Kochi Tuskers
-
మరోసారి ‘సూపర్ కింగ్స్’
ఐపీఎల్ తొలిసారి ఎనిమిదినుంచి పది జట్లకు పెరిగింది. కొత్తగా పుణే వారియర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ జట్లు వచ్చి చేరాయి. అయితే గత మూడు సీజన్ల ఫార్మాట్‌లాగే ప్రతీ జట్టు మరో జట్టుతో ఇంటా, బయట రెండేసి చొప్పున ఆడితే మ్యాచ్‌ల సంఖ్య ఏకంగా 94కు పెరిగే అవకాశం ఉండటంతో ఫార్మాట్లో కొన్ని మార్పులు చేశారు. పది టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజించి తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో రెండు మ్యాచ్‌లు, మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతూ ఒక్కో టీమ్ గరిష్ట మ్యాచ్‌లు 14కు మించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఈ షెడ్యూల్ చాలా కంగాళీగా మారిపోవడంతో అభిమానులు కూడా చాలా మ్యాచ్‌ల సమయంలో గందరగోళానికి గురయ్యారు. తొలిసారి నేరుగా సెమీ ఫైనల్, ఫైనల్ అర్హత కాకుండా ప్రస్తుతం ఉన్న తరహాలో ‘ప్లే ఆఫ్’ పద్ధతిని ప్రవేశపెట్టడం విశేషం. ఎన్ని మార్పులు జరిగినా ధోని టీమ్ జోరును మాత్రం ప్రత్యర్థులు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో సారి విజేతగా నిలవగా, మూడేళ్లలో రెండో సారి ఫైనల్ చేరిన బెంగళూరు మళ్లీ రన్నరప్‌గానే సంతృప్తి పడింది. మళ్లీ వేలం... తొలి మూడు సీజన్లు ముగియడంతో పాటు కొత్త జట్లు రావడంతో ఈ సారి మళ్లీ పూర్తి స్థాయి వేలం నిర్వహించడంతో పలు జట్లలో ఆటగాళ్లు మారిపోయారు. చెన్నై (ధోని, రైనా, విజయ్, మోర్కెల్), ఢిల్లీ (సెహ్వాగ్), ముంబై (సచిన్, హర్భజన్, పొలార్డ్, మలింగ), రాజస్థాన్ (వార్న్, వాట్సన్), బెంగళూరు (కోహ్లి)లను మాత్రమే కొనసాగించగా...కోల్‌కతా, పంజాబ్, హైదరాబాద్ మొత్తం ఆటగాళ్లను విడుదల చేశాయి. ఈ వేలంలోనే ముంబైకి వచ్చిన రోహిత్ శర్మ, బెంగళూరు ఎంచుకున్న ఏబీ డివిలియర్స్ మాత్రమే మార్పు లేకుండా ఇప్పటికీ అదే జట్లలో కొనసాగుతున్నారు. ముందుగా వేలంలో అమ్ముడుపోని క్రిస్ గేల్... డర్క్ నేన్స్ గాయం కారణంగా చివరి నిమిషంలో ఆర్సీబీ వద్దకు వచ్చి ఆ జట్టు రాత మార్చడం విశేషం. ఆ తర్వాత అతడి ఎన్నో సుడి గాలి ఇన్నింగ్స్‌లకు ఐపీఎల్ వేదికగా నిలిచింది. సౌరవ్ గంగూలీని కూడా ఎవరు తీసుకోకపోగా, నెహ్రా గాయంతో చివరకు పుణే టీమ్‌లో అవకాశం లభించింది. ఫైనల్ ఫలితం... చెన్నై వేదికగా జరిగిన ఫైనల్లో సూపర్ కింగ్స్ 58 పరుగుల భారీ తేడాతో బెంగళూరును చిత్తుగా ఓడించింది. ముందుగా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మురళీ విజయ్ (95), మైక్ హస్సీ (63) బ్యాటింగ్‌తో చెన్నై 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. అనంతరం బెంగళూరు 8 వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. టోర్నీలో భీకర ఫామ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన క్రిస్ గేల్‌ను అశ్విన్ తొలి ఓవర్లోనే ఔట్ చేయడంతో ఆర్సీబీ కోలుకోలేకపోయింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: క్రిస్ గేల్ అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): క్రిస్ గేల్ (బెంగళూరు – 608) అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): లసిత్ మలింగ (ముంబై – 28) 6 సెంచరీలు... టోర్నీలో గేల్ 2 సెంచరీలు బాదగా... సచిన్, పాల్ వాల్తాటి, సెహ్వాగ్, గిల్‌క్రిస్ట్ ఒక్కో సెంచరీ కొట్టారు. టోర్నీలో అమిత్ మిశ్రా (దక్కన్ చార్జర్స్) ఏకైక హ్యాట్రిక్ నమోదు చేశాడు. దాదాపుగా వాళ్లే... గత ఏడాది విజేతగా నిలిచినా, వేలం కారణంగా చెన్నై జట్టులో కూడా పలు మార్పులు జరిగాయి. ప్రధాన ఆటగాళ్లు మినహా మరికొందరు వచ్చి చేరారు. టోర్నీలో ఆడిన 17 మందిలో ధోని, సాహా, బద్రీనాథ్, హస్సీ, రైనా, విజయ్, మోర్కెల్, డ్వేన్ బ్రేవో, సూరజ్ రణ్దీవ్, అశ్విన్, జోగీందర్ శర్మ, స్టయిరిస్, బొలింజర్, సౌతీ, కులశేఖర ఉండగా... అనిరుధ శ్రీకాంత్, షాదాబ్ జకాతి మాత్రమే ఎప్పుడూ జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. ఒకే ఓవర్లో 37... కొచ్చి బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఓవర్లో క్రిస్ గేల్ వరుసగా 6, 6 (నోబాల్), 4, 4, 6, 6, 4 బాదడం విశేషం. 4 సిక్సర్లు, 3 ఫోర్లు కలిపి గేల్ 36 పరుగులు బాదగా, మొత్తం 37 పరుగులు వచ్చాయి. -
నిషేధిత జట్టుకు రూ.850 కోట్ల పరిహారం
న్యూఢిల్లీ: 2011లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నుంచి నిషేధానికి గురైన కొచ్చి టస్కర్స్ కు రూ. 850 కోట్ల భారీ పరిహారం దక్కనుంది. గత కొంతకాలంగా కొచ్చి టస్కర్స్ తో ఉన్న వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అందుకు సిద్ధమైంది. ఈ మేరకు రూ. 850 కోట్ల రూపాయల పరిహారాన్ని కొచ్చికి చెల్లించడానికి సిద్ధమైంది. 'కొచ్చి టస్కర్స్ రూ.850 కోట్ల పరిహారాన్ని కోరింది. దీనిపై ఈ రోజు జరిగిన ఐపీఎల్ జనరల్ కౌన్సిల్ మీటింగ్ లో చర్చించాం. వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్నాం. దీన్ని తర్వలో్ జరగబోయే జనరల్ బాడీ సమావేశంలో కూడా చర్చించి పరిహారానికి సంబంధించిన విషయాన్ని ఫుల్ స్టాప్ పెడతాం'అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. ఇదిలా ఉంచితే, 'కొచ్చికి పరిహారం చెల్లించాల్సిందే. కొచ్చిపై పోరాడటానికి మాకు అన్నిదారులు మూసుకుపోయాయి. మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన తీర్పే మాకు గతంలో వ్యతిరేకంగా వచ్చింది. అటువంటి సమయంలో సుప్రీంకోర్టుకు వెళ్లడం అనే నిర్ణయం సరైనది కాదు. మాకు ఇప్పుడే వేరే ఆప్షన్ కూడా లేదు. కాకపోతే ఎంత పరిహారం చెల్లించనున్నామనేది మాకు అది ప్రశ్న'అని ఐపీఎల్ జనరల్ కౌన్సిల్ సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. వివాదం ఇలా.. వార్షిక ఫీజుకు బ్యాంకు గ్యారంటీ చెల్లించలేదని రద్దయిన ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో తామెంతో నష్టపోయామని అప్పట్లోనే కొచ్చి కోర్టు కెక్కింది. దానిలో భాగంగా ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) కోర్టు పిటిషనర్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. 