Komalavalli
-
ఇదిగో... ఇతనే నా భర్త
నమస్తే! నా పేరు కోమల. నాకు యాభై ఏళ్లు. డబ్బులు లెక్కపెట్టడం, బస్‌ల మీది పేర్లు చదవగల జ్ఞానం తప్ప పెద్దగా చదువు లేదు. చిన్నప్పుడే పెళ్లి చేసేశారు మావాళ్లు. చేసుకున్నవాడు ముగ్గురు పిల్లలనిచ్చి.. తాగుడుకు బానిసై ఓ రోజు ప్రాణం విడిచాడు. అప్పు తప్ప ఆదాలేని జీవితం. పెళ్లిలో మా అమ్మ పెట్టిన రెండు బంగారు గాజులు తప్ప ఆస్తి లేదు. అవీ తాగడం కోసం అమ్మేస్తాడని చాలా జాగ్రత్తగా దాచా. మా ఆయన చనిపోయినప్పుడు వాటినే అమ్మి అంత్యక్రియలు చేయించా. పిల్లలను పోషించేందుకు మిగిలిన ఇంకాస్త డబ్బుతో ఓ కూరల బుట్ట కొని కోల్‌కతా వీధుల్లో కూరగాయలు అమ్మే పని పెట్టుకున్నా. రోజులు గడిచాయి. ఖర్చులూ పెరిగాయి. సంపాదనలోనే కాస్త కాస్త మిగుల్చుకుంటే కూరలతోపాటు బ్రెడ్డు, కోడిగుడ్లూ అమ్మడం మొదలుపెట్టాను. పిల్లలనూ చదివిస్తున్నాను. అలా కొన్నాళ్లకు దాచిన డబ్బుతో చెట్టుకింద చిన్న పాక వేసి దాల్ రైస్, దాల్ రోటీ అమ్మడం మొదలుపెట్టాను. పిల్లలకు రెక్కలొచ్చి వెళ్లారు పిల్లలు డిగ్రీకొచ్చేసరికే సొంతూళ్లో స్థలం కొన్నాను. వాళ్లకు ఉద్యోగాలు దొరికాక.. ఇల్లూ కట్టుకున్నాం. పిల్లల పెళ్లిళ్లూ చేశాను. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయాక.. నేను, చెట్టు కింద హోటల్ లాంటి చిన్న పాకా మిగిలాం. నా బాధ్యతలు తీరిపోయాక కానీ అతనిని గమనించలేదు నేను. రోజూ వచ్చేవాడు నా హోటల్‌కు. ఉదయం టీ కోసం.. మధ్యాహ్నం దాల్ రోటీ కోసం.. సాయంత్రం మళ్లీ రోటీ కోసం! తినేసి డబ్బులిచ్చి వెళ్లిపోకుండా నా పనుల్లో సాయం చేసేవాడు. ఉల్లిపాయ తరిగివ్వడం దగ్గర్నుంచి గిన్నెలు తోమడంలో కూడా. జనాలు ఎక్కువగా ఉంటే వడ్డించేవాడు కూడా. అలా అతనితో స్నేహం కుదిరింది. పెరిగింది. గిన్నెలు తోమేటప్పుడు.. తన యజమాని దగ్గర్నుంచి నుంచి మమతా దీదీ దాకా చాలా విషయాలు చెప్పేవాడు. ఆ మాటల్లోనే తెలిసింది అతనికి ఎవరూ లేరని. అతనో అనాథని. ‘‘దిగులు పడకు.. పిల్లలుండీ కూడా నేనిప్పుడు అనాథనే కదా! ఎవరి దార్లో వాళ్లు పోయారు. నేనూ నీలాగా ఒంటరినే’’ అన్నాను సముదాయించడానికి. అతను రెక్కలు కట్టుకొచ్చాడు! విమ్‌బార్ పీచుతో బాండీని రుద్దుతున్నప్పుడు మొహం మీద పడ్డ నా జుట్టును పక్కకు సవరిస్తూ చెప్పాడు ‘‘కోమలా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం’’ అని. షాక్ అయ్యా. తేరుకున్నాక నవ్వొచ్చింది. పడీ పడీ నవ్వా. అతను చిన్నబుచ్చుకున్నాడు. తెల్లవారి మళ్లీ చెప్పాడు నిజంగానే నువ్వంటే నాకు ఇష్టం అని. అప్పటి నుంచి అతనిని చూసే నా దృష్టిలో మార్పు వచ్చింది. ఆప్తుడుగా.. ఆత్మీయుడిగా కనిపించసాగాడు. నా పట్ల అతనికున్న ఇష్టం.. ఆ వయసులో నాకు తోడు ఎంత అవసరమో ఆలోచించేలా చేసింది. తోడు అవసరమనే నిర్ణయానికీ వచ్చింది నా మనసు. ఓ రోజు అడిగా.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని. చేసుకుంటాను అన్నాడు. మా పిల్లలతో చెప్పా. నాకు ఒంట్లో బాగా లేదని ఎన్నిసార్లు చెప్పినా పని అనే సాకుతో తప్పించుకున్న పిల్లలు ఈ మాట చెప్పగానే ప్రత్యక్షమయ్యారు. సిగ్గులేదా? నువ్వసలు తల్లివేనా? ఇదేం పోయేకాలం.. మా పెళ్లాలు ఏమనుకుంటారు నీ గురించి? చుట్టాలకేం సమాధానం చెప్పుకోవాలి? ఈ వయసులో ఇదేం బుద్ధి? వగైరా వగైరా చాలా తిట్లే తిట్టారు. ఆగక.. అతనిని కొట్టారు. నా మనసుకూ రెక్కలొచ్చాయి నేను తోడు కోరుకోవడం తప్పా? నా మంచీచెడు నేను ఆలోచించుకునే హక్కు నాకు లేదా? అమ్మంటే పిల్లలకు బానిసేనా? విధవరాలిగా.. కొడుకుల ఆదరాభిమానాల భిక్ష కోరుతూనే బతుకు చాలించాలి కాని.. నాకంటూ ఓ జీవితం ఉండకూడదా? ఈ వయసా..? అంటే ?ఈ వయసులో తోడు కోరుకునే అర్హత నాకు లేదా? ఎందుకుండదు? ఇది నా జీవితం.. అందుకే.. అతని చేయి పట్టుకున్నా. ఒకరికొకరం తోడుగా ఉందాం అని పెళ్లి చేసుకున్నా. ఈ ఫొటోలో కనిపిస్తున్న అతనే నా భర్త. అన్నట్టు మమ్మల్ని మా పిల్లలే కాదు.. నా చుట్టాలు.. చుట్టుపక్కల వాళ్లూ వెలేశారు. కోల్‌కతాలోని ఆ చెట్టుకింది మా పాకే మాకిప్పుడు ఆశ్రయం. ఎప్పటిలాగే రోజూ పాలు తెస్తాడు. కాస్తాడు. ఉల్లిపాయలు, ఆలు తరిగిస్తాడు. గిన్నెలూ తోమిపెడతాడు. జనాలు ఎక్కువగా ఉంటే భోజనం వడ్డిస్తాడు. మా వెనకాల నుంచి ఏవేవో మాటలు వినిపిస్తుంటాయి మేం వినకూడనివి. అందుకే వినట్లేదు. ముందుకు నడుస్తున్నాం.. కలిసి! – శరాది -
శశికళ జయకు దగ్గరైన వేళ
-
జయలలిత బహుముక ప్రజ్ఙ్నాశాలి
-
'అమ్మ' పడిలేచిన కెరటం
-
జయలలిత 'శక్తి స్వరూపిణి'
-
పడిలేచిన కెరటం
తమిళులందరూ ‘అమ్మ’గా ప్రేమించే జయలలిత ఆ స్థానానికి చేరుకోవడానికి.. వారి గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి చేసిన ప్రస్థానం అసాధారణమైనది! పురుషాధిక్య రాజకీయాలు.. కరడుగట్టిన ద్రవిడ రాజకీయాల్లో వైష్ణవ బ్రాహ్మణ వర్గానికి చెందిన స్త్రీ.. అవినీతి ఆరోపణలు.. కేసులు.. అరెస్టులు.. జైళ్లు.. అనర్హత వేట్లు! అరుునా.. మొక్కవోని ధైర్యం.. సడలని సంకల్పం.. ముళ్లబాటను పూలబాటగా మలచుకుని.. జనం గుండెల్లో చెదరని స్థానం సంపాదించుకున్న పురచ్చి తలైవి!! రాజకీయ అరంగేట్రం: దక్షిణాది సినీ రంగంలో ముఖ్యంగా తమిళనాట అగ్రనాయికగా వెలుగొందుతున్న జయలలితను 1982లో రాజకీయాల్లోకి తీసుకువచ్చింది అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి.రామచంద్రన్. తొలుత పార్టీ సభ్యురాలిగా చేరిన జయలలిత ఏడాదిలోనే 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. రాజ్యసభ సభ్యత్వం: ఆ మరుసటి ఏడాదే 1984లో ఎంజీఆర్ కిడ్నీ వ్యాధి చికిత్స కోసం అమెరికా పయనమయ్యే ముందుగా.. పార్టీ నుంచి జయలిలత రాజ్యసభకు ఎన్నికయ్యేలా చేశారు. ఇది పార్టీలో ఎంతో మంది సీనియర్లకు మింగుడుపడలేదు. మరోవైపు ఎంజీఆర్ అమెరికాలో చికిత్స పొందుతుండగా.. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున జయ ప్రచారం నిర్వహించి గెలిపించారు. ఎంజీఆర్‌కు, జయలలితకు మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించినా.. జయ చాకచక్యంగా వాటిని ఎదుర్కొన్నారు. పార్టీ కోసం పోరాటం: 1987లో ఎంజీఆర్ మరణంతో ఆయన వారసత్వం విషయమై అన్నాడీఎంకేలో వివాదం రాజుకుంది. ఎంజీఆర్ భార్య జానకీ రామంచంద్రన్, జయలలితల మధ్య పార్టీ చీలిపోరుుంది. జయలలితవైపు ఉన్న ఎమ్మెల్యేల్లో ఏడుగురిపై స్పీకర్ అనర్హత వేటు వేయగా.. జానకీ రామచంద్రన్ గ్రూపు విశ్వాస పరీక్షలో నెగ్గింది. అరుుతే.. కొద్ది కాలానికే కేంద్రంలోని రాజీవ్ గాంధీ సర్కారు తమిళనాడులో జానకీ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ప్రతిపక్ష నాయకురాలిగా: ఈ క్రమంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జానకీ గ్రూపుపై జయలలిత పైచేరుు సాధించారు. అరుుతే.. అన్నా డీఎంకేలో ఈ అంతర్గత విభేదాల కారణంగా ఆ ఎన్నికల్లో డీఎంకే గెలిచింది. ఆ పార్టీ అధినేత కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత తమిళనాడు శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్షనేత అయ్యారు. చీలిపోరుున అన్నాడీఎంకే రెండు విభాగాలనూ పునరైక్యం చేసి పార్టీ పగ్గాలు చేపట్టారు. ఎన్నికల సంఘం స్తంభింపజేసిన పార్టీ రెండు ఆకుల గుర్తును తిరిగి పునరుద్ధరించారు. తొలిసారి ముఖ్యమంత్రి: జయలలిత ఆ శపథాన్ని నెరవేర్చుకున్నారు. ఆ అవమానకర ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత.. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘన విజయం సాధించింది. నాటి ఎన్నికలకు ముందు రాజీవ్‌గాంధీ ఎల్టీటీఈ చేతిలో హత్యకు గురవగా.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న అన్నా డీఎంకే విజయానికి ఆ సానుభూతి పవనాలూ దోహదపడ్డారుు. మొత్తం 234 సీట్లకుగానూ 225 సీట్లు అన్నాడీఎంకే-కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. 1991 జూన్ 24న జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగారు. వరుస విజయం.. ఆపై అనారోగ్యం కోర్టు కేసుల నుంచి విముక్తి పొందిన జయలలిత 2016 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించారు. ఎంజీఆర్ అనంతరం వరుసగా రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది రికార్డు సృష్టించారు. అంతేకాదు.. తమిళ ప్రజల గుండెల్లో ‘అమ్మ’గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కానీ.. ఐదు నెలలు గడవక ముందే అనారోగ్యానికి గురయ్యారు. మూడు నెలలుగా ఆస్పత్రికే పరిమితమైన జయలలిత డిసెంబర్ ఐదోతేదీ సోమవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. శాసనసభలో దుశ్సాసనపర్వం 1989 మార్చి 25న తమిళనాడు శాసనసభలో జయలలిత తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. సభలో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే సభ్యుల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రతిపక్ష నాయకురాలు జయలలితపై అధికారపక్ష సభ్యులు దాడికి దిగారు. డీఎంకే సభ్యుడు దురై మురుగన్ జయలలిత చీర లాగారన్న ఆరోపణలు వచ్చారుు. జయలలిత చిరిగిన చీరతో, రేగిన జుట్టుతో, ఎర్రబడిన ముఖంతో సభ నుంచి బయటకు వచ్చారు. మీడియాకు జరిగిన ఘటనను వివరించారు. మళ్లీ తాను ఆ శాసనసభలో అడుగుపెడితే ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని శపథం చేశారు. ఆరోపణలు అధిగమిస్తూ.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న జయలలితపై, ఆమె మంత్రివర్గంపై తీవ్ర స్థారుులో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1995లో జయ తన దత్తపుత్రుడు సుధాకరన్ వివాహ వేడుకను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కేంత ఆడంబరంగా నిర్వహించడం వంటివి తీవ్ర దుమారం రేపారుు. ఈ క్రమంలో 1996లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘోరంగా ఓడిపోరుుంది. ఆ పార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే దక్కారుు. స్వయంగా జయలలిత సైతం డీఎంకే చేతిలో ఓడిపోరుుంది. కేసులు.. తొలిసారి ఆరెస్టు తమిళనాడులో 1996లో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలితపై పలు అవినీతి ఆరోపణలతో కేసులు నమోదు చేసింది. కలర్ టీవీల కుంభకోణంలో ఆమెకు రూ.10 కోట్లకు పైగా ముడుపులు అందాయని, టాన్సీ భూములను సొంతం చేసుకోవడనికి జయలలిత సీఎంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేవి ముఖ్యమైన ఆరోపణలు. జయలలితకు ఆదాయానికి మించి రూ.66.65 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ అప్పటి జనతా పార్టీ నేత సుబ్రమణ్యంస్వామి కేసు వేశారు. అదే ఏడాది డిసెంబర్ 7వ తేదీన జయను అరెస్ట్ చేయగా.. 