- 7న ప్రధాని సభను విజయవంతం చేయాలి
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతాం
Published Wed, Aug 3 2016 10:40 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
తిమ్మాపూర్: ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎల్‌ఎండీ కాలనీలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు కేంద్రం తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తగ్గించిన ధరలను రైతులకు అందుబాటులోకి తేవడంలేదన్నారు. ఎంసెట్ పేపర్ లీకేజీ బాధ్యులను పీడీ చట్టం కింద శిక్షించాలని, విద్య, వైద్య శాఖల మంత్రులను బర్తరఫ్ చేయాలనిడిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎల్లంపల్లి నీటిని జిల్లాకు ఇవ్వకుండా హైదరాబాద్, గజ్వేల్‌కు, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్తే పంప్‌హౌస్‌లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టుల పేరుతో నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 5న గౌరవెళ్లిలో బీజేపీ భరోసాయాత్ర చేపడుతామన్నారు. నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించే సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు గుర్రాల వెంకటరెడ్డి, కరివేద మహిపాల్‌రెడ్డి, చాడ వెంకటరెడ్డి, ఏలేటి చంద్రారెడ్డి, గాజుల స్వప్న, తమ్మిశెట్టి మల్లయ్య, ఇనుకొండ నాగేశ్వర్‌రెడ్డి, అంజిరెడ్డి, బి.శ్రీనివాస్, శంకర్, డి.శ్రీనివాస్, సమ్మిరెడ్డి, వేణు పాల్గొన్నారు.
Advertisement
Advertisement