2015లో కొచ్చి నష్టపరిహారంగా రూ. 384. 83 కోట్లతో పాటు ఈ మొత్తానికి 18 శాతం వడ్డీ చొప్పున నాలుగేండ్లకయ్యే మొత్తాన్ని కలిపి చెల్లించాల్సిందిగా బీసీసీఐని ఆదేశించింది. కోర్టు ఫీజులకిందా ఫ్రాంచైజీకి మరో రూ. 72 లక్షలనూ చెల్లించాలని చెప్పింది. అయితే ఈ మొత్తం కలిపి రూ. 900 కోట్లను బీసీసీఐ చెల్లించాలి. దీంతో అప్పట్నుంచి ఇరువురి రాజీ యత్నాలు జరిగాయి. ఆ క్రమంలోనే కొచ్చిని మరొకసారి ఐపీఎల్లో ఆడే అవకాశం కల్పిస్తారనే వార్తలు కూడా వెలుగుచూశాయి. కాకపోతే ఆ జట్టును ఆడించకపోగా, కనీసం పరిహారంపై కూడా బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. తాజాగా దానికి బీసీసీఐ ముగింపు పలుకుతూ రూ.850 కోట్లను చెల్లించడానికి సిద్దమైంది. -
లాహోటి నివేదికను సవాలు చేస్తాం: బీసీసీఐ
న్యూఢిల్లీ: ఐపీఎల్లో కొచ్చి టస్కర్స్ రద్దు అంశంలో ఫ్రాంచైజీకి అనుకూలంగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆర్సీ లాహోటి ఇచ్చిన నివేదికపై అప్పీల్ చేస్తామని బీసీసీఐ వెల్లడించింది. బుధవారం జరిగిన గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చాలా మంది సభ్యులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. దీనిపై న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. 2011లో ఒప్పంద నిబంధలు ఉల్లంఘించిందనే ఆరోపణలతో కొచ్చి ఫ్రాంచైజీని రద్దు చేసి బ్యాంక్ గ్యారంటీ కింద ఉన్న డబ్బును బీసీసీఐ తీసేసుకుంది. ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించేందుకు లాహోటిని మధ్యవర్తిగా నియమించారు. ఈ అంశంపై విచారణ జరిపిన లాహోటి రూ. 550 కోట్లను బీసీసీఐ.... కొచ్చికి చెల్లించాలని నివేదికలో పేర్కొన్నారు. అయితే డబ్బులు తీసుకునేందుకు తమకు ఆసక్తి లేదని ఇటీవల స్పష్టం చేసిన కొచ్చి వచ్చే ఐపీఎల్లో ఆడేందుకు అవకాశమివ్వాలని కోరినట్లు సమాచారం. చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజీ విలువను తక్కువ చేసి చూపడంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని శుక్లా తెలిపారు. ఈ విషయంలో చట్టపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. మరోవైపు చాంపియన్స్ లీగ్ టి20 భవితవ్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా బోర్డుల సమక్షంలోనే దీనిపై నిర్ణయం జరుగుతుందన్నారు. ఐపీఎల్లో ఆటగాళ్లను కొనసాగించడంపై మాట్లాడుతూ... ‘2017 నుంచి క్యాప్డ్ ప్లేయర్ల (భారత్)ను 4 నుంచి 2కు తగ్గించాలని అనుకుంటున్నాం. విదేశీ ఆటగాళ్లను ఇద్దరికే పరిమితం చేయాలనుకుంటున్నాం. అలాగే ముగ్గురు అన్క్యాప్డ్ ఆటగాళ్లను అనుమతిస్తాం. అయితే ఓవరాల్‌గా మొత్తం రిటెన్షన్ సంఖ్య ఐదుగురికి మించకూడదు’ అని శుక్లా పేర్కొన్నారు.