Krishna River basin water allocation
-
జనం మెచ్చేలా 'కృష్ణా' వ్యూహం
-
రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..
హైదరాబాద్ : కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చిందని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారుడు విద్యాసాగర్ రావు అన్నారు. ట్రిబ్యునల్ తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ట్రిబ్యునల్ తీర్పును పూర్తిగా పరిశీలించాకే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. నికర జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటలెంతో భవిష్యత్‌లో తేలుతుందన్నారు. కాగా ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జలాల పంపిణీ చేయాలని బ్రిజేష్ ట్రైబ్యునల్ ఇవాళ తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు వైఖరి వల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వల్లే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణా జలాలను మూడు రాష్ట్రాల మధ్యే పంచాలని కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసినా ఎన్డీయేలోని భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు ఏమాత్రం స్పందించలేదన్నారు. చంద్రబాబు స్పందించకపోవడం వల్లే తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా వచ్చిందని మండిపడ్డారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి కృష్ణా జలాల పంపీణిపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో మాట్లాడి న్యాయం చేయాలని అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఏపీ, తెలంగాణకు న్యాయం జరుగుతుందని నారాయణ అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌తో చర్చించాకే... బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన తర్వాత స్పందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. -
రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశే..
-
‘ఏపీ, తెలంగాణ మధ్యే పంపిణీ జరగాలి’
న్యూఢిల్లీ : కృష్ణా జలాల పున: పంపిణీపై నెలకొన్న వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కృష్ణా జలాలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్యే పంపిణీ జరగాలని ట్రిబ్యునల్ బుధవారం స్పష్టం చేసింది. మిగతా రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా అభ్యంతరాలు తెలపాలని రెండు రాష్ట్రాలకు ట్రిబ్యునల్ సూచించింది. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే కృష్ణా నదీ బేసిన్ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించింది. కృష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు తిరిగి పునఃకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. కాగా, కొత్తగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు వాటికి ఇంతకు ముందు ఇచ్చిన వాటాలోనే పంచుకోవాలని కర్ణాటక, మహారాష్ట్ర ట్రైబ్యునల్‌లో వాదనలు కొనసాగించాయి. ఈమేరకు తీర్పు వెలువడింది. -
‘కృష్ణా’పై మళ్లీ ట్రిబ్యునల్‌కు
రేపు, ఎల్లుండి వాదనలు వినిపించనున్న రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్ నీటి కేటాయింపుల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం మరోమారు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించనుంది. శని, ఆదివారాల్లో (9, 10 తేదీలు) రాష్ట్రం వాదనలు వినిపించనుండగా 14, 15 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. కృష్ణా పరీవాహకాన్ని వాడుకుంటున్న నాలుగు రాష్ట్రాలకు తిరిగి పునఃకేటాయింపులు జరపాలని, గతంలో జరిగిన అన్యాయాన్ని సవరించాలని ట్రిబ్యునల్‌కు రాష్ట్రం కోరనుంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలు తమకు ఉన్న నికర జలాల కేటాయింపుల మేరకే అయినా.. వచ్చిన ప్రవాహాన్ని వచ్చినట్లుగా ఎగువనే వాడుకోవడంతో దిగువ కు చుక్క నీరు చేరడం లేదని, దీంతో నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీకి చేరి మట్టిదిబ్బలుగా మారుతున్నాయన్న అంశాలను ప్రభుత్వం వివరించనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ అవార్డు మేరకు కృష్ణాలో కర్ణాటక, మహారాష్ర్టల్రు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. అయితే బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసింది. మొత్తం 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి వాటిలో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది. నికర జలాలే వినియోగించుకుంటేనే ఖరీఫ్ తొలి రెండు నెలల్లో చుక్కనీరు కిందకు రాని పరిస్థితి ఉంటే, మిగులు జలాలను నిల్వ చేసుకుంటే పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని ట్రిబ్యునల్ దృష్టికి రాష్ట్రం తీసుకెళ్లనుంది. నీటి లభ్యతను అంచనా వేయడానికి తీసుకున్న 65 శాతం డిపెండబులిటీ పద్ధతి, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు అనుమతి వంటి కారణాలతో రాష్ట్రం 130 టీఎంసీల వరకు నీటిని కోల్పోతుందని వివరించనుంది. కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68.5 శాతం, ఆంధ్రా, రాయలసీమలు కలుపుకొని 31.5 శాతం మాత్రమే ఉన్నా కేటాయింపులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ జరిపారని, వాటిని సవరించాలని కోరనుంది.