కృష్ణ పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నిజామాబాద్నాగారం : నేటి నుంచి కృష్ణ పుష్కరాలు ప్రారంభం కానున్న తరుణంలో నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్ఎం ఖుస్రోషహఖాన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 వరకు నిజామాబాద్ నుంచి బీచుపల్లి, శ్రీశైలం, నాగార్జునసాగర్ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. భక్తుల సంఖ్యను బట్టి బస్సులను కేటాయిస్తామని తెలిపారు. మిగతా వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెం.73828 43670, 73828 45603.