ksez
-
కాకినాడ తీరం... విస్తరిస్తున్న పారిశ్రామికం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ తీరం కళ్లు మిరుమిట్లు గొలిపే పారిశ్రామిక ప్రగతి వైపు దూసుకెళ్తోంది. కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ (కేఎస్ఈజెడ్) ఏర్పాటై దశాబ్ద కాలం గడచినా చంద్రబాబు పాలనలో ఒక్కరంటే ఒక్క పారిశ్రామికవేత్తా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆయన హయాంలో సెజ్ భూముల బదలాయింపులు తప్ప తదనంతర ప్రగతి కనిపించ లేదు.అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో గడచిన రెండున్నరేళ్లుగా కోట్లాది రూపాయల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు వస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు ఈ ఏడాది అంతానికి పట్టాలెక్కేలా ప్రణాళికతో నడుస్తున్నాయి. ఈ పరిశ్రమలన్నీ పూర్తయితే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సహజ వనరులు సమృద్ధిగా ఉండి సముద్ర తీరానికి ఆనుకుని సుమారు ఏడువేల ఎకరాలను అన్ని అనుమతులతో సెజ్ కోసం సిద్ధం చేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ సరళీకరణ పారిశ్రామిక విధానాలు దోహదం చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన ‘పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్’ నిర్మాణం తొండంగి మండలంలో అరబిందో ఫార్మా దేశంలోనే అతి పెద్ద పెన్సిలిన్ జీ గ్రీన్‌ఫీల్డ్ ఇన్ఫ్రా ప్లాంట్ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 416 ఎకరాలు కేటాయించింది. అరబిందో ఫార్మా అనుబంధ లీఫియస్ ఫార్మా ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. పెన్సిలి జీ డిసెంబర్ నెలాఖరు నాటికి ట్రయల్‌రన్ నిర్వహించాలనే ప్రణాళికతో ఉంది. రూ.2,000 కోట్ల వ్యయంతో 15,000 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటువుతున్న ఈ ప్లాంట్ దేశంలోనే అతి పెద్దదిగా రికార్డును సొంతం చేసుకోనుంది. పీఎల్‌ఐఎస్ పథకం ద్వారా దేశంలో ఎంపికైన తొలి ప్రాజెక్టు లీఫియస్ ఫార్మా పెన్సిలిన్ జీ కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 4,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. చురుగ్గా మేజర్ హార్బర్ నిర్మాణ పనులు ఉప్పాడలో మేజర్ హార్బర్ నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రజాసంకల్పయాత్రలో ఇచి్చన హామీ మేరకు రూ.350 కోట్లతో ప్రతిపాదించారు. సాంకేతిక కారణాలతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా.. ఇప్పటికే 70 శా తం పూర్తి అయింది. ఏకకాలంలో 2,500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 50 వేల కుటుంబాల అవసరాలను తీర్చగలిగేలా, లక్ష టన్నుల సామర్థ్యంతో గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.రూ.2,500 కోట్లతో కాకినాడ గేట్ వే పోర్టు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్) నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందుకోసం సెజ్‌లో 1,650 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. డీప్ సీ పోర్టుగా 11 బెర్తుల సామర్థ్యంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ పోర్టు ద్వారా 16 మిలియన్ టన్నుల కార్గోను ఏటా హ్యాండ్లింగ్ చేసే అవకాశం లభిస్తుంది. 2.70 లక్షల టన్నుల బరువును మోయగల భారీ ఓడలు నిలుపుకునేలా పోర్టు నిర్మాణం జరుగుతోంది. పోర్టు కోసం అన్నవరం నుంచి ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి డీపీఆర్ కూడా సిద్ధమైంది. ఈ పోర్టు నిర్మాణంతో ప్రత్యక్షంగా 3,000, పరోక్షంగా 5,000 మందికి ఉపాధి లభించనుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లు కేటాయించింది. యాంకరేజ్ పోర్టులో అంతర్గత రహదారులు, జట్టీల నిర్మాణాలు చివరి దశకు చేరుకున్నాయి. -
కనీస వేతనం ఇవ్వాలి
