విద్యుత్ తేవడంలో కేసీఆర్ ఫెయిల్
కృష్ణపట్నం నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్వాటాను తీసుకురావడంలో సీఎం కే చంద్రశేఖర్ రావు విఫలమయ్యారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ ఏడు నెలల పాలనలో అసెంబ్లీ తీర్మనాలు తప్ప రాష్ట్రానికి ఆయన పెద్దగా చేసిందేమీలేదని జీవన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి న్యాయపరంగారావల్సిన విద్యుత్ వాటా పై ప్రధాని నరేంద్రమోదీ పై ఎందుకు ఒత్తిడి చేయలేక పోయారని కేసీఆర్ని ప్రశ్నించారు. ప్రధాని అపాయింట్మెంట్ కూడా సాధించలేకపోతే సీఎంగా కేసీఆర్ అనర్హుడని ఎద్దేవా చేశారు.