krishna patnam
-
నెల్లూరు: కృష్ణపట్నం సమీపంలో బోటులో చెలరేగిన మంటలు
-
‘కంటిలో డ్రాప్స్.. ఆయుర్వేదంలో ఓ ప్రక్రియ’
-
ఆనందయ్య కరోనా మందు: ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్
-
కృష్ణపట్నం రైల్వేలైన్‌కు పచ్చజెండా
కృష్ణపట్నం (వెంకటాచలం)–ఓబులవారిపల్లె కొత్త రైలుమార్గం పూర్తి కావడానికి దశాబ్దన్నర కాలంపట్టింది. ఈలైను నిర్మాణం ముగింపుదశలో ఉంది.నెల్లూరు వైపు వెలుగొండల్లో నిర్మితమవుతున్న (6.5కి.మీ) టన్నెల పూర్తిఅయితే అంతాసిద్ధమైనట్లే. ఈనెల 21న లాంఛనంగా ఉపరాష్ట్రపతి చేతులమీదుగా ప్రారంభించేందుకు రైల్వేఅధికారులు ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట : దక్షిణమధ్య రైల్వే రవాణా సదుపాయం కల్పిస్తున్న ఓడరేవుల్లో ముఖ్యమైనది కృష్ణపట్నం ఓడరేవు. జోన్ నుంచి రవాణా అయ్యే సరుకు రవాణాల్లో గణనీయభాగం ఈ పోర్ట్ నుంచి జరుగుతోంది. ప్ర స్తుతం కృష్ణపట్నం పోర్ట్ విజయవాడ–గుంటూరు–గుడూరు ప్రధాన రైలుమార్గంలోని వెంకటాచలం స్టే షన్ వద్ద అనుసంధానమైంది. వెంకటాచలం నుంచి ఓబులవారిపల్లెని కలుపుతూ చెన్నై–హౌరా, చెన్నై– ముంబాయి రైలుమార్గాలకు దగ్గరి దారిగా ఉంది. ఉపరాష్ట్రపతి మానస పుత్రిక ఈలైను ఉపరాష్ట్రపతి మానస పుత్రిక అయిన ఈ రైల్వేలైన్‌ను ఆయన లాంఛనంగా త్వరలో ప్రారంభించనున్నారు. గతంలో ఎన్డీఏ హయాంలో ఈలైను మంజూరుకు తన హోదాలో కృషి చేశారు. ఈ మేరకు నెల్లూరు రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వేమంత్రిత్వ శాఖ సన్నహాలు చేస్తున్నారు. ఈనెల 21న ఈ మార్గం ప్రారంభోత్సవానికి సంబంధించి శిలాఫలకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. రెండు మెయిన్లైన్లకు అనుసంధానం కృష్ణపట్నం పోర్ట్ –వెంకటాచలం–ఓబులవారిపల్లె కొత్త రైలుమార్గం ప్రాజెక్టు రెండు ప్రధానరైలు మార్గాల మధ్య అనుసంధానమై గుంతకల్ డివిజన్ నుంచి కృష్ణపట్నం వచ్చే రైళ్లకు 72 కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. ఓబులవారిపల్లె–రేణిగుంట–గుడూరు సెక్షన్లో రద్దీకూడా తగ్గనుంది. ప్రస్తుత కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టులో వెంకటాచలం రోడ్ జంక్షన్–వెలికల్లు మధ్య (60కిమీ), చెర్లోపల్లె–వెలికల్లు మధ్య 7కిమీ అడవిలో సొరంగం పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులు పూర్తియితే కృష్ణపట్నం–వెంకటాచలం–ఓబులవారిపల్లె కొత్త రైలుమార్గంలో రైళ్లను నడపడానికి వీలవుతోంది. వైఎస్సార్‌తోనే సకాలంలోరైల్వేలైన్ భూసేకరణ దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి వల్లనే ఓబులవారిపల్లె –కృష్ణపట్నం రైల్వేలైనుకు సంబంధించి భూసేకరణ పూర్తి అయ్యింది. రైల్వేలైను కోసం 1900 ఎకరాల భూసేకరణ చేశారు. ఇదే విషయాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గతంలో కేంద్రమంత్రి హోదా టన్నెల్ పరిశీలన సందర్భంగా తెలియజేయడం గమనార్హం. అప్పట్లో అటవీశాఖ మంత్రి అటవీ భూమికి సంబంధించి 325 ఎకరాలు రైల్వేలైనుకు కేటాయించారు. ప్రయాణికుల, సరుకుల రవాణాకు.. కొత్త రైల్వేలైన్ మార్గం చేపట్టడం వల్ల విజయవాడ–గూడూరు–రేణిగుంట –గుంతకల్లు సెక్షన్లో ప్రయాణికుల, సరుకుల రవాణా రైళ్లు నిరంతరాయంగా సాగడానికి వీలవుతుంది. ఈ మార్గం అందుబాటులోకి రాగానే సరుకుల రవాణాలో ఆశించిన అభివృద్ధి సాధ్యపడుతుందని అంచనా. వెనుకబడిన ప్రాంతాల్లో సాంఘిక, ఆర్థిక పురోభివృద్ధికి అవకాశాలు మెరుగవుతాయి. రద్దీగా ఉన్న విజయవాడ–గూడూరు రైలుమార్గం ప్రస్తుతం విజయవాడ–గూడూరు రైలుమార్గం నిరంతరం రైళ్ల రాకపోకలతో అత్యంత రద్దీగా ఉంటోంది. ముంబై, పశ్చిమ తీర ప్రాంతాలకు సరుకుల రవాణా చేయడంలో సౌలభ్యంతో పాటు నిరంతరాయ రవాణా సౌకర్యం కల్పించాలని , సరుకు రవాణా వినియోగదారులు కోరుతున్నారు. 2005–2006లో ఈ కొత్త రైలుప్రాజెక్టు మంజూరైంది. ఈ ప్రాజెక్టు మొత్తం ఏపీలోని నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల మధ్య నుంచి సాగుతోంది. సరుకు రవాణా అవసరాలు తీర్చడానికి, వేగన్ల టర్న్ అరౌండ్ అభివృద్ధి , రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్, కృష్ణపట్నం పోర్ట్ , ఏపీ సర్కారు, సాగరమాల డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్‌ఎంజీసీ , బ్రహ్మిణి స్టీల్స్ సంస్థలు కలిసిన స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీపీ) ద్వారా కృష్ణపట్నం రైల్వే కంపెనీ లిమిటెడ్ (కెఆర్‌సీఎల్)ఈ ప్రాజెక్టును చేపట్టింది. ప్రాజెక్టులో ప్రధానంశాలివే.. ♦ ఓబులవారిపల్లె నుంచి వెంకటాచలం రోడ్ జంక్షన్ వరకున్న రైలుమార్గం పొడవు 93 కి.మీ. ♦ వెంకటాచలం రోడ్ జంక్షన్–వెలికల్లు , చెర్లోపల్లె–ఓబులవారిపల్లె మధ్య పూర్తయిన రైలుమార్గం పొడవు 82 కి.మీ. ♦ వెంకటాచలం రోడ్ జంక్షన్–ఓబులవారిపల్లె మధ్య రైల్వేలైన్ కోసం సవరించిన నిర్మాణ వ్యయం రూ.1,656 కోట్లు. ♦ ఈ మార్గంలో 23 భారీ వంతెనలు, 123 చిన్న వంతెనలు, సబ్‌వేలు 60 ఉన్నాయి. ♦ వెంకటాచలం రోడ్ జంక్షన్–ఓబులవారిపల్లె మధ్య కసుమూరు, కొత్తుండిపల్లె, బ్రహ్మణపల్లె, ఆదూర్పల్లి, నెల్లెపల్లి, రాపూరు, వెల్లికల్లు, చెర్లోపల్లె,నేతివారిపల్లె, మంగపేటరోడ్ కొత్త రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ♦ చెర్లోపల్లె–వెలికల్లు మధ్య కిలోమీటర్ పొడ వు సొరంగం మార్గం నిర్మాణం పూర్తయిం ది. 7కి.మీ పొడవు ఉన్న మరో భారీ సొరంగమార్గం నిర్మాణదశలో కొనసాగుతోంది. -
విద్యుత్ తేవడంలో కేసీఆర్ ఫెయిల్
కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌వాటాను తీసుకురావడంలో సీఎం కే చంద్రశేఖర్ రావు విఫలమయ్యారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ ఏడు నెలల పాలనలో అసెంబ్లీ తీర్మనాలు తప్ప రాష్ట్రానికి ఆయన పెద్దగా చేసిందేమీలేదని జీవన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి న్యాయపరంగారావల్సిన విద్యుత్ వాటా పై ప్రధాని నరేంద్రమోదీ పై ఎందుకు ఒత్తిడి చేయలేక పోయారని కేసీఆర్‌ని ప్రశ్నించారు. ప్రధాని అపాయింట్మెంట్ కూడా సాధించలేకపోతే సీఎంగా కేసీఆర్ అనర్హుడని ఎద్దేవా చేశారు. -
కృష్ణపట్నం.. డబుల్ దగా
రెండో యూనిట్ ట్రయల్ రన్ ఈ వారం నుంచే ప్రయోగాత్మక ఉత్పత్తి సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు వాటాల పంపిణీ వ్యత్యాసం పెరిగిపోతోంది. తెలంగాణకు కృష్ణపట్నం నుంచి రావాల్సిన విద్యుత్తు వాటాల లోటు రెండింతలకు పెరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణపట్నంలో రెండో యూనిట్ నుంచి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. సోమవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వారం నుంచే ఇన్ఫర్మ్ పవర్ (ప్రయోగాత్మక దశ) ఉత్పత్తి మొదలవనుంది. ప్రస్తుతం కృష్ణపట్నం ప్లాంట్‌లో 800 మెగావాట్ల మొదటి యూనిట్ ఉత్పత్తి కొనసాగుతోంది. మార్చి నుంచి ఇప్పటివరకు అందులో ఒక్క యూనిట్‌నూ తెలంగాణకు ఇవ్వకుండా ఏపీ అడ్డుకుంటోంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం నుంచి 53.89 శాతం విద్యుత్తు తెలంగాణ డిస్కంలకు రావాల్సి ఉంది. వాటా ప్రకారం మొదటి యూనిట్ విద్యుత్తు రాకపోవటంతో గడచిన తొమ్మిది నెలల్లో దాదాపు రూ.120 కోట్లు నష్టపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో రెండో యూనిట్ కూడా ప్రారంభమవుతుండటంతో... ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం విద్యుత్తు పంపిణీ చేస్తుందా.. లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం మొండికేస్తే.. విద్యుత్తు వాటాల పంపిణీపై మరింత పట్టు పట్టాలని తెలంగాణ జెన్కో, డిస్కం అధికారులు భావిస్తున్నారు. చట్ట ప్రకారం తెలంగాణకు రావాల్సిన విద్యుత్తు వాటాల పంపిణీ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఇటీవలే ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించింది. మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం రెండో యూనిట్లో విద్యుదుత్పత్తి ఎటువైపు మలుపు తిరుగుతుందనే ఆసక్తి నెలకొంది. -
రాజుకుంటున్న కృష్ణపట్నం
సాక్షి, హైదరాబాద్: కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం వివాదం మరింత తీవ్ర రూపం దాలుస్తోంది. కృష్ణపట్నం విద్యుత్‌లో తెలంగాణకు వాటా లేదని, షేర్లు మాత్రమే ఉన్నాయని ఏపీ విద్యుత్ అధికారులు ప్రాజెక్టు పాలక మండలి సమావేశంలో చెప్పడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ వివాదం అంత సులువుగా తేలేలా లేదన్న ఉద్దేశంతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. దీనిపై తెలంగాణ విద్యుత్ అధికారులు అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో సంప్రదించినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో, రెండు డిస్కమ్‌లకు వాటాలున్న విషయం స్పష్టంగా ఉన్నందున.. కోర్టులో తేల్చుకుంటేనే మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. కోర్టులో వ్యాజ్యం వేయడం కోసం అన్ని రకాల పత్రాలను సిద్ధం చేసినట్లు ఓ ఉన్నతాధికారి వివరించారు. అయితే.. దీనికి ప్రతిగా ఏపీ జెన్కో కూడా కౌంటర్‌తో సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. వివాదం కోర్టుకు వెళితే ఇప్పటికిప్పుడు వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ) ప్రారంభించాల్సిన అవసరం లేదని, అప్పటివరకు ట్రయల్ రన్ పేరుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తామే వినియోగించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. జీవో 29 ప్రకారం కోర్టుకెళ్లినా.. 23.84 శాతం విద్యుత్ మాత్రమే తెలంగాణకు ఇవ్వాల్సి వస్తుందని, సగం వాటా వివాదం సమసిపోతుందని భావిస్తున్నారు. లేదా జీవో ప్రకారం తెలంగాణ వాటాలను అమ్ముకోవడం తప్ప మరో మార్గం ఉండదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారని ఆంధ్రా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీయే వివాదాస్పదం చేస్తోంది.. కృష్ణపట్నం వివాదాన్ని కలసి పరిష్కరించుకోవాలనే తాము భావిస్తున్నట్టు తెలంగాణ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగానే బోర్డు మీటింగ్‌లో ప్రస్తావించామని... కానీ దానిని తిరస్కరించడాన్ని బట్టి, ఏపీనే వివాదాస్పదం చేస్తోందనే వాదనను కోర్టు దృష్టికి తేవాలని వారు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ బోర్డు మీటింగ్‌కు ముందు తెలంగాణ జెన్కో అధికారులు న్యాయ నిపుణులతో చర్చించారు. ఆ క్రమంలోనే తొలుత ఏపీ జెన్కోకు లేఖ రాశారు. కృష్ణపట్నంలో తమకు రావల్సిన వాటా ఇవ్వాలని, వాణిజ్య ఉత్పత్తి తేదీని ప్రకటించాలని కోరారు. కానీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఈఆర్సీ ఆమోదించలేదు కాబట్టి, జీవో 29 ప్రకారం కృష్ణపట్నం తమదేనని ఏపీ అధికారులు వెల్లడించారు. వాటాలున్నాయి కాబట్టి లాభాల్లో మాత్రమే వాటా ఇస్తామన్నారు. 270 మిలియన్ యూనిట్లు నష్టం! కృష్ణపట్నం విషయంలో తమకు జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ జెన్కో సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేసింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకూ దాదాపు రూ. 100 కోట్ల మేర నష్టపోయినట్టు టీ జెన్కో చెబుతోంది. కృష్ణపట్నంలో ఉత్పత్తయిన 500 మిలియన్ యూనిట్లలో 270 మిలియన్ యూనిట్లు తెలంగాణకు ఇవ్వలేదని స్పష్టం చేస్తోంది. అన్నింటిలోనూ వాటాలున్నప్పడు కృష్ణపట్నంలోనూ వాటా ఉంటుందనే అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది. చూపంతా జీవో 29 పైనే.. కృష్ణపట్నం విద్యుత్ విషయమై ఇరు రాష్ట్రాలకు ఇప్పుడు జీవో 29 కీలకం కాబోతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మేలో ఈ జీవోను ఇచ్చారు. అప్పులు, ఆస్తులను పంచే క్రమంలో ఏపీజెన్కో పరిధిలోని ఇతర ప్రాజెక్టుల మాదిరిగానే కృష్ణపట్నంలోని మూలధనంలో తెలంగాణకు 23.84 శాతం, మిగతాది ఏపీ జెన్కోకు కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి విద్యుదుత్పత్తిలో వాటా అంశంపై స్పష్టత లేదు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఈఆర్సీ ఆమోదించలేదని, కాబట్టి ఉత్పత్తి మొత్తం తమకే దక్కుతుందని ఏపీ సర్కారు అంటోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు మొదటి దశలోని 800 మెగావాట్ల ఉత్పత్తిలో ఇన్ఫర్మ్ (కమర్షియల్‌గా చెప్పకముందు జరిగే ఉత్పత్తి) విద్యుదుత్పత్తిని ఏపీ జెన్కో వాడుకుంటోంది. ప్రాజెక్టులో రోజుకో సాంకేతిక సమస్య వస్తోందని, అందుకే వాణిజ్య ఉత్పత్తి తేదీని వెల్లడించడం లేదని చెబుతోంది. మరోవైపు... తమకు వాటా ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఏపీ ఇలా చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. కేంద్ర విద్యుత్ మండలి నిబంధనల ప్రకారం ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించి ఆరు నెలలు దాటగానే వాణిజ్య విద్యుదుత్పత్తిగా పేర్కొంటారు. ఈ లెక్కన మార్చి 31 నుంచే అది అమల్లోకి రావాలి. కానీ సాంకేతిక కారణాల రీత్యా ప్లాంట్ పీఎల్ఎఫ్ పూర్తిస్థాయిలో లేదని ఏపీ జెన్కో అంటోంది. ఇలా ఎవరి వాదన వారు వినిపిస్తుండటంతో తెలంగాణ కోర్టును ఆశ్రయించే ఏర్పాట్లలో ఉంది. -
అతీగతి లేదు..
సాక్షి, నెల్లూరు: నేషనల్ హైవే 67గా ప్రకటించిన కృష్ణపట్నం - బళ్లారి రోడు ్డ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడంలేదు. అసలు పనుల మంజూరే ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డును రోడ్ల భవనాల శాఖ నేషన ల్ హైవేకు అప్పగించడం పూర్తయినా ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. ఇవి కేంద్రప్రభుత్వానికి వెళ్లడం, వారు అంగీకరించడమనే తంతు ఇంకా మిగిలే ఉంది. దీంతో రోడ్డుపనులకు మోక్షం ఎన్నడనేది ప్రశ్నార్థకంగా మారింది. కృష్ణపట్నం - బళ్లారి రోడ్డును నేషనల్ హైవే 67గా మారుస్తున్నట్టు ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఆ సంగతి పెద్దగా పట్టించుకోలేదు. జిల్లాలోని కృష్ణపట్నం నుంచి వైఎస్సార్ జిల్లా మీదుగా అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వరకూ 400 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించాలని ఏహెచ్ నిర్ణయించింది. జిల్లా పరిధిలో ఈ రోడ్డు 130 కిలోమీటర్లు, వైఎస్సార్ జిల్లాలో 240 కిలోమీటర్లు, అనంతపురం జిల్లా పరిధిలో 30 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. ప్రభుత్వ ప్రకటన అనంతరం దాదాపు ఏడాది తర్వాత రోడ్లుభవనాల శాఖ ఈ మార్గాన్ని నేషనల్ హైవేకు ఈ ఏడాది ఆగస్టు 29న అప్పగించింది. అనంతరం ఎన్‌హెచ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం 7 మీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డును 10 మీటర్ల మేర విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా ఇరువైపులా 3 మీటర్ల మేర రోడ్డును హార్డుషోల్డర్గా మార్చనున్నారు. అనంతరం మొత్తంరోడ్డును స్ట్రెంతన్ చేయనున్నారు. ఇందు కోసం ఒక కిలోమీటరుకు సుమారు రెండు కోట్ల మేర ఖర్చు చేయనున్నారు. ఈ లెక్కన రూ.800 కోట్లకు పైనే నిధులు ఖర్చు చేయనున్నారు. డిసెంబర్ నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రప్రభుత్వానికి పంపనున్నట్టు నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ప్రతిపాదనలు అప్పటికి సిద్ధమయ్యే పరిస్థితి కానరావడంలేదు. రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో బహుశా ఎన్నికలకు ముందు రోడ్డుకు నిధులు మంజూరయ్యే అవకాశం లేదన్నది కొందరు అధికారుల అభిప్రాయం. రాబోయే కొత్తప్రభుత్వంలోనే రోడ్డుకు నిధులు మంజూరు కావచ్చన్నది వారి అభిప్రాయం. దీంతో ఇప్పట్లో ఈ నేషనల్ హైవే పనులు పనులు మొదలయ్యేలా లేవు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, కేంద్రమంత్రులు,అధికార పార్టీ ముఖ్యనేతలు స్పందించి తక్షణం నేషనల్ హైవేకు నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.