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. కలర్ టీవీ కేసును 2000 సంవత్సరంలో కోర్టు కొట్టివేసింది. సీఎంగా ప్రమాణం.. అనర్హత 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అరుుతే.. కేసుల కారణంగా జయలలిత ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. కానీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ.. జయలలితను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఆమె 2001 మే 14న రెండోసారి సీఎంగా ప్రమాణం చేశారు. కానీ.. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసుల్లో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు పెండింగ్‌లో ఉండగా ఆమె సీఎం పదవి చేపట్టడం చెల్లదని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది. దీంతో ఆమె తనకు విశ్వాసపాత్రుడైన ఒ.పన్నీరుసెల్వానికి సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మళ్లీ ముఖ్యమంత్రిగా.. జయలలిత తనపై నమోదైన కేసుల్లో న్యాయపోరాటం చేశారు. టాన్సీ భూములు, ప్లెజెంట్ స్టే హోటల్ కేసులను 2001లో కింది కోర్టులు కొట్టివేయగా.. 2003లో సుప్రీంకోర్టు ఆ తీర్పులను సమర్థించింది. దీంతో అదే ఏడాది మార్చిలో జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఉప ఎన్నికలో పోటీ చేసి అసెంబ్లీకి కూడా ఎన్నికయ్యారు. మరో ఓటమి.. మరో గెలుపు జయలలిత, ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 2006 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది. కేవలం 61 సీట్లు మాత్రమే గెలుపొందింది. అత్యధికంగా 96 సీట్లు గెలుపొందిన డీఎంకే.. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అరుుతే.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత మళ్లీ విజయం సాధించారు. అదే ఏడాది మే నెలలో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.ఆమె సారథ్యంలోని అన్నా డీఎంకే 11 పార్టీల తో పొత్తు పెట్టుకుని ఈ గెలుపును సొంతం చేసుకుం ది. జయ రాజకీయ ప్రస్థానం వేగం పుంజుకుంది. మళ్లీ అరెస్టు, జైలు, విముక్తి అయితే.. జయలలితను ఆస్తుల కేసు వెంటాడుతూనే ఉంది. 2014 సెప్టెంబర్‌లో జయలలితను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీంతో జయ మరోసారి సీఎం పదవికి అనర్హురాలయ్యారు. మళ్లీ జైలుకు వెళ్లారు. ఆమె ఒ.పన్నీరుసెల్వంను సీఎంగా నియమించారు. కొద్ది రోజులకే సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక కోర్టు తీర్పును సస్పెండ్ చేసింది. 2015లో కర్ణాటక హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం.. జయలలితకు శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పును రద్దు చేసింది. దీంతో జయ మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆరోజు... అవమానం... ఆ రోజు... డిసెంబరు 24... 1987 ఎంజీఆర్ మరణ వార్త... వినగానే జయ స్థాణువైపోరుుంది. కొంచెం సేపటికి తేరుకుని రామవరం గార్డెన్స్ (ఎంజీఆర్ ఇల్లు) వెళ్లేందుకు డ్రైవర్‌ను పిలిచింది. కానీ ఇంట్లోకి అడుగుపెట్టవద్దన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. కారులోంచి బయటకొచ్చిన జయ తలుపులను చేతులతో దబదబ మోదింది. చాలాసేపటి తరువాత తలుపులు తెరుచుకున్నా ఎంజీఆర్ మృతదేహం ఎక్కడ ఉంచారన్న విషయం మాత్రం ఎవరూ జయకు తెలియనివ్వలేదు. చాలాసార్లు మెట్లు ఎక్కి దిగి ఇల్లంతా వెతికింది జయ. ఆమె ముఖం మీదే గదుల తలుపులు వేసేశారు. ఎంజీఆర్ కడచూపు కూడా దక్కనివ్వలేదు. చిట్ట చివరకు.. ఎవరో... మృతదేహాన్ని పెరటి తలుపు నుంచి రాజాజీ హాల్‌కు తరలించారన్న సమాచారం ఇచ్చారు. అంతే... జయ ఆయాసంతో రొప్పుతూ రాజాజీ హాల్‌కు తీసుకెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించింది. హాల్‌కు వెళ్లగానే పరుగు పరుగున ఎంజీఆర్ మృతదేహం తల వైపు కూర్చుండి పోరుుంది. కనురెప్పలు సైతం వాల్చకుండా... దాదాపు 21 గంటలు అక్కడే అలాగే ఉండిపోయింది. ఎంజీఆర్‌కు నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆమె సంకల్పానికి నివ్వెరపోయారు. శారీరకంగా ఇంత దృఢంగా ఉన్న జయపై ఆ దశలో జరిగిన మానసిక హింస అంతా ఇంతా కాదు. ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ మద్దతుదారులు జయ చుట్టుపక్కలే నిలబడి కాళ్లు తొక్కుతూ హింసించారు. వెనుకనుంచి గోళ్లతో గిచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు శతధా ప్రయత్నించారు. అరుునా జయ చెక్కు చెదరలేదు. ఆత్మగౌరవానికి తీవ్రమైన భంగపాటు జరిగినా... ఎవరు ఎంత అవహేళన చేసినా ఉన్న చోటి నుంచి అస్సలు కదల్లేదు. పరిసరాల్లో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోని స్థితికి చేరిపోయారు ఆమె. అరుుతే అంతటి విషమ పరిస్థితిలోనూ ఆమె మెదడును ఒక ప్రశ్న మాత్రం తొలిచేస్తూనే ఉండి ఉంటుంది. ‘‘ఇప్పుడేం చేయాలి?’’ అని. దాదాపు 38 ఏళ్ల వయసు... మంచి భవిష్యత్తు ఉంటుందని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎదురుగా జీవం లేకుండా పడి ఉన్నాడు. అప్పటివరకూ తమ నాయకుడికి రాజకీయ వారసురాలు తనేనన్న పార్టీ కార్యకర్తలూ పట్టించుకోని పరిస్థితి. అరుుతే... ఓటమిని తేలికగా తీసుకునే వ్యక్తి... .