
కఠ్మాండు: నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ ఓలీకి అన్ని దారులూ మూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన పనితీరును సమీక్షించడానికి శనివారం మధ్యాహ్నం నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్సీపీ) తొమ్మిది మంది సభ్యుల కార్యవర్గం సమావేశం కానుంది. (హెచ్1బీ వీసా: వారికి భారీ ఊరట)
శుక్రవారం జరిగిన ఎన్సీపీ మీటింగ్‌లో ఓలీ కూడా పాల్గొన్నారు. తన వ్యాఖ్యలను, చర్యలను మీటింగ్‌లో సమర్ధించుకున్న ఆయన కార్యవర్గానికి తనపై కరుణ కలిగేలా ప్రవర్తించినట్లు సమాచారం. దీనివల్ల మరికొంత కాలం ప్రధానిగా కొనసాగొచ్చని ఆయన భావించారు. (ట్రంప్ సర్కార్‌పై ఫేస్‌బుక్ సీఈఓ ఆరోపణలు)
శనివారం జరగనున్న సమావేశంలో ఆయనపై వేటు పడకపోయినా, ఆదివారం జరగనున్న స్టాండింగ్ కమిటీ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు. చైనాతో సంబంధాల కోసం ఇండియాతో ఉన్న అనుబంధాన్ని బద్దలు కొట్టిన ఓలీని పార్టీ అధ్యక్ష పదవికి పరిమితం చేయాలని, లేకపోతే దానికీ అవకాశం ఇవ్వకూడదని స్టాండింగ్ కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎన్సీపీ కార్గవర్గం, స్టాండింగ్, సెంట్రల్ కమిటీల్లో ఓలీ మద్దతుదారుల సంఖ్య తక్కువగా ఉంది.