komuram bheem dist
-
పెళ్లి ఇంట్లో విషాదం.. వడ దెబ్బతో వరుడి మృతి
సాక్షి, ఆదిలాబాద్: పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు వడదెబ్బతో కన్నుమూసిన ఘటన .కుమురం భీం జిల్లా కౌటాల మండలం గుడ్ల బొరీ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య యశోదలకు ముగ్గురు కొడుకులు. వీరిలో పెద్ద కుమారుడు తిరుపతి (26). ఇతనికి ఇటీవల మంచిర్యాల జిల్లా భీమిని గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పెళ్లి ముహూర్తం ఉంది. కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంతలోనే పెళ్లి పనుల్లో నమగ్నమైన తిరుపతి సోమవారం వడదెబ్బకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్న తిరుపతిని కుటుంబ సభ్యులు కాగజ్‌గనర్ తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తిరుపతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతన్ని మెరుగైన వైద్యం కోసం మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న వ్యక్తి ఇలా ఉన్నట్టుండి మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది. తిరుపతి సోదరుడు శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా కొనసాగుతూ అరు నెలల కిందటే అనారోగ్యంతో మృతి చెందాడు. పెళ్లి కోసం చేసిన ఏర్పాట్ల వద్ద మృతదేహం పెట్టాల్సి రావడంపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
థర్మాకోల్ తెప్ప బోల్తా.. విద్యార్థులు సురక్షితం
కాగజ్‌నగర్ టౌన్: కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం అందవెల్లి పెద్దవాగులో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు థర్మాకోల్ తెప్ప బోల్తా పడింది. నలుగురు పాఠశాల విద్యార్థులు, ఇద్దరు కూలీలను తెప్పపై ఒడ్డుకు చేర్చుతుండగా ఒక్కసారిగా ఒకవైపు ఒరగడంతో వాగులో పడిపోయారు. కొందరు వాగులో నడుస్తూ తెప్పపై కూర్చోబెట్టి వాగు దాటిస్తుంటారు. ఇలా దాటిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. దాటిస్తున్న ముగ్గురు వ్యక్తులు పడిపోయిన వారిని వెంటనే కాపాడి ఒడ్డుకు చేర్చారు. బ్యాగులు, కూలీల సెల్ఫోన్లు వాగులో పడిపోయాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందవెల్లి పెద్దవాగుపై ఉన్న వంతెన ఇటీవలి భారీ వర్షాలకు కుంగిపోయింది. అధికారులు ఆ వంతెన మార్గాన్ని మూసివేయడంతో గత్యంతరం లేక ఇలా తెప్పలపై దాటుతున్నారు. తహసీల్దార్ ప్రమోద్ తెప్పలపై తరలింపును నిలిపి వేయించారు. -
తెలంగాణ: కాగజ్‌నగర్ గురుకులంలో ఫుడ్‌పాయిజన్
ఆసిఫాబాద్: కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌లోని మైనారిటీ గురుకులంలో ఫుడ్‌పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. భోజనం వికటించి యాభై మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో రాత్రికి రాత్రే వాళ్లందరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షలోనే వాళ్లంతా ఉన్నారు. ఇదిలా ఉంటే.. భోజనంలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు ఫిర్యాదు చేయడం విశేషం. -
కొమురంభీం జిల్లాలో రోడ్లపైకి వస్తున్న పెద్దపులులు
-
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు పాకిన కరోనా
-
మంచిర్యాలలో మాయలేడి
సాక్షి, మంచిర్యాలక్రైం/బెల్లంపల్లి: ఉద్యోగాల కల్పన పేరుతో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ మహిళ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమాయకులైన నిరుద్యోగులను తన మాయమాటలతో నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి మోసం చేసింది. ఊరు, పేరు తెలియకపోయినా.. కేవలం పరిచయమైతే చాలు.. బుట్టలో వేసుకోవడంలో ఆమెకామె సాటి. ఏం ఉద్యోగం చేస్తున్నావని, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆత్మీయురాలిగా కుశలప్రశ్నలు వేసి ఆకట్టుకోవడంలో దిట్ట. ఇలా ఆ మహిళ ఒక్కరుకాదు.. ఇద్దరు కాదు ఏకంగా 100 మందిని బోల్తాకొట్టించింది. రూ.కోట్లు వసూలు చేసి చివరికి ఐపీ పెట్టింది. నోటీసులు అందుకున్న బాధితులు మంచిర్యాల డీసీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. డిగ్రీ చదివిన ఓ ఇల్లాలు బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి కన్నాల బస్తీ (ఇందిరమ్మ కాలనీ)కి చెందిన సుమలత డిగ్రీ చదువుకుంది. ఓ కొడుకు జన్మించాక భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయినట్లు సమాచారం. అప్పటినుంచి సదరు మహిళ మోసాలు చేయడం అలవా టు చేసుకున్నట్లు తెలుస్తోంది. బెల్లంపల్లి బజారుఏరియా, గాంధీనగర్‌లో నివాసం ఉంటున్న ఓ ఇద్దరు యువకులను అసిస్టెంట్లుగా పెట్టుకుని దందాకు తెరతీసినట్లు ప్రచారంలో ఉంది. నిరుద్యోగులే టార్గెట్ సుమలత దూర ప్రాంతాల నిరుద్యోగులను ఎంచుకుంది. ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ జారీ చేస్తే చాలు.. ఆమె పంట పండినట్లే. అసిస్టెంట్లతో కలిసి అద్దెకారులో బయల్దేరి నిరుద్యోగులను వెదికేవారు. ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నట్లు అసిస్టెంట్లు నిరుద్యోగులకు పరిచయం చేసి.. సింగరేణి, ఏసీసీ, జైపూర్ విద్యుత్ ఫ్లాంట్, దేవాపూర్ ఓసీసీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏ రకమైనా ఉద్యోగమైనా సరే ఉన్నతాధికారులతో మాట్లాడి పెట్టిస్తుందని, ఆమె తలుచుకుంటే ఏదైనా సాధ్యమని నమ్మించి వలలో వేసుకునేవారు. అలా ఒక్కొక్కరి నుంచి కని ష్టంగా రూ.లక్ష.. గరిష్టంగా రూ.5లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను వంచించడంలో ఆమె ఎంతగానో ఆరితేరింది. అవసరాలకు అనుగుణంగా నేతల పేర్లు సుమలత ఏమాత్రం అనుమానం రాకుండా నిరుద్యోగుల వద్ద రాజకీయ నాయకుల పేర్లు ఎన్నోసార్లు వాడుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. అధికార పార్టీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల పేర్లు చెప్పి ఉద్యోగాలు పెట్టిస్తానని నమ్మబలికేది. టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకుల పేర్లనూ వదలలేదని సమాచారం. బాధితుల సంఖ్య పెరగడం, ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడం.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు తీవ్ర ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీంతో సదరు కిలేడీ ఐపీ పెట్టినట్లు తెలుస్తోంది. డీసీపీని కలిసిన బాధితులు గురుకులంలో ఉద్యోగాలు పెట్టిస్తానని చెప్పి సదరు సుమలత 132 మంది నిరుద్యోగులను మోసం చేసి చివరికి ఐపీ నోటీసులు పంపడంతో న్యాయం చేయలంటూ బాధితులు మంచిర్యాల డీసీపీని కలిశారు. డబ్బులు తీసుకుని కొంతకాలం ఉద్యోగాల విషయం కోర్టుకేసులో ఉందని, ఎన్ని కల కోడ్ ఉందని కాలయాపన చేసి ఇప్పుడు నిం డా ముంచిందని, తీసుకున్న డబ్బులకు ప్రామిసరీ నోట్లు, ఖాళీ చెక్కులు, బాండ్‌పేపర్‌పై అగ్రిమెంట్ కూడా రాసిచ్చిందని విన్నవించారు. ఈనెల14న ఐపీ నోటీసులు పంపిన సుమలత తన సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిందని పేర్కొన్నారు. పుస్తెలతాడు అమ్మిచ్చి డబ్బులు తీసుకుంది.. గురుకులంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటే వెళ్లి కలిశాం. నేను ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకున్న. ఉద్యోగానికి రూ.లక్ష అవుతుందని నమ్మిచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇస్తామంటే ఇప్పుడే ఇవ్వాలంది. లేదంటే పనికాదంది. డబ్బుల్లేవంటే నీ మెడలో పుస్తెలతాడు, రింగులున్నయి కదా.. అవి అమ్మియ్యుమని దగ్గరుండి మరీ మార్కెట్లో అమ్మిచ్చి డబ్బులు తీసుకొని వెళ్లిపోయింది. నా బంగారం పోయింది. ఉద్యోగం రాలే. – రత్నం భారతి, బెల్లంపల్లి అప్పులపాలయినం... ఉద్యోగం వస్తుందంటే నాలుగు పైసల వడ్డీకి తెచ్చి రూ.4లక్షలు అప్పు చేసి ఇచ్చినం. రెండున్నరేళ్లుగా వడ్డీలు కట్టలేక అప్పులపాలైనం. ఉద్యోగం ఇప్పించకపోగా.. మాపేనే కేసులు పెట్టింది. ఉన్నతాధికారులు స్పందించి సుమలతపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి. – రామటెంకి తిరుపతి, కాసిపేట -
గడువులోగా ‘భగీరథ’ గగనమే
‘రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం పనులను మార్చి 31 వరకు పూర్తి చేసి, ఏఫ్రిల్1 నుంచి ఇంటింటికీ తాగునీరు అందించాలి. 1 తర్వాత ఏ ఇంటి నుంచి కూడా మహిళ తాగునీటి కోసం గడప దాటి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాధికారులు శ్రద్ధపెట్టి నిర్దేశించిన గడువులోగా పైపులైన్ పనులు పూర్తి చేసి తాగునీటిని అందిచాలి.’ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక మిషన్ భగీరథ పథకం అమలు తీరుపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవీ. సాక్షి,బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మిషన్ భగీరథ పథకం పనులు సీఎం చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలిస్తే మరో మూడు, నాలుగు నెలలు గడిస్తే కానీ భగీరథ పనులు పూర్తయ్యేలా లేవు. పనులు నత్తనడకన సాగుతుండడంతో ఈ వేసవిలో కూడా పుర ప్రజలకు నీటి కష్టాలు తప్పేటట్లు కనిపించడం లేదు. మిషన్ భగీరథ పథకం ద్వారా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని అడ ప్రాజె క్టు నుంచి అంతర్గత పైపులైన్ ద్వారా బెల్లంపల్లి పుర ప్రజలకు తాగునీటిని అందించాలని సంకల్పించింది. ఇందుకు సంబంధించి పైపులైన్ పనులు ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు పూర్తి అ య్యాయి. కాని మున్సిపాలిటీ పరిధిలో యూఎల్ఎస్ఆర్, జీఎల్బీఆర్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. వీటి పనులు మందకొడిగా సాగుతుండడంతో ఇప్పట్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ కారణంగా ఇన్నాళ్ల నుంచి భగీరథ పథకం పనులకు గ్రహణం పట్టగా ఇప్పుడిప్పుడే నిర్మాణ పనులను ప్రారంభించారు. అసంపూర్తిగా పైపులైన్ పనులు.. మున్సిపాలిటీలో మొత్తం 34 వార్డులు ఉన్నాయి. ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే మంచిర్యాల – బెల్లంపల్లి గోదావ రి నీటి పథకం పైపులైన్లు మాత్రమే వార్డులలో ఉన్నాయి. వీటికి అనుబంధంగా పలు వార్డులలో మిషన్ భగీరథ పైపులను అనుసంధానం చేయాల్సి ఉండగా, మరికొన్ని వార్డులలో కొత్తగా పైపులను విస్తరించాలి. ప్రజారోగ్యశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 8 నుంచి 10 కిలో మీటర్ల దూరం వరకు పైపులైన్ వేయాల్సి ఉంది. ఆయా పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో పుర ప్రజలకు తాగునీ టిని సరఫరా చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. స్పందించని అధికారులు.. మిషన్ భగీరథ పథకం పనుల నిర్వహణపై ప్రజారోగ్యశాఖ అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కావట్లేదు. ఇటీవలే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయం లో ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వేసవిలో పుర ప్రజలకు తాగునీటి కష్టాలు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. తాగునీటి సమస్య ఏర్పడితే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం చెప్పినట్లుగా మిషన్ భగీరథ పథకం పనులు పూర్తి చేయడానికి ఇంకా కేవలం నెల రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. అప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో? లేదో? వేచి చూడాల్సిందే. -
జిల్లా కార్యాలయాలు సిద్ధం చేయాలి
జేసీ సుందర్‌అబ్నార్ మంచిర్యాల టౌన్ : కొమురం భీం జిల్లా ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చుకుని అక్టోబర్ 11న దసరా పండుగ రోజు జిల్లా కార్యాలయాలు ప్రారంభించే విధంగా సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్, స్టేషనరీ, ఇతర మౌలిక సదుపాయాలు, సైన్‌బోర్డుల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యాలయాలు ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసినట్లయితే వాటికి తగిన మరమ్మతు, సున్నం వేసి ఒప్పందం సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రైవేటు భవనాలలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవనం యజమానితో ఒప్పందం చేసుకుని, అద్దె నిర్ణయించడానికి ఆర్ అండ్ బీ శాఖతో సంప్రదించిన అనంతరం ఆర్డీవోకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. అధికారులు ప్రభుత్వం సూచించిన ఆరు ఫార్మాట్లలో తమ శాఖకు సంబంధించిన వివరాలను పొందుపరిచి సకాలంలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానమ్ పాల్గొన్నారు.