kotta srinivasareddy
-
ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న కేసీఆర్
చట్టప్రకారం భూసేకరణ చేపట్టాలి ప్రశ్నిస్తే లాఠీచార్జి చేస్తారా? బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి హుస్నాబాద్‌రూరల్ : బతుకులు బాగుపడతాయని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారనిబీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా శుక్రవారం రైతు భరోసాయాత్ర చేపట్టారు. ముంపుప్రాంతాలను పరిశీలించారు. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను న్యాయాస్థానాలు తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడైన భూనిర్వాసితులను ఆదుకునేందుకు 2013 భూసేకరణ చట్టం ఉందని గుర్తు చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం బోగస్ జీవో 123ను తెచ్చి రైతుల నుంచి భూములు లాక్కోవాలని చూసిందన్నారు. 123 జీవోపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చిన ఐదేళ్లలోపు పరిహారం పూర్తిగా చెల్లించకపోతే రీనోటిఫికేషన్ వేసి కొత్త చట్టం ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. అయితే గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల నోటిఫికేషన్ ఇచ్చి ఏడేళ్లు గడుస్తున్నా పరిహారం పూర్తిగా చెల్లించకపోవడంతో రీనోటిఫికేషన్ వేయాలన్నారు. దీనిపై కోర్టుకు వెళ్లి రైతులకు న్యాయం చేసేందుకు బీజేపీ పోరాడుతుందన్నారు. కేంద్రం పేదల కోసం 90 వేల గహాలు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కనీసం వెయ్యి ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. సర్పంచులు వివేకానంద్, యాదమ్మసంపత్, బీజేపీ రాష్ట్ర నాయకుడు నారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షురాలు లక్కిరెడ్డి తిరుమల, సాయిని మల్లేశం, మండలాధ్యక్షుడు నాగిరెడ్డి జయపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అనిల్,నాయకులు శ్యాంసుందర్‌రెడ్డి,భగవాన్‌రెడ్డి,వేణుగోపాల్‌రెడ్డి,వేణుగోపాల్‌రావు,మనోహర్‌రావు, కిషన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, కర్ర సంజీవ్‌రెడ్డి, లింగారెడ్డి, శంకర్, సతీష్, భూనిర్వాసితులు దొడ్ల మల్లారెడ్డి, రమేశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం
7న ప్రధాని సభను విజయవంతం చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తిమ్మాపూర్: ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎల్ఎండీ కాలనీలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు కేంద్రం తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తగ్గించిన ధరలను రైతులకు అందుబాటులోకి తేవడంలేదన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీ బాధ్యులను పీడీ చట్టం కింద శిక్షించాలని, విద్య, వైద్య శాఖల మంత్రులను బర్తరఫ్ చేయాలనిడిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎల్లంపల్లి నీటిని జిల్లాకు ఇవ్వకుండా హైదరాబాద్, గజ్వేల్‌కు, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్తే పంప్‌హౌస్‌లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టుల పేరుతో నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 5న గౌరవెళ్లిలో బీజేపీ భరోసాయాత్ర చేపడుతామన్నారు. నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు గుర్రాల వెంకటరెడ్డి, కరివేద మహిపాల్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డి, ఏలేటి చంద్రారెడ్డి, గాజుల స్వప్న, తమ్మిశెట్టి మల్లయ్య, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, అంజిరెడ్డి, బి.శ్రీనివాస్, శంకర్, డి.శ్రీనివాస్, సమ్మిరెడ్డి, వేణు పాల్గొన్నారు. -
‘నైజాంను మరిపిస్తున్న కేసీఆర్’
ముకరంపుర: సీఎం కేసీఆర్ పాలన నైజాం, రజాకార్లను మరిపిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. జైల్లో పెటై్టనా ప్రాజెక్టులు కడుతామని మంత్రులు పేర్కొనడం దౌర్జన్య పాలనకు నిదర్శనమన్నారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గురువారం విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్, గౌరవెల్లి, గండిపల్లిలో ఇష్టారీతిన భూసేకరణ చేపడుతున్నారని, నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలన్నారు. ఎంసెట్ –2 పేపర్ లీకేజీకి ప్రభుత్వమే బాద్యత వహించాలన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు శుక్రవారం బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని కరీంనగర్‌లోనిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మీస అర్జున్‌రావు, న్యాలకొండ నారాయణ రెడ్డి, ఆదికేశవరావు, చింతల లింగారెడ్డి, పటేల్ దేవేందర్‌రెడ్డి, పెండ్యాల సాయికృష్ణరెడ్డి, వెంకట్‌రెడ్డి, నాగరాజు, శ్రీనాథ్, రంజిత్‌రెడ్డి, నాగేశ్వర్ గాజుల స్వప్న, అయిల ప్రసన్న, గంట సుశీల పాల్గొన్నారు.