రైలు కిందపడి వ్యక్తి మృతి
ఒంగోలు : రైలు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కంభం రైల్వేస్టేషన్లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముండే కె. కోటేశ్వరరెడ్డి (39) ఈ రోజు రైలు కిందపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోటేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక పట్టాలు దాటుతుండగా.. ఈ దుర్ఘటన చోటు చేసుకుందా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.