Kodanad estate
-
కొలిక్కిరాని ‘కొడనాడు’ కేసు.. తలలు పట్టుకుంటున్న పోలీసులు
కొడనాడు ఎస్టేట్ కేసు ఐదేళ్లయినా ఒక కొలిక్కిరాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే దివంగత సీఎం జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అతని అన్న, భార్య ఫిర్యాదు మేరకు శుక్రవారం నుంచి మళ్లీ విచారణ మొదలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: నీలగిరి జిల్లా కొత్తేరి సమీపంలోని కొడనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళకు టీ ఎస్టేట్, బంగ్లా ఉన్నాయి. వారు ఏడాదికి రెండుసార్లు ఈ ఎస్టేట్‌లో కొన్నాళ్లు సేదదీరడం అలవాటు. 2016 డిసెంబర్ 5న జయలలిత మరణం తర్వాత కొడనాడు ఎస్టేట్ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. 2017 ఏప్రిల్ 23వ తేదీ అర్దరాత్రి కొందరు అగంతకులు ఎస్టేట్‌లో ప్రవేశించి ఆస్తి పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారు. అడ్డు వచ్చిన ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ను హతమార్చారు. జయలలిత వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన కనకరాజ్ సహా 11 మంది దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చదవండి: (ఫడ్నవీస్‌కు గడ్కరీ పాఠం?) ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే కనకరాజ్ అను మానాస్పద స్థితిలో మరణించాడు. అదే ఏడాది ఏప్రిల్ 27వ తేదీ రాత్రి సేలం జిల్లా ఆత్తూరు సమీపంలోని చందనగిరి అనే ప్రాంతంలో కనకరాజ్ మృతదేహం లభించగా సయాన్ అనే వ్యక్తి సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించాలని కోర్టులో సయాన్ పిటిషన్ వేయడంతో కొడనాడు లోని కొత్తేరి పోలీసులు పునర్విచారణ చేపట్టారు. దక్షిణ మండల ఐజీ సుధాకర్ నేతృత్వంలో ఐదుగురితో కూడిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. తన తమ్ముడు కనకరాజ్‌ను పథకం ప్రకారం హత్య చేశారని అన్న ధనపాల్ విచారణాధికారికి ఫిర్యాదు చేశాడు. చదవండి: (దీపావళి తర్వాత శివసేన ప్రక్షాళన) అలాగే కనకరాజ్ భార్య కలైవాణి సైతం తన భర్త మరణంలో అనుమానాలు ఉన్నాయని వాంగ్మూలం ఇచ్చింది. ఈ కారణంగా కనకరాజ్ మృతిపై పునర్విచారణ జరపాల్సిందిగా సేలం జిల్లా ఎస్పీ అభినవ్ ఆదేశాలు జారీచేశారు. అంతేగాక విచారణాధికారిగా ఆత్తూరు డీఎస్పీ రామచంద్రన్‌ను నియమించారు. ఆయన శుక్రవారం నుంచి విచారణ ప్రారంభించారు. 20 మందికిపైగా పోలీసులు ఐదు వాహనాల్లో ఉదయం 6.45 గంటలకు అత్తూరుకు వచ్చారు. శక్తినగర్‌లోని కనకరాజ్ బంధువుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. -
కొడనాడు కేసు: అసలేం జరిగింది.. వీఐపీల పేర్లు కూడా ఉన్నాయా?!
సాక్షి, చెన్నై: కొడనాడు హత్య, దోపిడీ కేసు విచారణ వేగం పుంజుకుంది. తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత ఆమెకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017 ఏప్రిల్‌లో జరిగిన వాచ్‌మన్ హత్య, దోపిడీ ఘటన తెలిసిందే. విచారణ సమయంలో ఈ కేసుతో ముడిపడేలా అనేక అనుమానాస్పద మరణాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. అవన్నీ నీరుగారినా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా సయన్, మనోజ్‌ను గుర్తిస్తూ విచారణకు తెర దించేశారు. ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు కొడనాడు మిస్టరీ రట్టు చేసే దిశగా మళ్లీ దర్యాప్తు చేయడం, అసెంబ్లీలో రగడ వరకు పరిస్థితులు దారి తీశాయి. ఊటీ సెషన్స్ కోర్టులో.. విచారణ ప్రధాన నిందితులైన సయన్, మనోజ్‌ను నీలగిరి ఎస్పీ ఆశీష్ రావత్ నేతృత్వంలోని బృందం ప్రశ్నించడం వంటి పరిణామాలు ఈ కేసులో ఉత్కంఠ రేపాయి. మాజీ సీఎం పళనిస్వామిని టార్గెట్ చేసి ఈ విచారణ సాగుతున్నట్లు అన్నాడీఎంకే తీవ్ర ఆరోపణ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో గురువారం ఊటీ సెషన్స్ కోర్టుకు విచారణ నిమిత్తం నిందితులిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు భద్రత కల్పించాలని సయన్ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు పరిగణించింది. ఇద్దరు పోలీసుల్ని నియమించారు. కాగా కోర్టుకు పోలీసులు ఓ నివేదికను అందజేశారు. ఈ కేసు విచారణ ముగియలేదని, పలువురికి సంబంధాలు ఉన్నట్టుగా పేర్కొంటూ, విచారణ మళ్లీ మొదటి నుంచి చేపట్టాల్సిన అవసరం ఉందంటూ కోర్టుకు తెలియజేశారు. కాగా అక్టోబరు 1వ తేదీకి న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. పోలీసులిచ్చిన నివేదికలో పలువురు వీఐపీల పేర్లు సైతం ఉన్నట్లు సమాచారం. దీంతో వీరందర్నీ విచారణ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు ఉ న్నాయి. అలాగే, కొడనాడు ఎస్టేట్ మేనేజర్ నటరాజన్‌తో పాటుగా మరో ఇద్దరు విచారణకు హాజరుకావాలని కోర్టు గత వాయిదాలో సమన్లు జారీ చేసింది.అయితే, ఆ ముగ్గురు ప్రస్తుతం విచారణకు డుమ్మా కొట్టారు. కాగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించేందుకు గాను.. డీఎస్పీ చంద్రశేఖర్, ఏడీఎస్పీ కృష్ణమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. చదవండి: MK Stalin: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం! -
తమిళనాడులో మరో సంచలనం
-
తమిళనాడులో మరో సంచలనం
చెన్నై: జయలలిత మరణం తర్వాత సంచలనాలకు నెలవుగా మారిన తమిళనాడులో తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది. కొడనాడు ఎస్టేట్‌ను జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ బలవంతంగా లాక్కున్నారని దాని అసలు యజమాని పీటర్ కర్ల్ ఎడ్వార్డ్ క్రెగ్ జోన్స్ ఆరోపించారు. చాలా కాలం తర్వాత ఆయన ముందుకు వచ్చారు. కొడనాడు ఎస్టేట్‌ను తిరిగి దక్కించేందుకు న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తన ఎస్టేట్‌ను జయలలిత ఏవిధంగా దక్కించుకున్నారో వివరించారు. ‘1990 ప్రాంతంలో జయలలిత కన్ను ఈ ఎస్టేట్‌పై పడింది. దీన్ని తమకు అమ్మాలని జయలలిత సన్నిహితులు, శశికళ, అన్నాడీఎంకే నేతలు కొంత మంది రెండేళ్లపాటు మాపై ఒత్తిడి తీసుకువచ్చారు. 150 మంది గుండాలను పంపి బెదిరించారు. అయిష్టంగా అమ్మాల్సివచ్చింద’ని జోన్స్ వాపోయారు. కొడనాడు ఎస్టేట్‌కు కేవలం రూ.7.5 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బు ఎగ్గొట్టారని తెలిపారు. ఈ వ్యవహారంలో కొంతమంది వ్యాపారవేత్తలు, మంత్రులు, అధికారులు, అన్నాడీఎంకే విధేయుడు రాజాత్తినమ్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ‘కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. మేము రిజిస్ట్రేషన్ ఆఫీసు వెళ్లలేదు. ఇదంతా బినామీ వ్యవహారం. చెన్నైలోని మద్యం వ్యాపారి ఉదయార్ ఇంట్లో నేను, మా నాన్న భాగస్వామ్య మార్పిడి పత్రాలపై మాత్రమే సంతకాలు చేశాం. తర్వాత రోజే కొడనాడు ఎస్టేట్‌ను మా నుంచి స్వాధీనం చేసుకున్నార’ని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఎస్టేట్‌ను తిరిగి దక్కించుకోవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇందుకోసం న్యాయం పోరాటం చేస్తానని, తనలా దోపిడీకి గురైన వారందరినీ కలుపుకుపోతానని చెప్పారు. కొడనాడు ఎస్టేట్‌లో గత నెల 23వ తేదీన 11 మందితో కూడిన గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి అక్కడి సెక్యూరిటీ గార్డును హతమార్చి, మూడు గదుల్లోని దాచి ఉంచిన భారీ నగదు, ముఖ్యమైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే.