మేఘనా ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు
హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న హైటెక్ బస్సులో గురువారం ఉదయం ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్‌కు బస్సు చేరుకోగానే పోగలు వచ్చాయి. దాంతో హైటెక్ బస్సులోని ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. డ్రైవర్ వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. దాంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బస్సులో మంటలు రాకుండా అదుపు చేశారు.
అనంతరం బస్సులో పొగలు వ్యాపించడానికి గల కారణంపై అగ్నిమాపక శాఖ సిబ్బంది దృష్టి సారించింది. హైటెక్ బస్సులోని యాసిడ్ సీసా పగలడం వల్ల పొగలు వ్యాపించాయని శాఖ సిబ్బంది గుర్తించారు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.