కర్నూలు- గుంటూరు రోడ్డులో లారీ దగ్ధం
కర్నూలు: సాంకేతికలోపంతో ఓ లారీ ప్రధాన రహదారిపై కాలి బూడిద అయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండల కేంద్రంలో సోమవారం ఉదయం జరిగింది. మండల కేంద్రంలోని కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై లారీలో మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు పోలీసుల సహాయంతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.