సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇక, రానున్న రెండు రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అనంతరం, మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు కానున్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.
తాజాగా విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ సునంద మీడియాతో మాట్లాడుతూ.. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం ప్రధానంగా ఉత్తర కోస్తాపై ఉంటుంది. అక్కడక్కడా చెదురుమొదురు వర్షాలు కురుస్తూ.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.కోస్తా ప్రాంతంలో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. ఈ రెండు రోజుల తర్వాత మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. వర్షాలు పడే ప్రాంతాల్లో గాలుల వేగం కూడా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు.
మరోవైపు.. తెలంగాణలో ఇప్పటికే పలు భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కూడా మంగళవారం పలుచోట్ల వర్షం కురిసింది. రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment