kostal andhra
-
AP: కోస్తా జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇక, రానున్న రెండు రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం, మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది. తాజాగా విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద మీడియాతో మాట్లాడుతూ.. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుంది. అక్కడక్కడా చెదురుమొదురు వర్షాలు కురుస్తూ.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కోస్తా ప్రాంతంలో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఈ రెండు రోజుల తర్వాత మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. వర్షాలు పడే ప్రాంతాల్లో గాలుల వేగం కూడా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. మరోవైపు.. తెలంగాణలో ఇప్పటికే పలు భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్లో కూడా మంగళవారం పలుచోట్ల వర్షం కురిసింది. రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. -
ఏపీకి భారీ వర్ష సూచన.. వచ్చే నాలుగు రోజులు జాగ్రత్త!
సాక్షి, అమరావతి: గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో, ఏపీ నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని అధికారులు స్పష్టం చేశారు. #IMD : The cyclonic circulation over Westcentral Bay of Bengal off Andhra Pradesh coast persists. Ø Another cyclonic circulation lies over Northeast Bay of Bengal . It is very likely to merge with above system on 03rd October, 2022.#AndhraPradesh #Odisha — Natarajan Ganesan (@natarajan88) October 2, 2022 -
ఏపీకి వర్షసూచన
విశాఖపట్నం: వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర ప్రాంతంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తాంధ్రమీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరిస్తుందని వాతావరణశాఖ కేంద్రం అధికారులు తెలిపారు. -
నేడూ విస్తారంగా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం రాత్రి నాటికి తెలంగాణ పై భాగంలోనూ, కోస్తాంధ్రను ఆనుకుని స్థిరంగానే ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో (శనివారం రాత్రి 9.30 నుంచి ఆదివారం రాత్రి 9.30 వరకు) రాష్ట్రంలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో దక్షిణ దిశగా ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడనం, ఆవర్తనాల కారణంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత అల్పపీడనం తీరును అంచనా వేయడం సంక్లిష్టంగా ఉందని ఓ అధికారి తెలిపారు. శనివారం రాత్రి నాటికి కాకినాడ, మచిలీపట్నం, విశాఖ, కళింగపట్నం తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడ్డాయన్నారు. గరిష్టస్థాయికి శ్రీశైలం, ప్రకాశం బ్యారేజి సాక్షి నెట్వర్క్: భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టానికి చేరుకుంది. గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, శనివారం సాయంత్రానికి నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 214.8450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాలతో జూరాల, తుంగభద్రల నుంచి శనివారం సాయంత్రానికి 73,350 క్యూసెక్కుల వరదనీరు వ స్తోంది.విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి కూడా భారీగా వరదనీరు వస్తోంది. దీంతో శనివారం సాయంత్రానికి బ్యారేజీకున్న మొత్తం 70 గేట్లు పూర్తిగా ఎత్తివేసి 4.67 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.