kotam reddy sreedhar reddy
-
కోటంరెడ్డి బ్రదర్స్ కోసం సొంతవాళ్లకే టీడీపీ వెన్నుపోటు.. పాపం అజీజ్!
నమ్మిన వాళ్లను నట్టేట ముంచడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నైజమని టీడీపీలోనే ప్రచారముంది. ఇప్పుడు బయటి నుంచి వచ్చిన వారి కోసం సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. నెల్లూరు జిల్లా టీడీపీలో గందరగోళ పరిస్థితులకు చంద్రబాబు నిర్ణయాలే కారణమని అక్కడి నేతలు వాపోతున్నారు. ఇంతకీ సింహపురి రాజకీయాల్లో కలకలానికి కారణం ఏంటి? తెగేసి చెబుతున్నారట.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన రాకను టీడీపీ జిల్లా అధ్యక్షులు, రూరల్ ఇన్చార్జ్ అబ్దుల్ అజీజ్ తీవ్రంగా వ్యతిరేకించారు. రూరల్‌లో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి.. ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఏకంగా ముఖ్య నాయకుల్నే అజీజ్ ప్రశ్నించారట. అయితే వారు అజీజ్‌ను లైట్ తీసుకోవడంతో.. ప్రత్యర్థిని పార్టీలోకి తీసుకువచ్చి అధిష్టానం తన గొంతు కోసిందని అనుచరుల దగ్గర వాపోతున్నారట. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తి లేదని తెగేసి చెబుతున్నారట. తమ మీద హత్యాయత్నం కేసులు పెట్టించి, బెదిరించిన కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో ఎలా కలిసి పనిచేయాలని పార్టీ పెద్దలను అజీజ్ ప్రశ్నిస్తున్నారట. బాబు మంత్రాంగం అంటే అంతే సంగతి పార్టీ దారుణంగా ఓడిపోయినా నాలుగేళ్ల నుంచి రూరల్ లో పార్టీని బలోపేతం చేస్తున్న తనకు ఒక్క మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని ఎలా తీసుకుంటారని చంద్రబాబు నాయుడు, లోకేష్ పై అజీజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇదే విషయాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పార్ఠీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర దగ్గర ప్రస్తావించారట. అయితే కోటంరెడ్డి సోదరుల రాక తమకు కూడా ఇష్టం లేదని వారు బదులివ్వడంతో అజీజ్ కు ఏం చెయ్యాలో అర్దం కాక సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. కోటంరెడ్డి అధికారాన్ని ఉపయోగించి.. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ప్రతిసారి.. అజీజ్ వారికి అండగా నిలిచేవారు. కొంతకాలం క్రితమే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీతో టచ్‌లోకి వెళ్లారు. వైసీపీ నుంచి టిక్కెట్ రాదని భావించిన ఆయన.. పచ్చ బ్యాచ్ తో చేతులు కలిపారు.. ప్రభుత్వం మీదే అనవసర విమర్శలు చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారని తేలడంతో శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పాపం.. బలిపశువు మరో నాలుగు నెలల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూడా పార్టీలో చేరుతారని.. ముందుగా తన తమ్ముడ్ని టీడీపీలోకి పంపారని రూరల్ లో చర్చ నడుస్తోంది. శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరితే తనకు ఎమ్మెల్యే సీటు రాదని భావిస్తున్న అజీజ్.. అన్నదమ్ముల రాకను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉన్న తనకు మాట కూడా చెప్పకుండా.. గిరిధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. గిరిధర్ రెడ్డికి సహాయ నిరాకరణ చేద్దామని.. తన అనుచరులతో చెబుతున్నారట. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, నెల్లూరు: సీఎం జగన్ టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పార్టీలోనే ఉంటానని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలంతా సీఎం ఫొటోతో గెలిచినవారే.. ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. ‘‘మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి ఏ పార్టీలోనూ టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చంద్రశేఖర్‌రెడ్డి ఓటు వేశాడో లేదో అతని అంతరాత్మకు తెలుసు. తప్పు చేసిన వారిని ప్రశ్నిస్తూనే ఉంటా. పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముగ్గురిలో ఒక్కరు శాసనసభకు వచ్చినా జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడను. ముగ్గురిలో ఒక్కరు గెలిచినా.. రాజకీయాల్లో లేకుండా పోవడమే కాదు. నెల్లూరు జిల్లాకు శాశ్వతంగా దూరమైపోతా. దమ్ముంటే నా సవాల్‌ను స్వీకరించండి’’ అంటూ అనిల్ వ్యాఖ్యానించారు. చదవండి: లోకేష్‌కు ఆ సంగతి తెలిసినా.. తెలియనట్లు నటిస్తున్నారా? -