సౌకర్యాలు కల్పించాలి కేఎస్ఈజెడ్ బొమ్మల తయారీ కేంద్రం వద్ద కార్మికుల ధర్నా వర్షాన్ని కూడా లెక్క చేయని మహిళలు సీఐటీయూ నాయకుల మద్దతు అరెస్టు చేసిన పోలీసులు కొత్తపల్లి : తమకు కనీస వేతనాలు ఇవ్వాలన్న ప్రధాన డిమాండుతో కేఎస్‌ఈజెడ్‌లోని బొమ్మల తయారీ కేంద్రమైన పాల్స్ ఫ్లష్ బొమ్మల పరిశ్రమలో పని చేస్తున్న మహిళా కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. వారిని పోలీసులు చెదరగొట్టడం, కార్మికులకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నాయకులను అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలుత మహిళా కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీచ్‌రోడ్డులో బైఠాయించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధులు బహిష్కరించి, పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వేణుగోపాల్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పరిశ్రమలో పని చేసే కార్మికులందరికీ ఒక వేతనం ప్రకటించాలని, అందరినీ పర్మినెంట్ చేయాలని, ప్రతి ఒక్కరికీ చట్టప్రకారం నెలకు రూ.9 వేల జీతం చెల్లించాలని, పరిశ్రమలో క్యాంటీ¯ŒS ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పించాలని, ప్రతి ఒక్కరికీ రవాణా ఖర్చులను యాజమాన్యమే భరించాలని, శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు అదే పరిశ్రమలో తాగునీరు కొనుక్కొని తాగాలి్సన దుస్థితి నెలకొందన్నారు. ఆందోళన చేస్తున్న మహిళా కార్మికులతో పరిశ్రమ యాజమాన్య నిర్వాహక సభ్యుడు లల¯ŒS చర్చించారు. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో మహిళలు ఆందోళను మరింత ఉధృతం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసన తెలుపుతున్న మహిళా కార్మికులను చెదరగొట్టారు. సీఐటీయూ నేత వేణుగోపాల్ సహా పలువురిని అరెస్టు చేశారు. -
కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడులు
చైనా తయారీ సంస్థల కోసం 2 వేల ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ కాకినాడ సిటీ : కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ (కేఎస్ఈజెడ్)లో రానున్న ఐదేళ్లలో 2.5 నుంచి 3.5 బిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. కాకినాడ సెజ్‌లో చైనాలోని తయారీ కంపెనీల కోసం 2వేల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు చైనాకు చెందిన గ్వుయ్జూప్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (జీఐఐసీ)తో జీఎంఆర్ కాకినాడ సెజ్ సోమవారం ఒప్పందం చేసుకుంది. చైనాకు చెందిన మూడు ప్రముఖ తయారీ సంస్థల కన్సార్టియం అయిన జీఐఐసీ, కేఎస్‌ఈజెడ్‌లో నాణ్యమైన చైనా పరికరాల తయారీ సంస్థలను స్థాపించేందుకు ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, జీఎంఆర్ ఇన్ఫ్రా బిజినెస్ చైర్మన్ బి.వి.ఎస్.రాప్, జీఐఐసీ అధికారుల సమక్షంలో కాకినాడ సెజ్ అధ్యక్షుడు చల్లా ప్రసన్న ఈ మేరకు అవగాహన ఒప్పందాలపై సోమవారం చైనాలోని షాంఘైలో సంతకాలు చేశారు. ఆ వివరాలను జీఎంఆర్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. చైనాకు చెందిన విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, విండ్, సోలార్ విద్యుత్, స్మార్ట్ టెక్నాలజీ తదితర సంస్థలు కాకినాడ సెజ్‌లో యూనిట్లు స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయని వారు తెలిపారు. ఈ సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు కాకినాడ సెజ్ అధునాతన మౌలిక సౌకర్యాలు కల్పిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో లభించే ప్రయోజనాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని చైర్మన్ రాప్ తెలిపారు. ఇందుకోసం జీఐఐసీ 500 మిలియన్ల యూఎస్ డాలర్లను ఖర్చుచేయనుందని చెప్పారు. -
కాకినాడలో 2500 కోట్లతో జీఎంఆర్ ఓడరేవు
హైదరాబాద్: పోర్టు నిర్మాణ రంగంలోకి తొలిసారి జీఎంఆర్ సంస్థ అడుగుపెడుతోంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కేసెజ్) బ్యాక్ యార్డ్ లో భారీ పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ ప్రాథమిక అధ్యయనం పూర్తి చేసింది. ఆధునికి గ్రీన్ ఫీల్డ్ పోర్టును డెవలప్ చేయడానికి జీఎంఆర్ సిద్దమవుతున్నట్టు తెలిసింది. కార్గో, కంటైనర్ కార్డో, ఎగుమతి, దిగుమతి ఆపరేషన్ల లాంటి సదుపాయాలు కల్పించే విధంగా జీఎంఆర్ ప్రణాళికను సిద్దం చేసుకున్నట్టు సమాచారం. కాకినాడ సెజ్ కు కెటాయించిన 10,500 ఎకరాల్లో పోర్టు కోసం 2100 ఎకరాలను ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. పోర్ట్ నిర్మాణ ప్రాజెక్ట్ వ్యయం 2500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తూర్పు తీరంలో అతిపెద్ద, అధునిక కార్గో హబ్ గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో జీఎంఆర్ సిద్దమైంది. ఆరునెలల్లో పబ్లిక్ హియరింగ్ కు వెళ్తామని.. ఆతర్వాత మూడేళ్లలో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని జీఎంఆర్ అధికారులు తెలిపారు.