కనీస వేతనం ఇవ్వాలి
కనీస వేతనం ఇవ్వాలి
Published Sat, Mar 11 2017 10:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:49 AM
సౌకర్యాలు కల్పించాలి
కేఎస్‌ఈజెడ్ బొమ్మల తయారీ కేంద్రం వద్ద కార్మికుల ధర్నా
వర్షాన్ని కూడా లెక్క చేయని మహిళలు
సీఐటీయూ నాయకుల మద్దతు
అరెస్టు చేసిన పోలీసులు
కొత్తపల్లి : తమకు కనీస వేతనాలు ఇవ్వాలన్న ప్రధాన డిమాండుతో కేఎస్‌ఈజెడ్‌లోని బొమ్మల తయారీ కేంద్రమైన పాల్స్ ఫ్లష్ బొమ్మల పరిశ్రమలో పని చేస్తున్న మహిళా కార్మికులు శనివారం ధర్నా నిర్వహించారు. వారిని పోలీసులు చెదరగొట్టడం, కార్మికులకు మద్దతుగా నిలిచిన సీఐటీయూ నాయకులను అరెస్టు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలుత మహిళా కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీచ్‌రోడ్డులో బైఠాయించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధులు బహిష్కరించి, పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వేణుగోపాల్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పరిశ్రమలో పని చేసే కార్మికులందరికీ ఒక వేతనం ప్రకటించాలని, అందరినీ పర్మినెంట్ చేయాలని, ప్రతి ఒక్కరికీ చట్టప్రకారం నెలకు రూ.9 వేల జీతం చెల్లించాలని, పరిశ్రమలో క్యాంటీ¯ŒS ఏర్పాటు చేసి, భోజన వసతి కల్పించాలని, ప్రతి ఒక్కరికీ రవాణా ఖర్చులను యాజమాన్యమే భరించాలని, శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు అదే పరిశ్రమలో తాగునీరు కొనుక్కొని తాగాలి్సన దుస్థితి నెలకొందన్నారు. ఆందోళన చేస్తున్న మహిళా కార్మికులతో పరిశ్రమ యాజమాన్య నిర్వాహక సభ్యుడు లల¯ŒS చర్చించారు. సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో మహిళలు ఆందోళను మరింత ఉధృతం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు నిరసన తెలుపుతున్న మహిళా కార్మికులను చెదరగొట్టారు. సీఐటీయూ నేత వేణుగోపాల్ సహా పలువురిని అరెస్టు చేశారు.
Advertisement