రబ్బర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి: జిల్లాలోని చేవెళ్ల మండలం చనువెల్లిలోని ఓ ఫ్యాక్టరీలో శుక్రవారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక కోహినూరి ఫ్యాక్టరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. నిర్వాహకుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కోట్లలో ఆస్తి నష్టం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని సమాచారం.