KP oli
-
నేపాల్ పార్లమెంట్ రద్దు..
ఖాట్మాండు:నేపాల్ పార్లమెంట్‌ను ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి రద్దు చేశారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికల తేదీలను ప్రకటించారు. నవంబర్ 12, 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి ముందు శుక్రవారం సాయంత్రంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాల్సిందిగా ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలికి, ప్రతిపక్షాలకు ఆ దేశ అధ్యక్షురాలు బిద్యాదేవి గడువు ఇచ్చారు. ఇరు పక్షాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విఫలం కావడంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు విద్యాదేవి భండారి శనివారం ప్రకటించారు. దీంతో మొదటి దశ ఎన్నికలు నవంబర్ 12న, రెండో దశ ఎన్నికలు 19 జరగనున్నాయి. తనకు 153 మంది సభ్యలు మద్దతు ఉందంటూ ప్రధాని మంత్రి కేపీ శర్మ ఓలి ప్రకటించారు.తనకు 121 మంది సభ్యులతో పాటు, జేఎస్‌పీఎన్‌కు చెందిన మరో 32 మంది సభ్యుల మద్దతు ఉందని పేర్కొన్నారు. బలాన్ని సభలో రుజువు చేసుకోలేకపోవడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది.అయితే కేపీ శర్మ ఓలి బలాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో ప్రతిపక్షాలను ప్రభుత్వం ఏర్పా టు చేయాల్సిందిగా అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.అయితే ప్రతిపక్షాలు సంకీర్ణ కూటమి ఏర్పాటు చేయడంలో విఫలం చెందాయి . నేపాల్ పార్లమెంట్లో 275 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది మద్దతు అవసరం. -
నేపాల్ ప్రధాని ఓలి బహిష్కరణ
కఠ్మాండూ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి బహిష్కరిస్తూ మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్ దహల్) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం ఆదివారం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో, పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ఓలిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పార్టీ సీనియర్ నేత గణేశ్ షా వెల్లడించారు. ఓలిని పార్టీ సహ అధ్యక్ష పదవి నుంచి కూడా డిసెంబర్ నెలలో తొలగిం చిన విషయం తెలిసిందే. ప్రచండతో పాటు, ఆయనకు సన్నిహితుడైన మాధవ్ నేపాల్‌ను ఆ స్థానంలో నియమించారు. ప్రచండ వర్గం ఆధిపత్యం ఉన్న స్టాండింగ్ కమిటీ జనవరి 15న పార్టీ వ్యతిరేక కార్యకలాపాల విషయంపై ఓలిని వివరణ కోరింది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నామని గణేశ్ షా తెలిపారు. -
చిక్కుల్లో ఓలీ.. ప్రధాని పదవికి ఎసరు!
కఠ్మాండు: నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ ఓలీకి అన్ని దారులూ మూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన పనితీరును సమీక్షించడానికి శనివారం మధ్యాహ్నం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ) తొమ్మిది మంది సభ్యుల కార్యవర్గం సమావేశం కానుంది. (హెచ్1బీ వీసా: వారికి భారీ ఊరట) శుక్రవారం జరిగిన ఎన్సీపీ మీటింగ్‌లో ఓలీ కూడా పాల్గొన్నారు. తన వ్యాఖ్యలను, చర్యలను మీటింగ్‌లో సమర్ధించుకున్న ఆయన కార్యవర్గానికి తనపై కరుణ కలిగేలా ప్రవర్తించినట్లు సమాచారం. దీనివల్ల మరికొంత కాలం ప్రధానిగా కొనసాగొచ్చని ఆయన భావించారు. (ట్రంప్ సర్కార్‌పై ఫేస్బుక్ సీఈఓ ఆరోపణలు) శనివారం జరగనున్న సమావేశంలో ఆయనపై వేటు పడకపోయినా, ఆదివారం జరగనున్న స్టాండింగ్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. చైనాతో సంబంధాల కోసం ఇండియాతో ఉన్న అనుబంధాన్ని బద్దలు కొట్టిన ఓలీని పార్టీ అధ్యక్ష పదవికి పరిమితం చేయాలని, లేకపోతే దానికీ అవకాశం ఇవ్వకూడదని స్టాండింగ్ కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్సీపీ కార్గవర్గం, స్టాండింగ్, సెంట్రల్ కమిటీల్లో ఓలీ మద్దతుదారుల సంఖ్య తక్కువగా ఉంది. -
నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం
-
నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం
అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి ముందే ప్రధాని పదవికి కేపీ ఓలి రాజీనామా.. కొత్త ప్రధానిగా ప్రచండ! కఠ్మాండు : నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ముందే ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి కేపీ ఓలి(64) తన పదవికి రాజీనామా చేశారు. ఓలి గత ఏడాది అక్టోబర్‌లో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. గత పదేళ్లలో ఓలి ప్రభుత్వం ఎనిమిదోది. సంకీర్ణ ప్రభుత్వానికి మావోయిస్టులు మద్దతు ఉపసంహరించడంతో ఓలి అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కూటమిలోని మధేసి పీపుల్స్ రైట్స్ ఫోరమ్, డెమోక్రటిక్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు ఓలి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ నేపాలీ కాంగ్రెస్(ఎన్సీ), మావోయిస్ట్ సెంటర్(సీపీఎన్) ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వడంతో ఓలి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం పార్లమెంటులో ఓలి ప్రసంగిస్తూ ‘‘పార్లమెంట్ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు అవకాశం ఇవ్వాలనుకున్నాను. రాజీనామాను అధ్యక్షుడికి అందజేశాన’ని తెలిపారు. దేశాన్ని ప్రయోగశాలగా మార్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు. కొత్త రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తన ప్రభుత్వాన్ని కూలదోశారని, దీనికి దేశం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ఏడాది సంభవించిన భూకంపం.. ఇతర ఇబ్బందుల నుంచి దేశం కుదుటపడుతున్న సమయంలో పదవి నుంచి వైదొలగాల్సి రావడం బాధ కలిగిస్తోందని చెప్పారు. మంచి పనులు చేస్తున్నందునేఈ విధంగా శిక్షించారని ఆరోపించారు. తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి భారత్‌తో నేపాల్ సంబంధాలు బలహీనంగా ఉన్నాయని, వాటిని పునరుద్ధరించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేశానని చెప్పారు. తన చర్యల కారణంగా ఏదో ఒక దేశంపై నేపాల్ ఆర్థికంగా ఆధారపడకుండా పరిస్థితులు మారాయని, దేశం, ప్రజల శ్రేయస్సు కోసమే పొరుగుదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశానని చెప్పారు. అవిశ్వాస తీర్మానం అనేది చూసేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో కనిపిస్తున్నా.. దాని సారం మాత్రం కుట్రపూరితమైనదని ఆరోపించారు. కాగా, ఓలి స్థానంలో మావోయిస్టు చీఫ్ ప్రచండ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. -
నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