kodikonda checkpost
-
‘చైతన్యం కోసం కృషి’
చిలమత్తూరు : అన్ని కులాల్లో చైతన్యం తీసుకురావడం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎస్ రాజు, బీసీ సంక్షేమ సంఘం రాయలసీమ జిల్లాల అ«ధ్యక్షుడు మేకల వెంకటేష్‌గౌడ్ పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం వారు కొడికండ చెక్‌పోస్టులోని టూరిజం హోటల్లో విలేకరులతో మాట్లాడారు. అన్ని కుల సంఘాల చైతన్యం కోసం ఈ నెల 18న జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీల వర్గీకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. ఏప్రిల్ 5న వర్గీకరణ సాధన కోసం మాదిగల సంకల్ప యాత్రను తిరుపతిలో ప్రారంభిస్తామని చెప్పారు. అనంతరం మే 8న లక్షలాది మంది మాదిగల ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామని వివరించారు. లేపాక్షి హబ్ భూములపై ప్రశ్నించే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్యనారు. భూములపై ఉద్యమాలు చేసింది ఎమ్మార్పీఎస్ మాత్రమే అన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ యువసేన జిల్లా అ«ధ్యక్షుడు జింక సజ్జప్ప, నాయకులు శ్రీకాంత్‌గౌడ్, కదిరెప్ప, మురళీ, గోవిందు, నంజుండ, నరసింహులు, నరసప్ప తదితరులు పాల్గొన్నారు. -
‘రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు’
చిలమత్తూరు : రుణమాఫీ తదితర ప్రలోభాలతో రైతులను ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు విజుకృష్ణన్, మల్లారెడ్డి విమర్శించారు. మంగళవారం సాయంత్రం కొడికొండ చెక్‌పోస్టులో అఖిల భారత కిసాన్ సభ జాతా చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు సమాధానాలు ఇస్తూ రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి, సిద్దారెడ్డి, ప్రవీణ్, వినోద్, లక్ష్మీనారాయణ, వినోద్, వెంకట్రామిరెడ్డి, రామచంద్ర, నరసింహులు, నారాయణస్వామి, రాజప్ప, వెంకటేష్ తదితరులు పొల్గాన్నారు. -
ఇసుక లారీ సీజ్
చిలమత్తూరు : కొడికొండ చెక్‌పోస్టులో బుధవారం తెల్లవారుజామున తాడిపత్రి ఏరియా నుంచి బెంగళూరుకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీని పట్టుకున్నట్లు హిందూపురం రూరల్ సీఐ రాజగోపాల్ నాయుడు, ఎస్ఐ జమాల్ బాషా తెలిపారు. లారీతో పాటు వెనుక వస్తున్న స్కార్పియో వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రైవర్లు శ్రీనివాసులు, రాజేష్, మల్లికార్జునరెడ్డి, మల్లికార్జున, ఆకుల జగదీశ్వర్‌పై కేసులు నమోదు చేశామన్నారు. కర్నూల్ జిల్లా యాగంటిపల్లి, బనగానిపల్లి, గడివేముల ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. -
ఎర్రకూలీలు కోర్టుకు హాజరు
పెనుకొండ : పదకొండు మంది ఎర్రచందనం కూలీలను శనివారం పెనుకొండ కోర్టులో హాజరుపరచినట్లు ఇన్చార్జ్ రేంజర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఆయనతో పాటు డీఆర్ఓ విజయకుమార్‌లు అటవీశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లాలో అటవీప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికిన కూలీలు చిత్తూరు రిజిస్ట్రేషన్ కలిగిన టాటా ఏస్ వాహనంలో బెంగళూరుకు గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతున్నారన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం 24 గంటల సేపు వివిధ ప్రాంతాల్లో కాపుకాసి ఎట్టకేలకు చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం పట్టుకోవడం జరిగిందన్నారు. వీరిలో తొమ్మిది మంది తమిళనాడుకు, ఇద్దరు కర్ణాటకలోని ముల్బాగల్కు చెందినట్లు తెలిపారు. తమిళనాడు రాష్ట్రం తిరపత్తూరుకు చెందిన రామ్మూర్తి, వెంకటేష్ (ఉణ్ణత్తూరు) ఎం. వెంకటేష్ (కొడిమూర్), వాణియంబడి, కుండత్తూరుకు చెందిన కూలీలు రవికుమార్, తిరుపతి, కళయకన్నన్, పరణి, మురగన్, కుమార్, కర్ణాటకలోని ముల్బాగల్కు చెందిన క్రిష్టప్ప,lక్లీనర్ సునీల్ ఉన్నారన్నారు. డ్రైవర్ చిరంజీవి పరారయినట్లు తెలిపారు. కూలీలు నరికిన ఎర్రచందనం దుంగలను సంఘటనా స్థలం నుంచి తీసుకురావడం జరుగుతుందన్నారు. కూలీల వద్ద నుంచి గొడ్డళ్లు, రంపాలు, ఆకురాయి, తూకపు పరికరాలు, ఆహారపు సామగ్రి, టాటాఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మదన్మోహన్, ఏబీఓలు సంజీవరాయుడు, శ్రీనివాసులు, ఏఫ్బీఓలు నాగప్ప, కేశప్ప ఇతర సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించి కూలీలను పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిలమత్తూరు పోలీసులు సహకారం అందించినట్లు తెలిపారు. -
ట్రేల మధ్యలో 12 మంది
చిలమత్తూరు(అనంతపురం): కర్ణాటకలోని కోలార్ జిల్లా ప్రాంతం నుంచి టాటా ఏస్ (ఏపీ03టీసీ 2432) వాహనంలో టమాట ట్రే ల మధ్య అనుమానాస్పదంగా వైఎస్సార్ జిల్లాకు వెళ్తున్న 12 మంది వ్యక్తులను స్థానిక పోలీసులు, అటవీ శాఖాధికారులు శుక్రవారం కొడికొండ చెక్‌పోస్టులో అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్ఓ మదన్మోహన్ తెలిపిన వివరాల మేరకు కోలార్ జిల్లా నుంచి వైఎస్సార్ జిల్లాకు ఆటోలో టమాట ట్రేల మధ్య కొంతమంది అనుమానాస్పదంగా వెళ్తున్నారనే సమాచారం జిల్లా అటవీశాఖాధికారి నుంచి వచ్చిందన్నారు. దీంతో చెక్‌పోస్టులో నిఘా ఉంచి ఆటో వాహనాన్ని ఆపి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. ఎస్ఐ జమాల్‌బాషా సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. అటవీశాఖ సిబ్బంది ఎంవీ నాగప్ప, కె.సంజీవరాయుడు, బి.శివయ్య, కానిస్టేబుల్స్ నాగరాజు, సురేష్ ఉన్నారు. -
కొనసాగుతున్న అక్రమ రవాణా
చిలమత్తూరు : అధికార పార్టీ నేతల అండదండలతో మండలంలో బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. ఒత్తిళ్ల కారణంగా అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గత మంగళవారం కొyì కొండ సమీపం నుంచి కర్ణాటకలోని కోలార్‌కు వెళ్తున్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ ఏసీటీఓ బేబీనందా పట్టుకుని, అందులోని 33 టన్నుల బస్తాల బియ్యాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. కాగా లారీలను ఓపెన్ చేయకుండా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా తూతూ మంత్రంగా రూ.2లక్షల వరకు అపరాధ రుసుం చెల్లించి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల నుంచి ఇదే రీతిలో కొత్తచెరువు ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతల లారీలు వెళ్తున్నా అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే.. బియ్యం లారీలు పట్టుకున్నప్పటి నుంచి అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని విలేకరుల సమావేశంలో స్పెషల్ ఏసీటీఓ స్వయంగా వెల్లడించారు. దీని ఆధారంగా చూస్తే అపరాధ రుసుం తూతూమంత్రంగా చెల్లిస్తేనే వదిలేసినట్లు తెలుస్తోంది. -
లారీ ఎక్కిన ‘రైలు ఇంజన్’
చిలమత్తూరు : సుమారు 90 చక్రాల లారీ (హెచ్ఆర్ 55ఎన్ 5511)లో రైలు ఇంజన్ తరలిస్తున్న దృశ్యం కొడికొండ చెక్‌పోస్టు 44వ జాతీయ రహదారిలో గురువారం స్థానికులను ఆక్షరించింది. బెంగళూర్ నుంచి విశాఖపట్నానికి లారీలో రైలు ఇంజిన్ తరలిస్తున్నట్లు డ్రైవర్, క్లీనర్ తెలిపారు. బెంగళూర్ నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరింది. పరిమిత వేగంతో వెళ్తున్నందున 15 రోజుల తర్వాత విశాఖ రైల్వే అధికారులకు ఇంజన్‌ను అప్పగిస్తామని వారు వివరించారు.