పెనుకొండ : పదకొండు మంది ఎర్రచందనం కూలీలను శనివారం పెనుకొండ కోర్టులో హాజరుపరచినట్లు ఇన్‌చార్జ్ రేంజర్ వేణుగోపాల్ తెలిపారు. ఈ మేరకు ఆయనతో పాటు డీఆర్‌ఓ విజయకుమార్‌లు అటవీశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లాలో అటవీప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికిన కూలీలు చిత్తూరు రిజిస్ట్రేషన్ కలిగిన టాటా ఏస్ వాహనంలో బెంగళూరుకు గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతున్నారన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం 24 గంటల సేపు వివిధ ప్రాంతాల్లో కాపుకాసి ఎట్టకేలకు చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం పట్టుకోవడం జరిగిందన్నారు. వీరిలో తొమ్మిది మంది తమిళనాడుకు, ఇద్దరు కర్ణాటకలోని ముల్‌బాగల్‌కు చెందినట్లు తెలిపారు.
తమిళనాడు రాష్ట్రం తిరపత్తూరుకు చెందిన రామ్మూర్తి, వెంకటేష్ (ఉణ్ణత్తూరు) ఎం. వెంకటేష్ (కొడిమూర్), వాణియంబడి, కుండత్తూరుకు చెందిన కూలీలు రవికుమార్, తిరుపతి, కళయకన్నన్, పరణి, మురగన్, కుమార్, కర్ణాటకలోని ముల్‌బాగల్‌కు చెందిన క్రిష్టప్ప,lక్లీనర్ సునీల్ ఉన్నారన్నారు. డ్రైవర్ చిరంజీవి పరారయినట్లు తెలిపారు. కూలీలు నరికిన ఎర్రచందనం దుంగలను సంఘటనా స్థలం నుంచి తీసుకురావడం జరుగుతుందన్నారు. కూలీల వద్ద నుంచి గొడ్డళ్లు, రంపాలు, ఆకురాయి, తూకపు పరికరాలు, ఆహారపు సామగ్రి, టాటాఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మదన్‌మోహన్, ఏబీఓలు సంజీవరాయుడు, శ్రీనివాసులు, ఏఫ్‌బీఓలు నాగప్ప, కేశప్ప ఇతర సిబ్బంది వ్యూహాత్మకంగా వ్యవహరించి కూలీలను పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చిలమత్తూరు పోలీసులు సహకారం అందించినట్లు తెలిపారు.
ఎర్రకూలీలు కోర్టుకు హాజరు
Published Sat, Sep 17 2016 11:56 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement