koora RAJANNA
-
కూర రాజన్నను విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: కూర రాజన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించను న్నామని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నేతలు వంగల సంతోష్, పట్టోళ్ల నాగిరెడ్డి తెలిపారు. బొమ్మకంటి కొమురయ్య అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ప్రొఫె సర్ హరగోపాల్, ప్రొఫెసర్ ఎల్.విశ్వేశ్వర్రావు, ఎస్.జీవన్ కుమార్, ఆచార్య కట్టా భగవంతరెడ్డి, విమలక్క, తదితరు లను ఆహ్వానిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రాజన్నను కోర్టులో హాజరుపరచాలి
హైదరాబాద్: సీపీఐ (ఎంఎల్) జనశక్తి ప్రధానకార్యదర్శి కూర రాజన్న తదితరులకు వెంటనే కోర్టులో హాజరుపరచాలని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూర రాజన్నను చట్టప్రకారం కోర్టులో హాజరుపరచాలని తమ్మినేని విజ్ఞప్తిచేశారు. వారిపై ఎలాంటి కేసులున్నా చట్టప్రకారం విచారించాలని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.