జయ కానే కాదు! అంతిమ యాత్రలోనూ అదే అవమానం... ఎంజీఆర్ అంతిమ యాత్ర మొదలయ్యే క్షణాలు... మృతదేహాన్ని ఉంచిన వాహనంలోకి ఎక్కేందుకు జయ ప్రయత్నించారు. డ్యూటీలో ఉన్న పోలీసులు ఓ చేయి అందించారు కూడా. అయితే ఆమె పైకి ఎక్కిందో లేదు... దిగిపోవాల్సిందిగా అరుపులు. చూస్తే ఎదురుగా ఎమ్మెల్యే కేపీ రామలింగం తనవైపు దూసుకొస్తూ కనిపించాడు. ఏమైందో తెలిసేలోపుగానే జయపై దాడి మొదలైంది. జానకీ రామచంద్రన్ దగ్గరి బంధువు దీపన్ జయ నుదుటిపై కొట్టాడు. వాహనం నుంచి కిందకు తోసేశాడు. తగిలిన గాయాలు ఆమెను బాధించాయో లేదోగానీ... ఆ అవమానం మాత్రం ఆమెను నిశ్చేష్టురాలిని చేసేసింది. అంత్యక్రియల్లో పాల్గొనకుండానే వెనక్కు వచ్చేయాల్సి వచ్చింది. మలుపు తిప్పిన ఆ రోజు... జయకు జరిగిన అవమానాలు ఏఐఏడీఎంకే కార్యకర్తలందరిలోనూ దావానలంలా వ్యాపించాయి. ఒక్కరొక్కరుగా కార్యకర్తలు, నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఆమె ఇంటికి చేరుకోవడం మొదలైంది. జరిగిన అవమానాన్ని ఖండించారు. ఎంజీఆర్ వారసురాలిగా తాము మీ వెంటే ఉంటామని జయకు భరోసా ఇచ్చారు. ఆ తరువాత రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 97 మంది ఎమ్మెల్యేలతో జానకీ రామచంద్రన్ ఇచ్చిన లేఖను ఆమోదిస్తూ గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 1988 జనవరి ఏడున జానకి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిందిగా సూచించారు. ఆ రోజు అసెంబ్లీ అంత గందరగోళంతో నిండిపోయింది. కొంతమంది గూండాలు జయ మద్దతుదారులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. తమిళనాడు చరిత్రలో మొదటిసారి పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశించి లాఠీఛార్జి చేశారు. ఈ సందర్భంలోనే సభాపతి జానకి రామచంద్రన్ విశ్వాస పరీక్ష నెగ్గినట్లు ప్రకటించారు. ఆ వెంటనే... జయ అసెంబ్లీ బయటకు వచ్చి ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆక్రోశం వ్యక్తం చేశారు. జానకి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని గవర్నర్‌ను కోరారు. అసెంబ్లీ సంఘటనలన్నింటితో గవర్నర్‌కు నివేదిక సమర్పించారు. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ కేంద్రానికి సిఫారసు చేశారు. తమిళనాడులో జయ శకానికి నాందీ పడింది! (‘అమ్మ... జయలలితాస్ జర్నీ ఫ్రమ్ మూవీస్టార్ టు పొలిటికల్ క్వీన్’ గ్రంథం నుంచి. రచయిత: వాసంతి) -
శక్తి స్వరూపిణి
సాక్షి ప్రతినిధి, చెన్నై: పురచ్చితలైవి(విప్లవ నాయకి)లోని తెగువ.. అమ్మలోని అనురాగం.. ఎన్ని కష్టాలెదురైనా వెనక్కి తగ్గని నైజం ఆమె సొంతం. రెండేళ్లకే తండ్రి చనిపోయినా.. తల్లి సినిమాల్లోకి వెళ్లడంతో చిన్నతనంలో మాతృప్రేమకు దూరమైనా.. ఆమె కుంగిపోలేదు. చదువుల్లో టాపర్ అయినా.. కుటుంబపోషణ కోసం నాటకాల బాటపట్టినా.. ఎక్కడా నిరుత్సాహపడలేదు. నిండుసభలో దుశ్శాసన పర్వాన్ని ఎదుర్కొన్నా.. ఆ తర్వాత రెండేళ్లకే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ధీరోదాత్త. ఇలా ఒక్కసారి కాదు ఏకంగా ఆరుసార్లు ముఖ్యమంత్రిగా ప్రజామన్ననలు పొందిన రికార్డు జయలలితకే సాధ్యం. తరతరాలుగా వేళ్లూనుకుపోయి ఉన్న పురుషాధిక్య సమాజంలో.. అందులోనూ రాజకీయాల్లో నెగ్గుకు రావడమంటే మాటలు కాదు. ఇది దాదాపు అసాధ్యమే. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అందరి చేత ‘జయ’హో అనిపించుకున్నారు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబంలో పుట్టినా జాతీయస్థాయి రాజకీయ పుంగవుల చేత జేజేలు కొట్టించుకున్నారు. ఒకనాడు ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్లను ఉక్కు మహిళ అనే వారు. ఈ కోవలోనే జయలలితనూ దక్షిణాది ఉక్కు మహిళ అని పిలుచుకోవచ్చు. ఆటుపోట్లతో అమ్మ ఎదురీత ఎంజీఆర్ మరణంతో జయకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విపక్షం డీఎంకేతో పాటు స్వపక్షం అన్నాడీఎంకే నుంచి కూడా ఆమె అవమానాలను ఎదుర్కొన్నారు. ఎంజీఆర్ మృతి చెందగానే పార్టీ రెండుగా చీలింది. ఒక వర్గానికి నాయకత్వం వహించిన ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఆర్టికల్ 356 ప్రయోగించి జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అక్కడితో ఆమె శకం ముగిసింది. 1989లో ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా తన వర్గానికి నాయకత్వం వహించి ఎన్నికల బరిలోకి దిగిన జయ.. తేనీ జిల్లా బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆమె పార్టీ కేవలం 27 సీట్లు మాత్రమే గెలవడంతో ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. తద్వారా తమిళనాడు తొలి మహిళా ప్రతిపక్ష నేతగా జయ చరిత్ర కెక్కారు. అదే ఏడాది జయ జీవితంలో మర్చిపోలేని చేదు సంఘటన చోటుచేసుకుంది. నిండు సభలో స్పీకర్ సాక్షిగా అధికారపక్షం డీఎంకే చేతిలో దాడికి, తీవ్ర పరాభవానికి గురయ్యారు. చినిగిన చీరతో అసెంబ్లీ నుంచి వెళ్లిపోతూ.. ‘ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టను’ అని జయ శపథం చేశారు. కాగా, చట్టసభలో ఎదురైన పరాభవం ఆమెకు ప్రజల నుంచి అంతులేని సానుభూతి తెచ్చిపెట్టింది. అదే సమయంలో అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఏకమవ్వడంతో జయలలిత పార్టీ సామ్రాజ్ఞిగా ఎదిగారు. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె స్నేహహస్తం అందించారు. ఆ ఎన్నికల సమయంలోనే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని ఎల్టీటీఈ తీవ్రవాదులు హతమార్చారు. కాగా, ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, కాంగ్రెస్ కూటమి 234 అసెంబ్లీ స్థానాలకు గానూ 225 చోట్ల, 39 పార్లమెంటు స్థానాల్లో గెలుపొంది జయకేతనం ఎగరవేసింది. దీంతో 1991లో జయలలిత తొలిసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. శపధాన్ని రెండేళ్లు కూడా తిరగక ముందే నెరవేర్చి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో జయ అడుగుపెట్టారు. అనంతరం 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోరుుంది. మళ్లీ 2001లో రెండోసారి జయ ముఖ్యమంత్రి అయ్యారు. ఆతర్వాత 2002లో మూడోసారి, 2011లో నాలుగోసారి, 2015లో ఐదోసారి, 2016లో ఆరోసారి ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేపట్టారు. రికార్డుల్లో గురువును మించిన శిష్యురాలు రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన ఎంజీఆర్ సాధించిన రికార్డులను బద్దలుకొట్టడం ద్వారా గురువును మించిన శిష్యురాలు అనిపించుకున్నారు జయ. ఎంజీఆర్ మూడుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే.. ఆయన శిష్యురాలు జయలలిత ఆరుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే గత పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 39 స్థానాల్లో 37 స్థానాలను గెలుచుకున్న రికార్డు కూడా జయకు మాత్రమే సొంతం. మిత్రపక్ష పార్టీలను కూడా రెండు ఆకుల గుర్తుపైనే పోటీ చేరుుంచి గెలిపించడం జయ నాయకత్వ పటిమకు నిదర్శనం. అధికార పార్టీని ఐదేళ్ల తర్వాత ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం తమిళనాడు ప్రజల సంప్రదాయం. దీనిని కూడా ఆనాడు ఎంజీఆర్ తుడిచిపెట్టగా, ఇటీవలి ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ద్వారా జయలలిత ఆ రికార్డును కూడా చెరిపివేశారు. ఎంజీఆర్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, జయలలిత 8 సార్లు పోటీ చేసి 7సార్లు గెలిచారు. ముహూర్తమంటే మక్కువ జ్యోతిష, సంఖ్యాశాస్త్రాలపై నమ్మకం కలిగిన జయలలిత తాను నివసిస్తున్న పోయెస్‌గార్డెన్‌లోని భవనానికి తన తల్లి పేరు కలిసొచ్చేలా ‘వేద నిలయం’ అని పేరు పెట్టుకున్నారు. అలాగే తన పేరును jayalalithaa (చివరన ‘ఎ’ అక్షరం అదనంగా)గా మార్చుకున్నారు. ఇక మంచి ముహూర్తం లేనిదే జయ కాలు బయటపెట్టరు. దైవభక్తి మెండుగా ఉన్న జయలలిత చెన్నై నగరంలోని కొట్టూరుపురం వినాయకుని ఆలయానికి తరచూ వెళుతుంటారు. అలాగే తన నెలసరి వేతనంతో ఆలయాల్లో నిత్యాన్నదానాలతో పాటు చిన్న గున్న ఏనుగును కూడా బహూకరించేవారు. కోమలవల్లి... జయలలిత కర్నాటకలోని(నాటి మైసూరు రాష్ట్రం) మాండ్య జిల్లా మేల్కోటేలో తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జయరామన్, వేదవల్లి(సంధ్య) దంపతులకు 1948 ఫిబ్రవరి 24న జయలలిత జన్మించారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం బిడ్డలకు రెండు పేర్లు పెట్టాల్సి ఉంది. ఒకటి పూర్వీకుల పేరు, మరొకటి వ్యక్తిగత పేరు. దీంతో అమ్మమ్మ కోమలవల్లి పేరుతో పాటు జయలలిత అని నామకరణం చేశారు. జయలలిత అనే పేరు వెనుక ఒక చిన్న చరిత్ర ఉంది. జయ చిన్నతనంలో ఆమె కుటుంబం మైసూరులో రెండు ఇళ్లలో అద్దెకు ఉంది. అందులో ఒకటి జయ విలాస్, మరొకటి లలిత విలాస్. ఈ రెండు పేర్లను కలిపి జయలలిత అని పెట్టారని చెబుతుంటారు. తండ్రి న్యాయవాద వత్తిని నిర్వహించినా ధనంపై ఆశతో పనిచేయకపోవడంతో స్థితిమంతులు కాలేకపోయారు. జయకు రెండేళ్ల ప్రాయంలోనే తండ్రి చనిపోయాడు. దీంతో తల్లి వేదవల్లి చంటిబిడ్డ జయను చంకన వేసుకుని బెంగళూరులోని తన పుట్టింటికి వచ్చేసింది. వేదవల్లి సోదరి అంబుజవల్లి ఎరుుర్హోస్టెస్గా పనిచేస్తూ డ్రామాలు, సినిమాల్లో నటించేందుకు మద్రాస్‌కు మకాం మార్చింది. దీంతో చిన్నారి జయను వదిలి తల్లి వేదవల్లి కూడా కుటుంబపోషణ నిమిత్తం 1952లో మద్రాస్‌కు వచ్చేశారు. ఆ తర్వాత వేదవల్లి సినిమా నటిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి తన వెండితెర పేరును సంధ్యగా మార్చుకున్నారు. తల్లిని విడిచి ఉండలేని జయలలిత కూడా 1958లో మద్రాసుకు చేరారు. జయ విద్యాభ్యాసం బెంగళూరులోని బిషప్ కాటల్ గర్ల్స్ హైస్కూల్‌తో పాటు మద్రాస్‌లోని చర్చిపార్క్ స్కూల్, స్టెల్లా మేరీస్ కాలేజీలో కొనసాగింది. చదువులో జయ ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిషు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల దిట్టగా ఎదిగారు. అరుుతే, న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకోవాలనుకున్న జయ.