రాబోయే శాసనసభ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు ప్రముఖ సినీ నటుడు శ్రీహరి ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ శ్రీహరి పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మంగళవారమిక్కడ తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం రెండు ముక్కలైనా తెలుగు చిత్ర పరిశ్రమకు నష్టం లేదని, అంతా మంచే జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
శాసనసభ ఎన్నిక