మానవత్వం చాటుకుంటున్న నేతలు
-
ప్రజల తరఫున నిలదీసే బాధ్యత నాది
నెల్లూరు సిటీ: రోడ్డు పనులు నాణ్యతగా జరగకపోతే ప్రజల తరఫున అధికారులను నిలదీసే బాధ్యత తనదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాగుంటలేఅవుట్‌లో తారురోడ్డు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి అధికారులను నిలదీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూరల్ నియోజకవర్గంలోని భక్తవత్సల్‌నగర్‌లో రోడ్డు నిర్మాణం నాసిరకంగా జరిగిందని ప్రజలు ఫోన్లు, వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యేకు తెలియజేశారు. దీంతో సోమవారం ఆయన ఆ ప్రాంతంలో పరిశీలించారు. ఆయనతో పాటు పబ్లిక్ హెల్త్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ దేవికలు ఉన్నారు. ఈ క్రమంలో పనులు ఏ విధంగా జరిగాయో స్థానికులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తెలియజేశారు. దీంతో బీవీనగర్‌లో రోడ్డు పగుళ్లిచ్చింది వాస్తవమేనని ఈఈ ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.1,100 కోట్లతో భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పథకాల పేరుతో ప్రజల డబ్బును అధికారులు, కాంట్రాక్టర్లు దోచేస్తున్నారని మండిపడ్డారు. బీవీనగర్‌లో రోడ్డు వేసి నెలరోజులు కాకముందే పగుళ్లు వచ్చాయన్నారు. ప్లాట్ వైబరేటర్ను వినియోగించకుండానే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారని తెలిపారు. బయటినుంచి ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి క్యూరిఫై చేయాలన్నారు. అయితే రోడ్డు వేసి ఒక్కరోజు గడవకముందే దానిపైకి ట్యాంకర్లు తీసుకువచ్చి క్యూరిఫై చేస్తే పగుళ్లు రావా అని అధికారులను అడిగారు. ఎమ్మెల్యే రోడ్డుపైకి వస్తే కానీ పనుల్లో నిబంధనలు పాటించాలని తెలియదా అని ప్రశ్నించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా నాసిరకంగా రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నా, అధికారులు స్పందించకపోయినా తనకు ఫోన్ చేస్తే గంట వ్యవధిలో మీముందు ఉంటానని ఎమ్మెల్యే తెలిపారు. స్థానికులు ఆగ్రహం.. అధికారుల పరుగులు బీవీనగర్‌లో స్థానికులు పనుల గురించి ఎమ్మెల్యేకు చెబుతుండగా ఈఈ వెంకటేశ్వర్లు స్థానికులపై బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ‘మీకు ఏం తెలుసు?, నువ్వు చూడలేదు, మీరు నన్ను ప్రశ్నించేది ఏంటి’ అని ఎదురుదాడికి దిగారు. దీంతో పలువురు ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంట్రాక్టర్లకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో పలువురు వెంటపడి అడ్డుకున్నారు. ఈక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి కల్పించుకుని ప్రజలు ప్రశ్నించినప్పుడు సమధానం చెప్పాలని, ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈఈని స్థానికులు పగుళ్లు వచ్చిన రోడ్డుపై కూర్చోబెట్టి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే సైతం రోడ్డుపైనే కూర్చున్నారు. అనంతరం పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మోహన్‌రావుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి పరిస్థితి తెలియజేశారు. ఎస్ఈ కూడా రోడ్డు నిర్మాణ పనులు నాసిరకంగా జరిగాయని తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం నగరంలో లేనని, రేపు వస్తానని, బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తామని, నాణ్యతతో కూడిన రోడ్డును వేస్తామని హామీఇచ్చారు. కాంట్రాక్టర్ జంప్ బీవీనగర్‌లో రోడ్డు పనుల పరిశీలనకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వస్తున్నారని సమాచారం అందుకున్న కాంట్రాక్టర్, సిబ్బంది పనులను నిలిపివేసి వెళ్లిపోయారు. కోటంరెడ్డి ఎక్కడికి పరిశీలనకు వెళ్తున్న విషయం చివరి వరకు గోప్యంగా ఉంచారు. అయినా కొందరు అధికారులు కాంట్రాక్టర్‌కు చెప్పడంతో పనుల విషయంలో నిలదీస్తారని ఆయన జారుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, కార్పొరేషన్ విప్ బొబ్బల శ్రీనివాసులు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్‌కుమార్‌రెడ్డి, నాయకులు మురళీకృష్ణ యాదవ్, మొయిళ్ల సురేష్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, తాళ్లూరు సురేష్‌బాబు పాల్గొన్నారు. -
ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
-
బెదిరింపులకు బెదరొద్దు
నెల్లూరు(వీఆర్సీ సెంటర్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం నుంచి, కాంట్రాక్టర్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, అయినా బెదరవద్దని వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌భవన్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని మరిచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్మికుల పట్ల సానుకూలంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తే కచ్చితంగా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో కూడా కాంట్రాక్ట్ కార్మికుల విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎటువంటి పురోగతిలేదన్నారు. చంద్రబాబును నమ్ముకుంటే అందరికీ ఉద్యోగాలు ఊడిపోతాయని అన్నారు. కడుపు మండి రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేస్తున్న కార్మికులపై యాజమాన్యం కర్కశంగా ప్రవర్తిస్తే తాము వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికులకు రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా, పీస్‌రేట్ రద్దు, క్రమబద్ధీకరణ వంటి డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి చెప్పేది చేయడన్న అపవాదును తొలగించుకోవాలని తెలిపారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు వైఎస్సార్సీపీ శ్రేణులు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యవేదిక నాయకులు పతంజలి, కృష్ణ, జీవీ శివయ్య, శరత్, సుమన్, బాబు, ఇంతియాజ్, సంజయ్‌లతోపాటు 1100 మంది విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. -
'నేను అనని మాటలను కూడా నివేదికలో పెట్టారు'
హైదరాబాద్: తాను అసెంబ్లీలో అనని మాటలను కూడా బుద్ధప్రసాద్ కమిటీ నివేదికలో పొందుపరచడంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హక్కుల కమిటీ భేటీ అయ్యింది. ఈ విచారణకు నోటీసులు అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. సభా హక్కుల కమిటీకి హాజరైన అనంతరం చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు మనసుకు బాధకలిగించాయన్నారు. కమిటీ నివేదికలో ఉన్న మాటలు, ఆడియో, వీడియోల్లో లేవని..ఆ అంశాన్ని కమిటీకి నివేదించినట్లు చెప్పారు. తాను కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుడిని..25 ఏళ్లుగా వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం ఉందని... చట్టసభలను, న్యాయవ్యవస్ధను గౌరవిస్తానని చెవిరెడ్డి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారు. అధికార పక్షం సంయమనం పాటిస్తే ప్రతిపక్షాలు కూడా సంయమనం పాటిస్తాయన్న విషయాన్ని సభా హక్కుల కమిటీకి వెల్లడించినట్లు చెప్పారు. మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'సభలో నేను ఎప్పుడూ అసభ్యపదజాలం వాడలేదు. ఒక వేళ అసభ్యపదజాలం వాడినట్లు నిరూపిస్తే కమిటీ తీసుకునే చర్యలకు కట్టుబడి ఉంటానని' చెప్పారు. అస్వస్థత కారణంగా ఎమ్మెల్యే రోజా ఈ విచారణకు హాజరుకాలేకపోయారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు కమిటీకి వెల్లడించినట్లు తెలిపారు.