీపీ,ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు వేర్వేరుగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో.. బషీర్‌బాగ్: కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాం ధ్ర ఉద్యమానికి ఆజ్యంపోస్తున్నారని, వెంటనే ఆయన్ను తొలగించాలని పీడీఎస్‌యూ,టీఆర్‌ఎస్వీలు డిమాండ్ చే శాయి. బషీర్‌బాగ్ బాబూజగ్జీవన్‌రాం విగ్రహం వద్ద వేర్వేరుగా సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడకుండా సీమాంధ్ర ఉద్యమాన్ని రె చ్చగొడుతున్నారని విమర్శించారు. నదీజలాల వివాదాలు వస్తాయని రె చ్చగొట్టి మరికొంతకాలం తెలంగాణ ను వాయిదావేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.