kondagav
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్: మావోయిస్టు మృతి
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను గుర్తించిన మావోలు ఒక్కసారిగి కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా.. సంఘటనా స్థలం నుంచి పోలీసులు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
కొండగావ్: ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లా మర్దపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కూంబింగ్ కు వెళ్లిన పోలీసుల పై మావోయిస్టులు ఎదురుదాడి చేయడంతో.. పోలీసులు ధీటుగా జవాబిచ్చారు. కూంబింగ్ కొనసాగుతోంది.