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సినీపరిశ్రమలో అడుగుపెట్టాల్సి వచ్చింది. అనంతర కాలంలో తమిళ ప్రజలు దేవుడిగా కొలిచే వెండితెర వేల్పు ఎంజీ రామచంద్రన్‌తో ఆమెకు పరిచయ భాగ్యం కలిగింది. ఇష్టాఇష్టాలు జయలలిత పూర్తి శాకాహారి. తన జీవితాన్ని ప్రభావితం చేసిన వారిలో మొదటి వ్యక్తిగా తల్లి సంధ్య పేరును ప్రస్తావించే జయలలిత.. అనంతరం రాజకీయ గురువు ఎంజీఆర్, మదర్ సెలినా(తన స్కూల్ టీచర్)ను కూడా తప్పకుండా గుర్తు చేసుకుంటారు. న్యాయశాస్త్రాన్ని అమితంగా ఇష్టపడే జయలలిత మంచి పుస్తకాలను సేకరించి పోయెస్ గార్డెన్‌లోని తన ఇంట్లో పెద్ద గ్రంథాలయమే ఏర్పాటు చేసుకున్నారు. ఇక జయలలితకు ఇష్టమైన పుస్తకం ‘వైల్డ్ స్వాన్స్’. ఇదిలాఉండగా, జయ ఇంట్లోనే తమిళ, ఇంగ్లిష్ పాత చిత్రాలను కూడా చూసేవారు. రాష్ట్రంలోని ఐదు విశ్వవిద్యాలయాలు ఆమెను డాక్టరేట్‌తో సత్కరించడం విశేషం. ఇక, జయకు ప్రాణ స్నేహితురాలు(నెచ్చెలి) శశికళ అరుుతే బద్ద విరోధి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి. ఎంజీఆర్ అడుగుజాడల్లో.. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్)ను రాజకీయ గురువుగా భావించిన జయలలిత ఆయన అడుగుజాడల్లో నడవడం ప్రారంభించారు. 1982లో ఆమెకు ఎంజీఆర్ పార్టీ సభ్యత్వం కల్పించారు. బహిరంగ సభల్లో జయను ‘పెన్నిన్ పెరుమై’(మహిళలకే గర్వకారణం) అంటూ ఎంజీఆర్ పరిచయం చేసేవారు. 1983లో పార్టీ ప్రచార కార్యదర్శిగా ఆమెను నియమించారు. ఈ బాధ్యతలను జయ సమర్థవంతంగా నిర్వర్తించి ఆయన మెప్పు పొందారు. దీంతో 1984లో ఆమెను రాజ్యసభకు ఎంపిక చేశారు. అదే ఏడాది ఎంజీఆర్‌కు గుండెపోటు రావడం, అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో పార్టీ ప్రచార కార్యదర్శిగా జయ విస్తృతంగా పర్యటించి పార్టీకి మంచి ఫలితాలు రాబట్టారు. కాగా, మూడేళ్ల తర్వాత 1987లో ఎంజీఆర్ మృతి చెందారు. పురట్చితలైవర్ (విప్లవనాయకుడు) అంటూ ఎంజీఆర్‌ను ప్రేమగా పిలుచుకునే ప్రజలు.. ఆయన రాజకీయ భావజాలాన్ని అందిపుచ్చుకున్న జయలలితను పురట్చితలైవి (విప్లవనాయకి)గా పిలవనారంభించారు. అమ్మ.. చిన్నమ్మ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ జీవితాన్ని ఎంతగా చెప్పుకున్నా.. ఆమె నెచ్చెలి శశికళను ప్రస్తావించకుంటే అది అసంపూర్తే. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ‘ఈమె శశికళ మాత్రమే కాదు, జయలలిత నీడ’ అనేంతటి ప్రాధాన్యతను కల్పించుకుని టాక్ ఆఫ్ ది కంట్రీగా మారారు. శశికళ జయకు దగ్గరైన వేళ 1983లో జయలలిత అన్నాడీఎంకే ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు వీడియో కవరేజీ ఫొటో స్టూడియోను నడుపుతున్న శశికళను కలెక్టర్ చంద్రలేఖ జయకు పరిచయం చేశారు. వారిద్దరి పరిచయం స్నేహంగా మారింది. ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఆయన మరణం తర్వాత జయలలితకు పార్టీలో వ్యతిరేకుల నుంచి ఒత్తిడి ప్రారంభమైంది. ఈ కష్టకాలంలో శశికళ జయకు అండగా నిలిచారు. ఆ తరువాత జయలలిత నివాసమైన పోయెస్‌గార్డెన్‌లోనే శశికళ నివసించడం ప్రారంభించారు. 1991లో తొలిసారిగా జయ ముఖ్యమంత్రి అయ్యారు. పోయెస్‌గార్డెన్‌లో శశికళ బంధువుల పెత్తనం పెరిగింది. శశికళ అన్న కుమారుడు సుధాకరన్ను జయ దత్తు తీసుకున్నారు. 1996లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ అరెస్టుకాగా, ఆమెతో పాటూ శశికళ కూడా అరెస్టయ్యారు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా టాన్సీ కుంభకోణం వివాదాల్లో చిక్కుకుని ఉన్నందున జయ సీఎం కాలేక పోయారు. అపుడు పన్నీర్‌సెల్వంను తాత్కాలిక ముఖ్యమంత్రిగా పీఠంపై కూర్చోబెట్టింది శశికళనే. 2011లో జయ మళ్లీ అధికారంలోకి రాగా శశికళ కుటుంబ సభ్యుల అట్టహాసం మళ్లీ వేగం పుంజుకుంది. దీంతో జయలలిత ఆగ్రహం చెంది శశికళను పోయెస్‌గార్డెన్ నుంచి బైటకు పంపివేశారు. అరుుతే రెండోసారి కూడా శశికళ, జయలలితల మధ్య విభేదాలు ఎంతోకాలం నిలబడలేదు. శశికళ మళ్లీ పోయెస్‌గార్డెన్‌కు చేరుకున్నారు. ‘నన్ను చూసుకోవడం శశికళ వల్లనే సాధ్యం, ఆమె లేకుండా నేను ఒంటరిగా ఉండలేను’ అనే ఆప్యాయతను జయ ప్రదర్శించారు. -
సినీ జయన్మాత
హీరోలు సీఎంలు కావడం ఓకే.కానీ, హీరోయిన్ సీఎం కావడం గ్రేట్ అచీవ్మెంట్. కఠినమైన బాల్యం... అనిష్టమైన సినీరంగం...జటిలమైన రాజకీయ చదరంగం... వీటి నుంచి తారాజువ్వలా ఎగసింది జయలలిత.ఆకుపచ్చ బట్ట కట్టినా... కుమారుడి పెళ్లి కోసం ఆకాశమంత పందిరి వేసినా... ఆమె ఒక సెన్సేషన్! ఎందరికో ‘అమ్మ’...అఖిల తమిళనాడుకు ‘పురట్చి తలైవి’...జనాదరణలో మేటి సీఎం...జయలలిత... జై లలిత! ‘‘జీవితంలో నేను ఎదుర్కొన్న ఒడుదొడుకులు నాకో మంచి పాఠం నేర్పించాయి. జీవితంలో నువ్వు ఒకే ఒక్క వ్యక్తి మీద ఆధారపడాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు... ‘నువ్వే’!’’ - ఇది జయలలిత స్వయంగా చెప్పిన సిద్ధాంతం. చెప్పడమే కాదు... చేతల్లోనూ ఆచరించిన సిద్ధాంతం. నిజంగానే ఆమె జీవితం మొత్తం తన మీద తానే ఆధారపడ్డారు. ఒంటరి పోరు చేశారు. మైసూరులోని మాండ్య జిల్లా, పాండవపుర తాలూకాలోని మేలుకోటేలో 68 ఏళ్ళ క్రితం జన్మించిన మామూలు అమ్మాయి స్వశక్తితో సినీ, రాజకీయ జీవితాల్లో శిఖరాలు అధిరోహించారు. తమిళ అయ్యంగార్ కుటుంబంలో 1948 ఫిబ్రవరి 24న జయరామ్, వేదవల్లి దంపతులకు జయలలిత జన్మించారు. స్వతహాగా అయ్యంగార్ కుటుంబాల్లో రెండు పేర్లు పెడతారు. ఒకటి పిల్లకు పెట్టే, నాయనమ్మ, తాతమ్మల పేరు. మరొకటి ఇంట్లో, స్కూల్లో పిలుచుకొనే పేరు. అలా జయలలితకు పెట్టిన అసలు పేరు - ‘కోమలవల్లి’. ఆ తర్వాత ‘జయలలిత’ అని నామకరణం చేశారు. జయలలిత తాత నరసింహన్ రంగాచారి మైసూరు సంస్థానంలో మైసూర్ మహరాజా జయరామ రాజేంద్రకు వైద్యుడిగా వ్యవహరించేవారు. అందుకే తన వారసుల పేర్లకు ముందు ‘జయ’ అని చేర్చేవారు. జయలలితకు ఒక అన్నయ్య. పేరు జయకుమార్. రెండేళ్ల వయసులోనే ఆమె తండ్రి జయరామ్ చనిపోయారు. ఆ తర్వాత బెంగళూరులో ఉంటున్న పుట్టింటి వారి దగ్గరకు కూతురితో సహా చేరారు జయలలిత తల్లి వేదవల్లి. కుటుంబ బాధ్యతను మోయడం కోసం వేదవల్లి టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకొని, గుమస్తాగా పని చేయడం మొదలుపెట్టారు. తర్వాత మద్రాసులో ఎయిర్‌హోస్టెస్‌గా, రంగస్థల నటిగా కొనసాగుతున్న తన సోదరి అంబుజవల్లి దగ్గరికి వేదవల్లి వెళ్లారు. దాంతో అమ్మకు దూరంగా అమ్మమ్మ-తాతల దగ్గర పెరిగారు జయలలిత. కూతురికి దూరంగా వేదవల్లి మద్రాసులో ఉంటూ, సంధ్యగా పేరు మార్చుకుని నాటకాల్లోకి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. అటుపైన ఆర్థికంగా ఫర్వాలేదనిపించడంతో కుమార్తెను కూడా మద్రాసు తీసుకెళ్ళారు. స్టేట్ ఫస్ట్ స్టూడెంట్! మద్రాసులో ‘ది బెస్ట్’ అన్నదగ్గ వాటిలో ఒకటైన ‘చర్చి పార్క్ కాన్వెంట్’లో జయలలితను తల్లి చేర్చారు. చిన్నప్పటి నుంచి జయలలిత చాలా తెలివైన స్టూడెంట్. పదో తరగతిలో తమిళనాడులోనే ఎక్కువ పర్సంటేజ్ మార్కులు సాధించిన విద్యార్థినిగా అవార్డు కూడా సాధించారు. ఒకవైపు స్కూలు చదువులతో పాటు శాస్త్రీయ సంగీతం, పియానో వాద్యం, భరతనాట్యం, మణిపురి, కథక్ వంటి నృత్య రీతులు జయలలిత నేర్చుకున్నారు. సుప్రసిద్ధ భరత నాట్యాచారిణి కె.జె. సరస ఆమెకు గురువు. తొలిసారిగా నృత్య ప్రదర్శన (అరంగేట్రం) ఇచ్చిన సమయంలోనే జయలలిత డ్యాన్స్ చూసి, ప్రముఖ నటుడు శివాజీగణేశన్ ‘పెద్ద ఆర్టిస్ట్’ అవుతుందని ఆమె తల్లి సంధ్యతో అన్నారు. ఆ తర్వాత అదే నిజమైంది. వాస్తవానికి కూతురిని బాగా చదివించాలన్నది తల్లి సంధ్య ఆశయం. అందుకే, బాల నటిగా పలు అవకాశాలు వచ్చినప్పుడు, ‘అమ్మాయి చదువుకు ఆటంకం లేకుండా షూటింగ్స్ పెడితే ఓకే’ అని ఆమె కండిషన్ పెట్టారు. బాల నటిగా జయలలిత నటించిన తొలి కన్నడ చిత్రం ‘శ్రీశైల మహాత్మె’ (1961). అందులో చిన్నారి పార్వతీదేవిగా బాల జయలలిత కనిపిస్తారు. ఆ తర్వాత 1962లో హిందీ చిత్రం ‘మన్ మౌజీ’లో కృష్ణుడి వేషం వేశారు. ఆ తర్వాత అనేక ఇంగ్లిష్, తమిళ నాటికల్లో నటించారు. అది చూసి, మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి కుమారుడు శంకరగిరి ఆ సమయంలోనే ‘ది ఎపిసిల్’ అనే ఇంగ్లిష్ మూవీలో నటింపజేశారు. లాయర్ కాబోయి... యాక్టర్ ప్రముఖ దర్శక - నిర్మాత బీఆర్ పంతులు ‘కర్ణన్’ (తెలుగులో ‘కర్ణ’) చిత్రం విజయోత్సవంలో తల్లి చాటు బిడ్డ జయలలితను చూశారు. వెంటనే తాను నిర్మించనున్న కన్నడ చిత్రం ‘చిన్నద గొంబె’ (1964)లో కథానాయికగా పరిచయం చేస్తానన్నారు. పదో తరగతి పరీక్షలు రాసి సెలవుల్లో ఉండటంతో, కాలేజీ తెరిచే లోపు షూటింగ్ పూర్తి చేయాలని తల్లి సంధ్య షరతు పెట్టారు, అలా జయ తొలిసారిగా నాయిక పాత్ర పోషించారు. బాలనటిగా, కథానాయికగా జయ తొలి సినిమాలు కన్నడంవే కావడం విశేషం. తండ్రి లాయర్ కావడంతో, ఆ ప్రభావంతో న్యాయశాస్త్రం చదవాలన్నది జయ ఆశయం. అయితే బతుకు బండిని లాగడం కష్టం కావడంతో, వరుసగా అవకాశాలు వస్తున్న కూతుర్ని సినిమాల్లో కొనసాగించాలని తల్లి అనుకోవడంతో జయ జీవితమే మారిపోయింది. ఇద్దరు సీ.ఎంలతో మూడో సీ.ఎం! తెలుగువాడైన ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో ‘వెన్నిరాడై’ (1965) చిత్రం ద్వారా తమిళ తెరకు కథానాయికగా పరిచయమయ్యారు జయలలిత. అందం, అభినయం మెండుగా ఉన్న తార అనిపించుకోవడంతో వరుసగా అవకాశాలు రావడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండాపోయింది. కె. ప్రత్యగాత్మ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘మనుషులు- మమతలు’ (’65) ద్వారా తెలుగు తెరకు కథానాయికగా పరిచయం అయ్యారామె. తెలుగులో ‘చిక్కడు-దొరకడు’, ‘తిక్క శంకరయ్య’, ‘గండికోట రహస్యం’, ‘శ్రీకృష్ణ విజయం’, ‘దేవుడు చేసిన మనుషులు’ - ఇలా ఎన్టీఆర్ సరసన అత్యధికంగా 11 చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, దేవిక నటించిన ‘నిలువు దోపిడీ’లో కృష్ణకు కథానాయికగా చేశారు. ఎన్టీఆర్‌తో ఆమె చేసిన చిత్రాల్లో అధిక భాగం హిట్లే. అలాగే తమిళంలో ‘ఆయిరత్తిల్ ఒరువన్’ మొదలుకొని ‘పట్టికాట్టు పొన్నయ్య’ వరకూ ఎంజీఆర్ సరసన 28 హిట్ చిత్రాల్లో నటించారు. ఇవన్నీ 1965 నుంచి 1973 మధ్య విడుదలైన చిత్రాలే. ఆ తరువాత అటు ఎం.జి.