పరిశ్రమ తెరవాలని కార్మికుల ధర్నా | workers dharna at vishaka distirict | Sakshi
Sakshi News home page

పరిశ్రమ తెరవాలని కార్మికుల ధర్నా

Published Tue, Sep 1 2015 10:40 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

workers dharna at vishaka distirict

అచ్యుతాపురం: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలంలోని సెజ్‌లో ఉన్న డబ్ల్యూఎస్ పరిశ్రమను వెంటనే తెరవాలని కోరుతూ 200 మంది కార్మికులు ధర్నాకు దిగారు. ఈ మేరకు మంగళవారం పరిశ్రమ వద్దకు చేరుకున్న కార్మికులు నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. పాత బకాయిలను వెంటనే చెల్లించి, తిరిగి కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

హుద్‌హుద్ తుపాన్ ప్రభావంతో నష్టాల్లో ఉన్న ఈ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. దీంతో కార్మికులు రోడ్డున పడ్డారు. వెంటనే పరిశ్రమను తెరిచి, కార్మికులకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement