Kothapalli village
-
నాపై దాడి చేసింది టీడీపీ నేతలే: ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్
సాక్షి, ఏలూరు: జి.కొత్తపల్లిలో తనపై టీడీపీ నేతలే దాడికి ప్రయత్నించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తెలిపారు. వైఎస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ను హత్య చేశారని తెలిసి తాను అక్కడికి వెళ్లగానే టీడీపీ నాయకులు, కొత్త వ్యక్తులతో కలిసి మూకుమ్మడిగా దాడి చేయబోయారని వివరించారు. ఎవరి ప్రోద్బలంతో ఈ దాడులకు పాల్పడ్డారో పోలీసులు తేల్చాలన్నారు. చదవండి: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత -
గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి.. స్పందించిన హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: ఎండాడలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే దిశ యాప్, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: AP: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత మహిళలపై దాడులను సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వారే దాడులు చేసి వారే తిరిగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన టీడీపీ నేత పై కేసు నమోదు చేశామన్నారు... జి.కొత్తపల్లి ఘటనపై స్పందిస్తూ.. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడిపై ఆమె స్పందిస్తూ.. ఎమ్మెల్యేపై జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నానన్నారు. ఇప్పటికే తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని.. దాడి ఎందుకు జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేపై దాడి జరిగిందన్నారు. -
AP: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, ఏలూరు: ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో వైఎస్ఆర్సీపీ నేత దారుణ హత్యకు గురికాగా, పరామర్శకు వెళ్లిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై ప్రత్యర్థి వర్గం దాడికి యత్నించింది. జి. కొత్తపల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌పై కొందరు దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ చేరుకోగా, ప్రత్యర్థి వర్గం ఎమ్మెల్యేపై ఒక్కసారిగా దాడికి యత్నించింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను రక్షించేందుకు ప్రయత్నించిన పోలీసులపైనా రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో వలయంగా ఏర్పడి.. ఎమ్మెల్యేను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత కారణాలా? ఆస్తి వివాదాలా? లేదంటే రాజకీయ వైరంతోనే గంజి ప్రసాద్‌ను హత్య చేశారా? అనే కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. -
సర్పంచిని చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
ఐ.పోలవరం (ముమ్మిడివరం) : మండలంలోని టి.కొత్తపల్లి గ్రామ సర్పంచి వత్సవాయి రామకృష్ణంరాజు వికృత చేష్టలకు పాల్పడడంతో గ్రామస్తులు అతడిని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఆ గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం సర్పంచి మంగళవారం రాత్రి ఎదుర్లంక నుంచి టి.కొత్తపల్లి వచ్చేందుకు ఆటోలో వస్తుండగా పాత యింజరం సమీపంలో ఆటోను ఆపి డ్రైవర్‌ను దుర్భాషలాడి, ‘బాహుబలి’ని అంటూ ఆటోను బోల్తా కొట్టించాడు. దీంతో భయపడిన ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడినుంచి మోటారు సైకిల్‌పై సీతమ్మ చెరువు సమీపంలో నిర్వహిస్తున్న జాతరలోకి వెళ్లి అక్కడ సినిమా వేస్తున్న స్క్రీన్‌ను చింపేశాడు. అక్కడి మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న అతడిని స్థానికులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ సర్పంచికి మతిస్థిమితం లేదంటూ గ్రామస్తులు అర్ధరాత్రి అక్కడి చెట్టుకు అతడిని కట్టేసి పోలీసులకు సమాచారం తెలియజేశారు. బుధవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి సర్పంచిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్సై టి.క్రాంతికుమార్ మాట్లాడుతూ సర్పంచికి వైద్య పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాక గతంలో ఈ సర్పంచి.. పంచాయితీ కార్యదర్శిని చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.