ఆర్ తమిళ రాష్ట్రానికీ, ఇటు ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రానికీ ముఖ్యమంత్రులయ్యారు. అలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎక్కువ సినిమాల్లో నటించిన జయలలిత ఆ తర్వాత తానూ ముఖ్యమంత్రి కావడం విశేషం. ఎనిమిదిసార్లు డబుల్ పోజ్! దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో మొత్తం ఎనిమిది చిత్రాల్లో జయలలిత ద్విపాత్రాభినయం చేశారు. లేడీ ఓరియంటెడ్ మూవీ ‘యార్ పెణ్’లో తొలిసారి రెండు పాత్రలు చేశారు. ఆ తర్వాత ‘కందన్ కరుణై’ (’67), ‘నీ’, ‘అడిమై పెణ్’, ‘గంగా గౌరి’ వంటి చిత్రాల్లో రెండు పాత్రల్లో కనిపించారు. మేకప్ వేసుకున్నందుకు పనిష్మెంట్! నిజానికి అంతకు ముందు చాలా కాలం క్రితం ఓసారి జయలలిత ఎంతో ముచ్చటపడి ముఖానికి మేకప్ వేసుకుంది. అప్పటికే నటిగా మేకప్ వేసుకున్న సంధ్యకు కూతురు మేకప్ వేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదు. దాంతో జయకు పెద్ద పనిష్మెంటే ఇచ్చారు. ‘మేకప్ వేసుకున్నా.. సినిమాల జోలికి వచ్చినా ఊరుకునేది లేదు’ అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అలాంటి తల్లే చివరకు తనను సినిమాల్లోకి తీసుకెళ్లాలనుకోవడం జయలలితను ఆశ్చర్యపరిచింది. స్వతహాగా మంచి స్టూడెంట్ కావడంతో అప్పటికే మద్రాసులో పేరున్న స్టెల్లా మేరీస్ కాలేజీలో సీటొచ్చినా, జయలలిత నిరాకరించక తప్పలేదు. అనిష్టంగానే తల్లి ప్రతిపాదనకు తలూపారు. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో... ఏ హీరో సరసన నటిస్తే, ఆ హీరోకి సరిజోడీ అనిపించుకోవడం జయలలిత ప్రత్యేకత. ‘నడిగర్ తిలగం’ శివాజీగణేశన్ సరసన ఆమె 17 చిత్రాల్లో నటించారు. వాటిలో ‘దైవమగన్’ ఒకటి. ఆస్కార్ అవార్డ్స్‌కు ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో ఇండియా నుంచి నామినేషన్ ఎంట్రీగా వెళ్లిన తొలి తమిళ చిత్రం ఇది. ఇంకా తమిళ నటుడు జయశంకర్, రవిచంద్రన్ తదితర హీరోల సరసన జయలలిత నటించారు. హిందీ నటుడు ధర్మేంద్ర సరసన ‘ఇజ్జత్’లో నటించారు. ఒకానొక దశలో సినిమా టైటిల్స్ జయలలిత క్యారెక్టర్ మీద పెట్టినా, హీరోలెవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం ఆమె సంపాదించుకున్న క్రేజ్కీ, ఇమేజ్‌కీ నిదర్శనం. ‘అడిమై పెణ్’ (బానిస అమ్మాయి అని అర్థం), ‘కణ్ణన్ ఎన్ కాదలన్’ (కణ్ణన్ నా ప్రేమికుడు), ‘ఎన్గిరిందో వందాళ్’ (ఎక్కణ్ణుంచో వచ్చింది) లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణలు. ఒకవైపు హీరో ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించిన ఘనత జయలలితది. ఆ తరహా చిత్రాలు దాదాపు డజనుకు పైనే చేశారు. 12 నెలలు... 11 సినిమాలు! సినిమా కెరీర్ మొత్తంలో జయ తమిళంలో దాదాపు 100 చిత్రాల్లో నటిస్తే, వాటిలో 80 సిల్వర్ జూబ్లీ హిట్స్ ఉన్నాయని తమిళ వర్గాలు చెబుతాయి. ఇక, తెలుగులోనూ సిల్వర్ జూబ్లీ హిట్స్ ఉన్నాయి. 1961 నుంచి కెరీర్ ఫుల్స్టాప్ పెట్టే సంవతర్సం 1980 వరకూ ఆమె కథానాయికగా చేసిన చిత్రాల్లో అధిక భాగం హిట్స్ ఉండడం విశేషం. చాలా పెద్ద మొత్తం పారితోషికం తీసుకున్న కథానాయిక కూడా కావడం మరో విశేషం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీతో కలిపి ఆమె దాదాపు 140 సినిమాల్లో నటించారు. నటిగా ఎంత బిజీ బిజీగా సినిమాలు చేశారంటే... ఒక్క 1966లోనే ఆమె నటించిన 11 చిత్రాలు విడుదలయ్యాయి. బిరుదులు ఎన్నెన్నో... ఆ సమయంలోనే ఆమెకు ‘కవర్చి కన్ని’ అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అంటే... ‘ఆకర్షణీయమైన యువతి’ అని అర్థం. ఆ తర్వాత 1969లో ‘కావేరి తంద కలై సెల్వి’ అనే ఇంకో బిరుదును సొంతం చేసుకున్నారు. అంటే.. ‘కావేరి ఇచ్చిన కళా తనయ’ అని అర్థం. అంతకు రెండేళ్లకు ముందు ‘కలై సెల్వి’ అనే బిరుదు అందుకున్నారు. అప్పటి నుంచి తెరపై ఆమె పేరుకు ముందు ‘కలై సెల్వి’ అని వేయడం ఆనవాయితీ అయింది. ఆఖరి చిత్రాలు... 1980లో వచ్చిన ‘నదియై తేడి వంద కడల్’ (నదిని వెతుక్కుంటూ వచ్చిన సముద్రం) తమిళంలో జయకు హీరోయిన్గా చివరి చిత్రం. ఆ ఏడాదే తెలుగులో ఆమె చేసిన చివరిఫిల్మ్ అక్కినేని ‘నాయకుడు- వినాయకుడు’. గాయని కూడా! స్కూల్ డేస్‌లోనే జయలలిత కర్ణాటక, పాశ్చాత్య సంగీతం నేర్చుకున్నారు. బాగా డ్యాన్స్ చేయడం మాత్రమే కాదు.. చక్కగా పాడగలరు కూడా. 1969లో నటించిన ‘అడిమై పెణ్’లో ‘అమ్మా ఎన్డ్రాల్ అన్బు..’ అనే పల్లవితో సాగే పాటను పాడారు. ‘అమ్మ అంటే ప్రేమ’ అని దానర్థం. నిజజీవితంలో కూడా తల్లి సంధ్యతో జయలలిత చాలా ప్రేమగా ఉండేవారు. ఆ చిత్రం తర్వాత కూడా ఏడెనిమిది చిత్రాల్లో జయలలిత పాడారు. సినిమాలకు సంబంధం లేని మూడు భక్తి ఆల్బమ్స్‌కు కూడా ఆమె పాడడం విశేషం. మీరు బాగుండాలి! 1980లో సినిమాలకు దూరమై, రాజకీయాల్లోకి ప్రవేశించాక మళ్లీ సినిమాల గురించి జయలలిత ఆలోచించలేదు. అయితే, ఆ తర్వాత ఒకే ఒక్క సినిమాలో ఆమె నటించారు. అది - విసు దర్శకత్వంలో మణిరత్నం సోదరుడు జి. వెంకటేశ్ నిర్మించిన ‘నీంగ నల్లా ఇరుక్కనమ్’ (1992). అంటే ‘మీరు బాగుండాలి’ అని అర్థం. అందులో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగానే నిజజీవిత పాత్రలో అతిథిగా కనిపిస్తారు. సామాజిక సమస్యలపై తీసిన ఈ చిత్రం తమిళనాడు ప్రభుత్వం తొలిసారిగా స్పాన్సర్ చేసిన సినిమా కూడా! దీనికి జాతీయ అవార్డూ వచ్చింది. చిత్ర నిర్మాణానికి ఏడాది ముందు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. నటిగా జయలలిత తమిళనాడు ప్రభుత్వ ‘కలైమామణి’ సహా ఎన్నో అవార్డులందుకున్నారు. చలనచిత్ర చరిత్రలో ఆమెదో చెరగని ముద్ర. అమిత పుస్తకపఠనం, హుందాతనం కలగలసి, ‘జై’లలిత అనిపించుకున్నారు.