kukatpally constituency
-
గడువు కుదించడం సరికాదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి.. ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 15 రోజులకు కుదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఓటర్ల నమోదు ప్రతిపాదనలు, అభ్యంతరాల సమర్పణ గడువును 45 రోజులుగా నిర్ణయించేలా ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఫర్ పీపుల్స్ ఎమన్సిపేషన్ అధ్యక్షుడు శివప్రసాద్ ఈ పిల్ దాఖలు చేశారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రధాన ఎన్నికల అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. మొదట 2019 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ తర్వాత అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి, ఓటర్ల నమోదు గడువును 2018 జనవరి 1గా మార్చారని పిటిషనర్ వివరించారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోనే ఏకంగా 1.57 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారన్నారు. అధికార పార్టీ అండతోనే ఇది జరిగిందని ఆరోపించారు. ఓట ర్ల పరిశీలనకు అధికారులు ఉదయం 11 నుంచి సాయం త్రం 5 గంటల మధ్య వస్తారని, ఈ సమయంలో ఉద్యోగులు వారి ఉద్యోగాలకు వెళతారని, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తుంటే వారి ఇంటికి తాళాలు వేసి ఉంటాయన్నారు. ఇలాంటి వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని వివరించారు. ఏపీ ఓటర్లే లక్ష్యంగా..: కూకట్పల్లి నియోజకవర్గంలో నివాసముంటున్న ప్రజల్లో 50 శాతం మంది ఏపీకి చెందిన వారని, ప్రభుత్వం వీరినే లక్ష్యంగా చేసుకుని తొలగింపు ప్రక్రియను చేపడుతోందన్నారు. ఇలా ఇప్పటి వరకు 1.57 లక్షల మంది ఓట ర్లను తొలగించారని, ఇది అన్యాయమని తెలిపారు. ఇలా తొలగించిన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యం కావాలంటే ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు తగినంత సమయం ఉండాలని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లను తొలగించడాన్ని చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 25న విచారణ జరిపే అవకాశం ఉంది. -
11న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం
కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఈనెల 11వ తేదీన ప్రారంభించనున్నట్లు రాష్ట్ర అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం తెలిపారు. అదేరోజు రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, పార్టీ అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు. -
మందకొడిగా రీపోలింగ్
కేపీహెచ్‌బీ కాలనీ, న్యూస్‌లైన్: కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని 371/ఏ కేంద్రంలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 53.89 పోలింగ్ శాతం నమోదైంది. గత నెల 30న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం మొరాయించింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మంగళవారం రీపోలింగ్ నిర్వహించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు మందకొడిగా జరిగిన పోలింగ్‌లో 450 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ కేంద్రం పరిధిలోని మొత్తం 835 ఓట్లు ఉన్నాయి. వీరిలో 210 మంది మహిళలు, 240 మంది పురుషులు ఓటు వేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గంగాధర్‌రెడ్డి తెలిపారు. గత నెల 30న పోలైన ఓట్లకంటే 12 తగ్గాయని అధికారులు వెల్లడించారు. కాగా, కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో 29 మంది అభ్యర్థులు నిలిచారు. అయితే, ప్రధానంగా ముగ్గురి మధ్యనే పోటీ ఉంది. జంపన ప్రతాప్ (వైఎస్సార్సీపీ), గొట్టిముక్కల పద్మారావు (టీఆర్ఎస్), ముద్దం నర్సింహయాదవ్ (కాంగ్రెస్) మంగళవారం పోలింగ్ సరళిని పరిశీలించారు. రీపోలింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థులు రీపోలింగ్‌లో నమోదైన ఓట్లపై అంచనాలు వేసుకోవడంతో మునిగిపోయారు. -
రీపోలింగ్‌కు సర్వం సిద్ధం
కేపీహెచ్‌బీ కాలనీ, న్యూస్‌లైన్ : కూకట్పల్లి నియోజకవర్గంలో 371/ఎ పోలింగ్ కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న రీ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.వి. గంగాధర్‌రెడ్డి తెలిపారు. వసంత్‌నగర్‌లోని ఐడీపీఎల్ హౌసింగ్ సోసైటీ లైబ్రరీ భవనంలో రీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఓటర్ల సౌకర్యార్థం టెంట్లు వేసి, డ్రమ్ములతో మంచినీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్లు కేవలం అసెంబ్లీ ఓటు హక్కును మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో పురుషులు 441, మహిళలు 394 వెరసి 835 మంది ఓటర్లు ఉన్నారు. గత నెల 30వ తేదిన నిర్వహించి న సార్వత్రిక ఎన్నికల్లో 462 ఓట్లు పోలయ్యాయి. డివిజన్ పరిధిలోని శ్రీలా పార్క్ ఫ్రైడ్, విశ్వంబర, శిల్పాఎవెన్యూ, ఎస్ఎంఆర్ హైట్స్ ఫ్లాట్లలో నివసించే ప్రజలు రీ పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. రీ పోలింగ్ సందర్బంగా వసంత్‌నగర్ కాలనీలో పోలీసులు పలు సెంటర్లలో వాహనాలు తనిఖీ చేశారు. -
కూకట్పల్లి నుంచి పోటీ చేస్తా : సినీ నటుడు శ్రీహరి
రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ప్రముఖ సినీ నటుడు శ్రీహరి ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ శ్రీహరి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మంగళవారమిక్కడ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం రెండు ముక్కలైనా తెలుగు చిత్ర పరిశ్రమకు నష్టం లేదని, అంతా మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. శాసనసభ ఎన్నిక