జిల్లా కార్యాలయాలు సిద్ధం చేయాలి | District offices should be prepared | Sakshi
Sakshi News home page

జిల్లా కార్యాలయాలు సిద్ధం చేయాలి

Published Fri, Sep 9 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM

జిల్లా కార్యాలయాలు సిద్ధం చేయాలి

జిల్లా కార్యాలయాలు సిద్ధం చేయాలి

  • జేసీ సుందర్‌అబ్నార్‌
  • మంచిర్యాల టౌన్‌ : కొమురం భీం జిల్లా ఏర్పాటు సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని సౌకర్యాలను సమకూర్చుకుని అక్టోబర్‌ 11న దసరా పండుగ రోజు జిల్లా కార్యాలయాలు ప్రారంభించే విధంగా సిద్ధంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్, స్టేషనరీ, ఇతర మౌలిక సదుపాయాలు, సైన్‌బోర్డుల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
     
    కార్యాలయాలు ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేసినట్లయితే వాటికి తగిన మరమ్మతు, సున్నం వేసి ఒప్పందం సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రైవేటు భవనాలలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవనం యజమానితో ఒప్పందం చేసుకుని, అద్దె నిర్ణయించడానికి ఆర్‌ అండ్‌ బీ శాఖతో సంప్రదించిన అనంతరం ఆర్డీవోకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. అధికారులు ప్రభుత్వం సూచించిన ఆరు ఫార్మాట్లలో తమ శాఖకు సంబంధించిన వివరాలను పొందుపరిచి సకాలంలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానమ్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement