Kisan Mazdoor Praja Party
-
Farmers movement: రణరంగమైన శంభు సరిహద్దు
చండీగఢ్: డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన ఆందోళనలతో పంజాబ్–హరియాణా నుంచి ఢిల్లీకి దారితీసే ప్రాంతాలన్నీ శుక్రవారం నాలుగో రోజూ అట్టుడికిపోయాయి. శంభు సరిహద్దు తదితర చోట్ల తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. పోలీసు వలయాలను ఛేదించుకొని దూసుకెళ్లేందుకు నిరసనకారులు తీవ్ర ప్రయత్నం చేశారు. కొందరు ముసుగులు ధరించి పోలీసులపైకి రాళ్లు విసిరారు. వారిని చెదరగొట్టానికి పోలీసులు భారీ సంఖ్యలో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. ఇరు వర్గాల ఘర్షణలతో శంభు సరిహద్దు రణరంగంగా మారింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తదితర డిమాండ్ల సాధనకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర రైతు సంఘాలు ‘చలో ఢిల్లీ’కి పిలుపునివ్వడం తెలిసిందే. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవి్వస్తున్నారంటూ పోలీసులు వీడియోలు విడుదల చేశారు. శంభు సరిహద్దు వద్ద నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్న జ్ఞాన్‌సింగ్ అనే 63 ఏళ్ల రైతు గుండెపోటుతో మృతిచెందాడు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన ఆయనకు ఉదయం గుండె నొప్పి రావడంలో ఆసుపత్రిలో చేర్చినా లాభం లేకపోయింది. మరోవైపు, రైతు సంఘాలు ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ పిలుపుతో శుక్రవారం పంజాబ్, హరియాణాతోపాటు ఉత్తరాది రాష్ట్రాల్లో చాలాచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. రైతులు హైవేలను దిగ్బంధించారు. రేపు మంత్రుల కమిటీ చర్చలు కేంద్ర మంత్రులు, రైతు సంఘాల నేతల మధ్య ఇటీవల మూడు సార్లు చర్చలు జరిగాయి. ఈ నెల 8, 12, 15వ తేదీల్లో చర్చలు ఈ చర్చలు ఫలించలేదు. గురువారం రాత్రి ఐదు గంటలకు పైగా చర్చించినా ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాలేదు. డిమాండ్ల నుంచి రైతు సంఘాలు వెనక్కి తగ్గడం లేదు. చర్చలు ఆదివారం కూడా కొనసాగనున్నాయి. -
తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జెల్ల
స్వాతంత్య్రానంతరం తూర్పుగోదావరి జిల్లాలో 16 నియోజకవర్గాలుంటే వీటిలో నాలుగు ద్విసభ్య రిజర్వుడు స్థానాలు. 1952లో వీటికి తొలి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జిల్లాలో పార్లమెంటు స్థానాలు మూడు. వాటిలో కాకినాడ ఒకటైతే రాజమండ్రి ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి దక్కిన అసెంబ్లీ స్థానాలు నాలుగే. తుని, పెద్దాపురం, అన పర్తి, పామర్రు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. టంగుటూరి ప్రకాశం పంతులు కాంగ్రెస్‌ను వీడి సొంతంగా ఏర్పాటు చేసిన కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ (కేఎంపీపీ) జిల్లాలోని 4 స్థానాల్లో గెలిచి సంచలనం సృష్టించింది. ఆపార్టీ గెలిచిన నాలుగు స్థానాల్లో భద్రాచలం ఒకటి. అప్పట్లో భద్రాచలం డివిజన్‌గా ఈ జిల్లాలోనే ఉండేది. రైతు నేత ఎన్జీ రంగా స్థాపించిన కృషికార్ లోక్‌పార్టీ బూరుగుపూడి స్థానాన్ని గెలుచుకోగా, అంబేద్కర్ స్థాపించిన షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ అభ్యర్థి అమలాపురం ద్విసభ్య రిజర్వుడు స్థానం నుంచి గెలుపొందారు. దుర్గాబాయి దేశముఖ్‌ను ఓడించిన రాజమండ్రి ! 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో రాజమండ్రి ద్విసభ్య సాధారణ లోక్‌సభ స్థానంనుంచి విలక్షణ తీర్పు నమోదైంది. ఈ స్థానం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా ఎన్.రెడ్డి నాయుడు కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఆయన చేతిలో ఓటమి పాలైనది మరెవరో కాదు... ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశముఖ్ ! అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కళా వెంకటరావు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన అమలాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘోరపరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో ఆయనకు 12.5 శాతం మాత్రమే వచ్చాయి. రాజమండ్రి నుంచి పోటీచేసిన సోషలిస్టునేత, స్వాతంత్య్ర సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య కూడా కమ్యూనిస్టు అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అంతేకాక మూడోస్థానంలో నిలిచారు. అలాగే రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మల్లిపూడి పళ్లంరాజు (ప్రస్తుత కేంద్రమంత్రి పళ్లంరాజు తాత) ప్రజాపార్టీ అభ్యర్థి చేతిలో ఓడారు. ఆశ్చర్యం ఏమిటంటే స్వాతంత్య్రం తెచ్చానని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఓటమి పాలైంది.