KPCL
-
కృష్ణపట్నం పోర్టులో అదానీ పాగా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో అతిపెద్ద మల్టీపోర్ట్ ఆపరేటర్ అయిన అదానీ గ్రూప్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్.. కృష్ణపట్నం పోర్ట్ కంపెనీలో (కేపీసీఎల్) 75 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కేపీసీఎల్‌ను ప్రమోట్ చేస్తున్న సీవీఆర్ గ్రూప్ నుంచి ఈ వాటాను దక్కించుకుంటోంది. కేపీసీఎల్‌ను రూ.13,572 కోట్లుగా విలువ కట్టారు. డీల్ అనంతరం మిగిలిన 25 శాతం వాటా కేపీసీఎల్ చేతిలోనే ఉంటుంది. మల్టీ కార్గో ఫెసిలిటీ కలిగిన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు ద్వారా 2018–19లో 5.4 కోట్ల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగింది. దీనిని ఏడేళ్లలో 10 కోట్ల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకు వెళ్లాలని అదానీ పోర్ట్స్ భావిస్తోంది. కృష్ణపట్నం పోర్టు గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,394 కోట్ల టర్నోవర్ సాధించింది. తూర్పు తీరంలో అదానీకి ఇది అయిదవది కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొదటిది. కాగా, 2025 నాటికి 40 కోట్ల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా స్థాయికి చేరాలన్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లక్ష్యానికి ఈ కొనుగోలు దోహదం చేయనుంది. తాజా డీల్‌తో దేశంలో పోర్టుల వ్యాపారంలో తమ సంస్థ వాటా ప్రస్తుతమున్న 22 నుంచి 27%కి చేరుతుందని అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్త విస్తరణలో ఇది తమకు విలువ చేకూరుస్తుందని చెప్పారు. 120 రోజుల్లో ఈ లావాదేవీని పూర్తి చేస్తారు. -
కర్ణాటకకు సింగరేణి బొగ్గు
ఈ ఏడాది 80 లక్షల టన్నుల సరఫరా - కేపీసీఎల్‌తో సింగరేణి సంస్థ ఒప్పందం సాక్షి, హైదరాబాద్: కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి 80 లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేయనుంది. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్లో సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్, కేపీసీఎల్ ఎండీ కుమార్ నాయక్‌ల సమక్షంలో రెండు సంస్థల ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంత కాలు చేశారు. దీని ప్రకారం సింగరేణి కర్ణాటకలోని రాయచూర్‌లోని కేపీసీఎల్‌కు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది 30 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయ నుంది. కేపీసీఎల్ ఇటీవల ఎర్రమారస్‌లో నిర్మించిన మరో థర్మల్ విద్యుత్ కేంద్రానికి 20 లక్షల టన్నులు, బళ్లారిలోని బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 31 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనుంది. ఇదిలా ఉండగా, సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గును సకాలంలో అందజేయడంతో తమకు విద్యుదుత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్ఎఫ్) మెరుగుపడిం దని కేపీసీఎల్ ఎండీ.కుమార్‌నాయక్ అన్నారు. 32 శాతం కన్నా తక్కువ తేమ గల బొగ్గును సింగరేణి అందించేందుకు చొరవ తీసుకుం టోందన్నారు. రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రం పదేళ్లలో ఎన్నడూ సాధించని విధంగా గతేడాది 77 శాతం పీఎల్ఎఫ్ సాధించిందని, ఈ ఘనత సింగరేణికే దక్కుతుందన్నారు. ఈ కారణంగానే సింగరేణిపై విశ్వాసం ఉంచుతూ ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. లక్ష్యానికి మించి బొగ్గు డిమాండ్.. సింగరేణి సంస్థ ఈ ఏడాది 660 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్న ప్పటికీ డిమాండ్ 800 లక్షల టన్నుల వరకు ఉందని సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. అయినా ఈ ఏడాది కర్ణాటకకు బొగ్గు సరఫరా చేస్తామన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలతో పాటు కోలిండియా పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సైతం బొగ్గును సరఫరా చేస్తున్నా మన్నారు. నాణ్యమైన బొగ్గును సకాలంలో అందిస్తుండడంతో సింగరేణి బొగ్గుకు డిమాండ్ మరింత పెరిగిందన్నారు.