kiran party
-
కాంగ్రెస్, కిరణ్ పార్టీలకు ఓటు వేయవద్దు
తెలగ, బలిజ, కాపు ఐక్యకార్యాచరణ వేదిక రాష్ర్ట కన్వీనర్ రామ్మోహనరావు ఇచ్ఛాపురం,న్యూస్‌లైన్: రిజర్వేషన్ల హామీని మరిచిన కాంగ్రెస్, కిరణ్ పార్టీలకు ఎట్టిపరిస్థితులలోనూ ఓటు వేయవద్దని తెలగ, బలిజ, కాపు ఐక్య కార్యాచరణ వేదిక రాష్ర్ట కన్వీనర్ దాసరి రామ్మోహనరావు పిలుపునిచ్చారు. గురువారం ఇచ్ఛాపురంలో పర్యటించిన ఆయన సంఘ ముఖ్యులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలగ, ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని 2004 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న కాంగ్స్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలగ, బలిజలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రస్థాయిలో పోరాటాలు చేసినా ముఖ్యమంత్రిగా పని చేసిన కిరణ్‌కుమార్ రెడ్డి పట్టించుకోకుండా ఫైల్‌ను తోక్కిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రలో తెలగ, బలిజ, కాపులు 22 శాతం జనాభా ఉంటారని, ఈ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ గెలవాలన్నా ఈ కులాల ఓట్లు కీలకమన్నారు.తెలగ కులస్తులందరూ తమ ఓట్లు చీల్చుకోకుండా, అమ్ముకోకుండా ఐకమత్యంగా, బాధ్యత యుతవంగా వ్యవహరించాలన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అయితే జనాభా దామాషా ప్రకారం అత్యధిక స్థానాలు ఇవ్వడంతోపాటు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని నిజాయితీగా మేనిఫెస్టోలో హామీ ఇస్తుందో తమ మద్దతు ఉంటుందన్నారు. సమావేశంలో స్థానిక తెలగ కుల పెద్దలు బల్లా రామారావు, వల్లూరి జానకి రామారావు పాల్గొన్నారు. -
కిరణ్....పవన్....బీజేపీ... ఇండిపెండెట్?
కందుకూరు : 'ఏ పార్టీలోకి వెళ్దాం..? కిరణ్ పార్టీ, పవన్ పార్టీ, బీజేపీల్లో ఏదో ఒకటి చెప్పండి. లేదూ ఇండిపెండెంట్‌గా పోటీ చేయమంటారా...?' ఇవీ మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి తన నిజయోకవర్గ కార్యకర్తల ముందు ఉంచిన ఆప్షన్లు. కాంగ్రెస్ ఖాళీ అయిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటకొచ్చే యోచనలో ఉన్న మహీధర్ రెడ్డి నిన్న మాచవరంలోని తన నివాసంలో గుడ్లూరు, ఉలవపాడు మండలాలకు చెందిన పలువురు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 'కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీలున్నాయి. వీటిలో ఏదో ఒక పార్టీలోకి వెళ్దామా? లేదంటూ ఇండిపెంటెండ్గా పోటీకి దిగమంటారా' అని మహీధర్ రెడ్డి కార్యకర్తలను ప్రశ్నించారు. కార్యకర్తల మనసులో వైఎస్ఆర్ సీపీనే ఉండడంతో మహీధర్ రెడ్డి ఇచ్చిన ఆప్షన్లకు ఎవరూ సమాధానం చెప్పలేదు. వైఎస్సార్ సీపీలోకి వెళ్దామని కొందరు అనడంతో ... ఆపార్టీలోకి వెళ్లేవారు ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ ఆయన ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. కార్యకర్తలకు ఏ పార్టీలోకి వెళ్దామని ఆప్షన్లు ఇచ్చినప్పటికీ ఆయన మాటలను బట్టి చేస్తే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేలా కనిపిస్తున్నారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ సీపీ టికెట్ దక్కదనే ఉద్దేశంతోనే కిరణ్, పవన్, బీజేపీ అని ఆయన ఆప్షన్లు ఇచ్చారని చెబుతున్నారు. పైగా ఆప్షన్లలో పేర్కొన్న పార్టీల గురించలి పెద్దగా చర్చించలేదని కార్యకర్తలు తెలిపారు. -
మా పార్టీకి రావచ్చుగా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘నేను సీఎంగా ఉన్నప్పుడు మీరు అడిగిన పనులు చేశానుగా. ఈ సారి ఎన్నికల్లో మా పార్టీ తరపున పోటీ చేయొచ్చుగా. ఒక సారి వచ్చి కలిస్తే అన్నీ మాట్లాడుకుందాం’ జిల్లాలో ముఖ్యమైన రాజకీయ నాయకులకు మారూ. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్ చేసి ఈ రకమైన ఆహ్వానం పలుకుతున్నారు. ‘అన్నీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఒక సారి హైదరాబాద్‌కు వచ్చి కలవచ్చుగా’ అని కిరణ్ సోదరులు సంతోష్, కిషోర్ మరో వైపు జిల్లా నేతలను సమీకరించుకునే పనిలో పడ్డారు. కాంగ్రెస్‌కు రారూ.నామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెడితే చూద్దామని కొందరు కాంగ్రెస్ నేతలు ఆయన వెంట నడిచారు. రాజ్యసభ ఎన్నికల విషయంలో ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డితో కిరణ్‌కు చెడింది. అప్పటి వరకు వేచి చూసే ధోరణిలో ఉన్న ఆదాల సైకిలెక్కేందుకు వేగంగా నిర్ణయం తీసుకున్నారు. కిరణ్ పార్టీ పెట్టడానికి భయపడిన వాతావరణం కనిపించడంతో ఆయన వైపు నిలిచిన ఒకరిద్దరు నేతలు కూడా మెల్లగా జారుకున్నారు. ఉద్యోగులు, విద్యార్థి వర్గాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందనుకున్నా ఆ అంచనాలు కూడా పెద్దగా కనిపించలేదు. జిల్లా అల్లుడైన కిరణ్‌కు ఈ జిల్లా నుంచే అన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క పోతే అవమానంగా ఉంటుందనే అంచనాతో కిరణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యు లు సైతం రంగంలోకి దిగారని తెలిసింది. కిరణ్ సీఎంగా ఉన్న సమయంలో జిల్లా నాయకులతో ఏర్పడిన సంబంధాలు, తమ బంధుత్వాలను కూడా పార్టీ నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మీద కిరణ్ వల విసిరారని సమాచారం. జిల్లాలో తమ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరించాలని వచ్చిన విన్నపాన్ని వాకాటి తిరస్కరించినట్లు తెలిసింది. వెంకటగిరికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతను తమ పార్టీ నుంచి పోటీ చేయాల్సిందిగా రాయబారం పంపినట్లు వినికిడి. ఈ ప్రతిపాదనపై ఆ నాయకుడు ఏ నిర్ణయం వెల్లడించలేదని తెలిసింది. కావలి నియోజకవర్గం నుంచి మారూ. ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డిని తమ వైపునకు రప్పిం చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఉదయగిరికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరిని కిరణ్ స్వయంగా రాజధానికి ఆహ్వానించారని తెలిసింది. నెల్లూరు సిటీ టికెట్ ఆశిస్తున్న ఆనం జయకుమార్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో కిరణ్‌ను కలి శారు. ఆయనకు సానుకూల సమాధానం లభించినట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి దేవెళ్ల స్వరూప్రెడ్డిని, కోవూరు నుంచి సుమంత్‌రెడ్డిని పోటీ చేయించే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ, టీడీపీలో టికెట్లు లభించని వారిలో చాలా మంది మరో ప్రత్యామ్నాయంగా తమ వైపునకు రాకతప్పదనే అంచనాతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మునిగిన నావకు కొత్త సారథెవరో?
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్ గుప్తా చేసిన రాజీనామాను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ శుక్రవారం ఆమోదించారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన తర్వాత గత ఏడాది అక్టోబర్ 8న డీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ దాన్ని ఆమోదించని బొత్స.. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తి కావడంతో ఆమోదముద్ర వేశారు. ఈ క్రమంలో కొత్త డీసీసీ అధ్యక్షుడిని ఎన్నిక చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. జిల్లాలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించగా.. మాజీ సీఎం కిరణ్ పార్టీ పెడితే అందులో మరో మాజీ మంత్రి శైలజానాథ్ చేరుతారన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ అయిన జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలు ఆ పార్టీని వీడే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త డీసీసీ అధ్యక్షని ఎంపిక విషయంలో రఘువీరారెడ్డి మాటే చెల్లుబాటవుతుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీలు పాటిల్, వై.శివరామిరెడ్డి పేర్లను డీసీసీ అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తున్నారు. కానీ.. ఎన్నికల్లో పోటీచేసే నేతకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదని ఆ పార్టీ యువనేత రాహుల్‌గాంధీ నిబంధన పెట్టారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం పరిశీలిస్తోన్న ముగ్గురు నేతలు కూడా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. గుండుమల తిప్పేస్వామి హిందూపురం లోక్‌సభ స్థానాన్ని ఆశిస్తుండగా.. పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి రాయదుర్గం, వై.శివరామిరెడ్డి ఉరవకొండ శాసనసభ స్థానాల నుంచి పోటీచేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాయదుర్గం నుంచి పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కుటుంబంలో ఒకరి టికెట్ ఇచ్చి.. ఆయనను డీసీసీ అధ్యక్షునిగా నియమించాలని రఘువీరా ప్రతిపాదిస్తున్నట్లు ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి. -
సమైక్య నినాదంతో సీమాంధ్రలో కొత్త ప్లెక్సీలు