kukkapalli venkateswarlu
-
సైకో కిల్లర్‌కు ఉరిశిక్ష
► నెల్లూరు అదనపు సెషన్స్ కోర్టు తీర్పు నెల్లూరు (లీగల్): అతి కిరాతకంగా నలుగురిని హత్య చేసి.. మరో నలుగురిని హతమార్చేందుకు ప్రయత్నించిన ఉన్మాది కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్‌కు ఓ కేసులో ఉరి శిక్ష విధిస్తూ నెల్లూరు 4వ అదనపు సెషన్స్ కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ప్రస్తుతం జంట హత్యల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగా.. మహిళను హత్య చేసిన మరో కేసులో అతడికి ప్రాణం పోయేవరకు ఉరి తీయాలంటూ సెషన్స్ కోర్టు జిల్లా జడ్జి బి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. టీచర్‌గా పనిచేస్తూ నెల్లూరు శ్రీసాయి నగర్లో నివాసముండే రావిప్రోలు ప్రభావతిని గత ఏడాది జూలై 9న వెంకటేష్ దారుణంగా హతమార్చాడు. ఆమె ఇంట్లో ఉండగా.. వెంకటేష్ ఇంట్లో జొరబడి ప్రభావతి తలపై సుత్తితో విచక్షణా రహితంగా కొట్టాడు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె సోదరి కుమారుడు అనంతకృష్ణ, సోదరి కుమార్తె మాధురిపైనా దాడి చేసి వారి తలలు పగులగొట్టాడు. వారి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లను అపహరించుకుపోతుండగా.. ప్రభావతి భర్త నాగేశ్వరరావు అటకాయించారు. స్థానికులు వచ్చి వెంకటేష్‌ను పట్టుకుని బాలాజీ నగర్ పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ప్రభావతి మృతి చెందారు. అనంతకృష్ణ, మాధురి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వెంకటేష్ చేసిన నేరం రుజువు కావడంతో అతనికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నిందితుడు వెంకటేష్ పెద్దచెరుకూరు శివాలయం పూజారి దంపతులు నూతలపాటి చంద్రమౌళీశ్వరరావు, పుష్పవేణిలను హత్య చేసిన కేసులో ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హత్య కేసులోనూ అతను నిందితుడు. వెంకటేష్ మొత్తం నాలుగు హత్యలు, నాలుగు హత్యాయత్నాలకు పాల్పడ్డాడు. ఇతడిపై పలు దోపిడీ కేసులు ఉన్నాయి. ఉరిశిక్ష పడ్డ ఉన్మాది.. చంద్రబాబుకు వీరాభిమాని సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాలుగు హత్యలు.. నాలుగు హత్యాయత్నాలు.. అనేక దోపిడీ, చోరీ కేసుల్లో దోషి అయిన కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ సైకో సుత్తి అలియాస్ వెంకటేష్ సీఎం చంద్రబాబుకు వీరాభిమాని. అతడు టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉండేవాడు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన పాదయాత్రలో ఆయనతో కలసి నడిచాడు. ఇందుకు గుర్తుగా చంద్రబాబుతో కలసి తీసుకున్న ఫొటోలను ఫేస్‌బుక్‌లోనూ ఆప్‌లోడ్ చేశాడు. హిందూపురంలోని బంధువుల ఇంట్లో ఉన్న వెంకటేష్ అక్కడ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. తన మోటార్‌సైకిల్‌పై చంద్రబాబు, బాలకృష్ణ ఫొటోలు ఉంచుకుని తిరిగేవాడు. -
ఆ నరహంతకుడు టీడీపీ వీరాభిమాని
-
ఆ నరహంతకుడు టీడీపీ వీరాభిమాని
ఫేస్‌బుక్‌తో వెలుగులోకి.. నెల్లూరు(టాస్క్ఫోర్సు): నెల్లూరు జిల్లాలో వరుస హత్యలతో హడలెత్తించిన నరహంతకుడు కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వీరాభిమాని అని వెల్లడైంది. నెల్లూరు జిల్లాలోని యర్రబొట్లపల్లి గ్రామానికి చెందిన ఈ కరుడు గట్టిన నేరస్తుడు ఇళ్లలోకి చొరబడి మహిళల్ని, వృద్ధులను సుత్తితో మోది క్రూరంగా హత్యలకు పాల్పడడం తెలిసిందే. తాజాగా నెల్లూరు చిల్డ్రన్స్‌పార్కు సమీపంలో ప్రభావతి అనే మహిళ ఇంట్లో చొరబడి సుత్తితో ఆమెపైన, ఆమె బంధులిద్దరిపైన దాడిచేసి.. బంగారు నగలను అపహరించుకొని వెళుతూ పట్టుబడ్డాడు. దీంతో అతని వివరాలు వెల్లడయ్యాయి. టీడీపీలో చురుగ్గా పనిచేసిన విషయం వెలుగులోకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం చంద్రబాబునాయుడుతో కలసి పాదయాత్రలో సైతం వెంకటేశ్వర్లు పాల్గొన్నాడు. పాదయాత్రలో చంద్రబాబుతో కలసి నడుముకు పచ్చకండువా కట్టుకొని నడిచాడు. ఆ ఫొటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. వెంకటేశ్వర్లు అరెస్ట్ అనంతరం నెల్లూరు పోలీసులు అతని ఫేస్బుక్ ఖాతాను గుర్తించారు. దాన్ని చూడగా టీడీపీ పట్ల అతనికెంత అభిమానముందో అవగతమైంది. దీం తో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఇది జరిగిన గంట వ్యవధిలోనే వెంకటేశ్వర్లు ఫేస్బుక్ అకౌంట్ అంతర్జాలంలో మాయమైంది. ఇప్పుడీ విషయం అందరికీ తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. -
'వర్మ సినిమాలే హత్యలకు ప్రేరేపించాయి'
నెల్లూరు: సినిమాల్లో చూపించే మంచికన్నా చెడునే ఎక్కువగా ప్రభావితం చేస్తాయనేది ఇదో ఉదాహరణ. వివరాల్లోకి వెళితే... సెట్ అప్ బాక్సుల రిపేర్, ఆధార్ అనుసంధానం పేరుతో ఇళ్లలోకి వెళ్లి మహిళలను, వృద్ధులను సుత్తితో క్రూరంగా హత్యలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన కరుడుగట్టిన నేరస్తుడు కుక్కపల్లి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ అలియాస్ వెంకీకి దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలే హత్యలకు ప్రేరేపించాయని విచారణలో వెల్లడించాడు. పట్టపగలు నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో శనివారం మహిళను హత్యచేసి, మరో ఇద్దరిపై హత్యాయత్నం చేసిన వెంకటేశ్వర్లును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. నిందితుడు నెల్లూరు జిల్లా కొండాపూరం మండలం ఎర్రబొట్లపల్లి వాసి. గతంలో నెల్లూరులో పలు దారుణాలకు పాల్పడింది అతనేనని విచారణలో తేలింది. రాంగోపాల్ వర్మ అంటే అభిమానమని, అతడు తీసిన ప్రతి సినిమా లెక్కకు మించి చూసేవాడని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అందులోని కొన్ని ఘటనలు ఊహించుకుని నెల్లూరు జిల్లాలో నలుగురి ప్రాణాలు అతి కిరాతకంగా బలి తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది.