koteswaramma died
-
మాంటిస్సోరి కోటేశ్వరమ్మ కన్నుమూత
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడ మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు, అభ్యుదయవాది, స్త్రీ విద్య, మహిళా సాధికారతకు విశేష కృషి చేసిన డాక్టర్ వి.కోటేశ్వరమ్మ (94) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడ సమీపంలోని గోశాలలో కోనేరు వెంకయ్య, మీనాక్షి దంపతులకు 1925, మార్చి 5న కోటేశ్వరమ్మ జన్మించారు. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ చేసి నెల్లూరు, విజయవాడల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. మహిళలు చదువుకుంటేనే పురుషులతో సమానంగా రాణిస్తారన్న నమ్మకంతో 1955లో చిల్డ్రన్స్ మాంటిస్సోరి స్కూల్‌ను స్థాపించారు. ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను ఒప్పించి మరీ బాలికలను పాఠశాలలో చేర్పించేవారు. పది మందితో ప్రారంభమైన ఆ పాఠశాల క్రమంగా ప్రా«థమికోన్నత, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలుగా ఎదిగింది. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎడ్యుకేషన్, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ వంటి కోర్సులూ ప్రారంభమయ్యాయి. ఆమె విద్యా సంస్థల్లో చదివిన లక్షలాది మంది మహిళలు దేశ, విదేశాల్లో ఉన్నత స్థితిలో ఉన్నారు. తన సేవలకు గుర్తింపుగా కోటేశ్వరమ్మ పలు అవార్డులు పొందారు. 1971లో బెస్ట్ టీచర్‌గా జాతీయ స్థాయి అవార్డు, 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మహిళా విద్యా సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు 2015లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం పొందారు. కాగా.. కోటేశ్వరమ్మ భర్త వి.వి.కృష్ణారావు ఆంధ్రా లయోలా కళాశాల అధ్యాపకులుగా పనిచేశారు. ఆయన కొన్నేళ్ల కిందట మృతి చెందారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె డాక్టర్ శశిబాల విజయవాడలోనే ప్రసూతి వైద్యురాలిగా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె షీలారంజని అమెరికాలో ఉంటున్నారు. ప్రస్తుతం మాంటిస్సోరి విద్యా సంస్థలను మనుమడు అవిరినేని రాజీవ్ నిర్వహిస్తున్నారు. -
జనార్దనపురంలో విషాదం
నందివాడ (గుడివాడ): పీపుల్స్‌వార్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కొండపల్లి సీతారామయ్య (కేఎస్) సతీమణి కోటేశ్వరమ్మ (99) విశాఖపట్నంలో కన్నుమూశారు. వారం రోజుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం ఉదయం మనుమరాళ్లయిన అనురాధ, సుధ ఇంటి వద్ద కోటేశ్వరమ్మ తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి చెందిన విషయం తెలుసుకున్న జనార్దనపురం గ్రామస్తులు విషాదంలో మునిగారు. మండలంలోని జనార్దనపురం గ్రామానికి చెందిన సీతారామయ్యకు కమ్యూనిస్టు భావాలు ఉండటంతో వంగపాటి రంగారెడ్డి ఆధ్వర్యంలో సీతారామయ్య 1933లో కమ్యూనిస్టు పార్టీలో చేశారు. పామర్రుకు చెందిన కోటేశ్వరమ్మను 1939లో ఆదర్శ వివాహం చేసుకున్నారు. వంగపాటి రంగారెడ్డి రక్షణలో కోటేశ్వరమ్మ రెండు సంవత్సరాల పాటు జనార్దనపురంలోనే కాపురం ఉన్నారు. వారికి అప్పుడే చంద్రశేఖర్‌రెడ్డి, కరుణ జన్మించారు. జనార్దనపురం విడిచి.... సీతారామయ్య కొద్దికాలనికే జనార్దనపురం గ్రామం విడిచి కరీంనగర్ వెళ్లిపోయారు. ఆయనతో పాటు కోటశ్వరమ్మ తన బిడ్డలతో కలిసి వెళ్లిపోయారు. అనంతరం కొంతకాలనికి సీతారామయ్య కమ్యూనిస్టు పార్టీతో విభేదించి పీపుల్స్‌వార్‌ను స్థాపించి అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌లో సీతారామయ్య చురుగా పని చేస్తున్న సమయంలో పోలీసులు సీతారామయ్య కుమారుడు చందును ఎన్కౌంటర్ పేరుతో బలితీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కోటేశ్వరమ్మ తీవ్ర మనోవేదనకు గురైయింది. దీంతో డాక్టర్ చదువుతున్న కుమార్తె కరుణకు వెంటనే వివాహం చేసింది. కుమారుడు చనిపోవటం, భర్త నక్సల్స్ ఉద్యమంల్లో ఉండటం, కుమార్తెకు వివాహం కావటంతో ఒక్కసారి కోటేశ్వరమ్మ ఒంటరి అయిపోయింది. దీంతో హైదరాబాద్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ వారు కోటేశ్వరమ్మను చేరదీశారు. కొంత కాలనికి సీతారామయ్య, కుమార్తె కరుణ కూడా మృతి చెందారు. కరుణకు కుమార్తెలు అనురాధ, సుధ మాత్రం తమ అమ్మమ్మను ఫౌండేషన్ నుంచి సొంత ఊరైన విశాఖపట్నం తీసుకువెళ్లారు. గత ఆగస్టు 5 వ తేదీన కోటేశ్వరమ్మ నూరో పుట్టినరోజు ఉత్సవం కూడా ముందుగానే జరుపుకున్నారు. నెల కూడా గడవకముందే ఇలా మృతి చెందటం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘ నాయకురాలు... భర్త సీతారామయ్య నక్సల్స్ ఉద్యమంలో ఉన్న సమయంలో కోటేశ్వరమ్మ మహిళ సంఘాల నాయకురాలుగా అనేక విప్లవ వ్యాసలు రాశారు. నిర్జనవారధి అనే పుస్తకం ఇప్పటికి ఎవరు మరచిపోరు. ఈ పుస్తకంలో విప్లవకారుల బాధలు, వారి కుటుంబసభ్యులు పడుతున్న అవస్థలు వంటి అంశాలను పొందుపరిచారు. అప్పట్లో ఈ పుస్తకం చాలా బాగా అమ్ముడైన్నట్లు పలువురు నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా నక్సల్స్ కుటుంబాలలో మహిళలు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టిన్నట్లు కోటేశ్వరమ్మ చూపించారని చెప్పుకుంటారు. కోటేశ్వరమ్మ మృతికి ఇస్కఫ్ సంతాపం మధురానగర్ (విజయవాడ సెంట్రల్): ప్రముఖ సంఘసేవకురాలు, అభ్యుదయ, ప్రగతి శీల మహిళా నేత నూరేళ్ళ వనిత కొండపల్లి కోటేశ్వరమ్మ మృతి పట్ల భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ( ఇస్కఫ్) జాతీయ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు బుధవారం ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. కొండపల్లి కోటేశ్వరమ్మ ప్రజాతంత్ర, ప్రగతిశీల మహిళా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనటమే కాకుండా సమాజ మార్పునకు మహిళలు ముందుండాలని భావించారని సుబ్బరాజు పేర్కొన్నారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో జరిగిన నాటి ఇస్కస్, శాంతి ఉద్యమాలతో పాటు ఈనాటి ఇస్కఫ్ కార్యక్రమాలలో కూడా కోటేశ్వరమ్మ చురుగ్గా పాల్గొన్నారన్నారు. పరిపూర్ణ జీవితం గడిపిన ఆమె జీవితం యువ మహిళలకు స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. -
‘మా అమ్మను ఆ ముగ్గురే చంపారు’
పెద కూరపాడు(గుంటూరు): మా అమ్మను ముగ్గురు వ్యక్తులు చంపారంటూ ఆమె కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఓ మహిళను ఆమె భర్త, అత్తమామలు కలసి ఉరేసి చంపారు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే, ఆమె కుమారుడు నిజం చెప్పటంతో దారుణం వెలుగుచూసింది. వివరాలివీ.. రొంపిచర్ల మండలం వడ్లమూడివారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరమ్మకు పెదకూరపాడుకు చెందిన తమ్మిశెట్టి రంగతో పదకొండేళ్ల క్రితం వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే కోటేశ్వరమ్మను భర్త రంగతోపాటు అత్తమామలు శాంతి, వెంకటేశ్వర్లు శనివారం కొట్టి చంపారు. అనంతరం ఇంట్లోనే ఉరివేసి, ఆత్మహత్య చేసుకుందని అందరికీ చెప్పసాగారు. అయితే, కోటేశ్వరమ్మ కుమారుడు మాత్రం.. తన తల్లిని ఆ ముగ్గురూ కలసి కొట్టి చంపారని పోలీసుల ఎదుట వెల్లడించే సరికి అసలు విషయం వెలుగుచూసింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ ప్రారంభించగా వారు నేరం అంగీకరించారు. వారిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.